చిరంజీవి 'విశ్వంభర' విడుదల తేదీ ప్రకటన | Vishwambhara Release On January 2025 | Sakshi
Sakshi News home page

చిరంజీవి 'విశ్వంభర' విడుదల తేదీ ప్రకటన

Published Fri, Feb 2 2024 11:25 AM | Last Updated on Fri, Feb 2 2024 11:33 AM

Vishwambhara Release On January 2025 - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బింబిసారా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్‌ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తాజాగా విడుదల తేదీని కూడా ప్రకటించింది. 2025 జనవరి 10న విశ్వంభర వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు మేకర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించారు.

ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఖర్చుతో ఓ సెట్‌ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సెట్‌ ఉంటుందని, అందుకోసం నిర్మాతలు కూడా భారీగా వెచ్చిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్‌. ఫిబ్రవరి 3 నుంచి మెగాస్టార్‌ షూటింగ్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.

యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తుండగా కెమెరామెన్‌ఘా ఛోటా కె.నాయుడు ఉన్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వవ్యాప్తంగా 'విశ్వంభర' విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement