మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి | Chiranjeevi, Vassishta Starts Shooting For Mega 156 With Pooja Ceremony | Sakshi
Sakshi News home page

Mega 156: మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి

Published Tue, Oct 24 2023 1:21 PM | Last Updated on Tue, Oct 24 2023 1:30 PM

Chiranjeevi And Vassishta Mega156 Pooja Ceremony - Sakshi

మెగా 157 ప్రాజెక్ట్‌ కాస్త నంబర్‌ మారి మెగా 156 అయిన విషయం తెలిసిందే. 'బింబిసార'తో అటు చిత్ర పరిశ్రమ, ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ఠ. తన రెండో సినిమాలోనే  మెగాస్టార్‌ లాంటి లెజెండ్‌ హీరోను డైరెక్టె చేసే ఛాన్స్‌ దక్కించుకున్నాడు.  ఇటీవల నిర్వహించిన ‘సైమా’ (SIIMA) వేడుకల్లో ఉత్తమ పరిచయ దర్శకుడిగా 'బింబిసార' సినిమాతో వశిష్ఠ అవార్డు అందుకున్నారు.

(ఇదీ చదవండి: పవన్‌ కల్యాణ్‌ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్‌)

దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రధాన టీమ్‌ను ఒక వీడియో ద్వారా యూవీ క్రియేషన్స్‌ మేకర్స్‌ ప్రకటించారు. అందులో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణితో వీడియో ప్రారంభం అవుతుంది. ఆపై మెగాస్టార్‌ తన సతీమణి సురేఖతో కలిసి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ చిత్రానికి కెమెరామెన్‌గా  చోటా కె. నాయుడు ఉన్నారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్‌ అందిస్తుండగా.. ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ చంద్రబోస్‌ గేయ రచయితగా ఉన్నారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపారు. కాస్ట్యూమ్స్‌ సుష్మిత కొణిదెల,ఏడిటర్‌ కోటగిరి వెంకటేశ్వర రావు వంటి వారు మెగా 156 ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. త్వరలో ఈ చిత్రానికి టైటిల్‌ కూడా ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement