Chandra Bose
-
మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్‌కు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
మెగా 157 ప్రాజెక్ట్ కాస్త నంబర్ మారి మెగా 156 అయిన విషయం తెలిసిందే. 'బింబిసార'తో అటు చిత్ర పరిశ్రమ, ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ఠ. తన రెండో సినిమాలోనే మెగాస్టార్ లాంటి లెజెండ్ హీరోను డైరెక్టె చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇటీవల నిర్వహించిన ‘సైమా’ (SIIMA) వేడుకల్లో ఉత్తమ పరిచయ దర్శకుడిగా 'బింబిసార' సినిమాతో వశిష్ఠ అవార్డు అందుకున్నారు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రధాన టీమ్‌ను ఒక వీడియో ద్వారా యూవీ క్రియేషన్స్ మేకర్స్ ప్రకటించారు. అందులో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణితో వీడియో ప్రారంభం అవుతుంది. ఆపై మెగాస్టార్ తన సతీమణి సురేఖతో కలిసి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా చోటా కె. నాయుడు ఉన్నారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గేయ రచయితగా ఉన్నారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపారు. కాస్ట్యూమ్స్ సుష్మిత కొణిదెల,ఏడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు వంటి వారు మెగా 156 ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. త్వరలో ఈ చిత్రానికి టైటిల్ కూడా ప్రకటించనున్నారు. -
చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ తాజా చిత్రం.. క్రేజీ అప్డేట్!
యంగ్ హీరో అనురాగ్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఉమాపతి’. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలోని ‘నాకొకటి నీకొకటి’ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రాయగా.. ఆయన చేతుల మీదుగానే విడుదల చేశారు. ఫిదా మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. (ఇది చదవండి: నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్) చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. నీకొకటి నాకొకటి అనే పాటను రిలీజ్ చేశాం. ఈ సినిమాలో ప్రత్యేక గీతం రాసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను రాసిన పాటను నా చేతుల మీదగానే రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తోంది. పాట ఎంత బాగుంటుందో లిరికల్ వీడియో కూడా అంతే బాగుంటుంది.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విడుదల చేసిన ఉమాపతి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కలవాని సినిమాను తెలుగులో ఉమాపతి అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయిగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్! ) -
రాజమౌళి,కీరవాణి,చంద్రబోస్‌లకి హ్యాట్సాప్... పరుచూరి గోపాల కృష్ణ
-
ఆస్కార్ విజేతలకు అరుదైన బహుమతి ఇచ్చిన సినీ పరిశ్రమ
-
ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ..
‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా...’ పాటలో దమ్ముంటే లోకం పాడుతుంది.. ఆడుతుంది.. ఆ పాట విశ్వ విజేత అవుతుంది. ‘నాటు నాటు...’ అందుకో ఉదాహరణ. క్లాస్, మాస్ తేడా లేకుండా నాటు బీటు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగు పరిశ్రమ తొలి ఆస్కార్ ఆనందాన్ని చవి చూసేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, డాల్బీ థియేటర్లో ఇతరుల కరతాళ ధ్వనుల మధ్య చిత్రసంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్‌ని అందుకున్నారు. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ 95వ ఆస్కార్ అవార్డు విశేషాలు తెలుసుకుందాం... అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్‌తో ‘నాటు నాటు..’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్ నామినేషన్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు..’కు చోటు దక్కింది. ‘ నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘అప్లాజ్’, ‘బ్లాక్‌పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’లోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్ ఆస్కార్ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్ చిత్రం (ఆర్ఆర్ఆర్) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే నాన్–ఇంగ్లిష్ పాటల్లో ఆస్కార్ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంగ్లిష్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఏఆర్ రెహమాన్, రచయిత గుల్జార్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే... ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ ఒరిజినల్‌సాంగ్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్) ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్) ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్) ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2) బెస్ట్ సౌండ్: టాప్‌గన్: మ్యావరిక్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిస్ గుడ్ బై యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్) బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) హోస్ట్ జిమ్మిపై నెటిజన్ల ఆగ్రహం ఆస్కార్ వేడుక ప్రారంభంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన వచ్చినప్పుడు హోస్ట్ జిమ్మి ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ మూవీ అన్నట్లుగా చెప్పారు. దీంతో నెటిజన్లు జిమ్మి కిమ్మెల్ను తప్పుపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా అని గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆస్కార్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు హోస్ట్ అయిన జిమ్మీ బాలీవుడ్ మూవీ అనడం సరికాదని çపలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శించారు. డు యూ నో నాటు? ‘నాటు నాటు’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్కక్కర్లేదు. కానీ ఆస్కార్ వేదికపై ‘డు యూ నో నాటు?.. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు’.. అంటూ దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కి ఓ ప్రెజెంటర్‌గా వెళ్లిన దీపికా పదుకోన్ ‘నాటు నాటు’ పాటను పరిచయం చేశారు. వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను పాడగా, వెస్ట్రన్ డ్యాన్సర్స్ కాలు కదిపారు. ఈ వేడుకలో వీక్షకుల్లో ‘నాటు నాటు..’ పాట ఎంత జోష్ నింపిందంటే.. పాట పూర్తయ్యాక అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
"వేద" టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్
ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ పతాకంపై యంగ్ హీరో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటిస్తున్న చిత్రం 'వేద'. ఈ సినిమాకు జేడీ స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్, శివ, రాజీవ్ కుమార్, శ్రీనివాస్ లావూరి, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అనంతరం సుకుమార్ మాట్లాడుతూ..'ఈ సినిమాకు ఏడు కొండల స్వామి లాగా ఏడుగురు నిర్మాతలు ఉన్నారు. ఇక్కడే వీరి సక్సెస్ కన్ఫర్మ్ అయింది. నిర్మాతలందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడు అజయ్, చంద్రబోస్ గారి సాహిత్యం మరో ప్లస్. హీరో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. టీం అందరికీ అల్ ద బెస్ట్' అన్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ..'ప్రపంచంలో ఏడు వింతలు చూడలేదు కానీ.. ఈ సినిమాకు మాత్రం ఏడుగురు నిర్మాతలను చూశాను. చిత్ర దర్శకుడు జేడీ చిన్న నాటి ఫ్రెండ్. తనుకూడా నాలాగే ఇండస్ట్రీలో పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అక్షరానికి గౌరవమిచ్చే సంగీత దర్శకుడు అజయ్‌కు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి మంచి సినిమాలో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది' అన్నారు. (చదవండి: ఈ వయసులో పెళ్లెందుకు అని ట్రోల్స్.. ఎమోషనల్ అయిన సునీత) సొసైటీలో ఉన్న చాలా విషయాలతో ఒక సైకో రొమాంటిక్ థ్రిల్లర్ కథను ముందుకు తీసుకురావడానికి ముగ్గురే కారణమని చిత్ర దర్శకుడు జేడీ స్వామి అన్నారు. వారే చిత్ర నిర్మాతలు, సుకుమార్, చంద్రబోస్ అని తెలిపారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లో చంద్రబోస్ గారితో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు సంగీత దర్శకుడు అజయ్ అన్నారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుందని హీరో చేనాగ్ అన్నారు. -
ఇంకా తగ్గని 'నాటు నాటు' సాంగ్ మేనియా.. ఖాతాలో మరో రికార్డు
Natu Natu Song From RRR Movie Got 200 Million Views ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీ స్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం అనేక వాయిదాలు పడటంతో సినీ ప్రేక్షక లోకం ఎంతో నిరాశకు గురైంది. ఆ నిరాశ నుంచి సాంత్వన కలిగించేందుకు సినిమా టీజర్స్, మేకింగ్ వీడియోస్, పోస్టర్లతో అలరించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'నాటు నాటు' సాంగ్. ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్స్ రికార్డు సృష్టించాయి. అంతేకాకుండా ఈ పాటను అనుకరిస్తూ వివిధ భాషల్లో అనేకమంది తమదైన స్టైల్లో కవర్ సాంగ్స్, రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఇక యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వీక్షణలు దక్కించుకుని ట్రెండ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో రికార్డు సొంతం చేసుకుంది. 'నాటు నాటు' సాంగ్ అన్ని భాషల్లోనూ కలుపుకొని ఏకంగా 200 మిలియన్ క్లబ్‌లోకి చేరుకుంది. ఈ వ్యూస్‌తో తన మేనియా ఇంక తగ్గలేదని దుమ్ములేపుతోంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం తోడవడంతో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడే ఇంత రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్ వెండితెరపై ఏ స్థాయిలో హైలెట్ అవుతుందో చూడాలి. -
వేలి చివర నలుపు రంగు.. మార్చునంటా బతుకురంగు
బంజారాహిల్స్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పనిసరిగా తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటా.. ఓటు వేసిన తరువాతే మిగతా కార్యక్రమాలు చూసుకుంటా.. అని వివరించారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్. ప్రస్తుతం మణికొండలో ఉంటున్నానని ఈసారి కూడా తప్పనిసరిగా వినియోగించుకుంటానని వెల్లడిస్తూ సర్కార్సినిమాలో తాను రాసిన పాటను పంచుకున్నారు. (సర్కార్ సినిమాలో ఓటర్లను చైతన్యపరిచే గీతాన్ని రాశారు చంద్రబోస్. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఈ పాట సూపర్‌హిట్‌గా నిలిచిఓటర్లలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది.) పాట ఇదే... ఉరికితే ఉద్యమం– ఉరిమితే విప్లవం వేలి చివర నలుపు రంగు – మార్చునంటా బతుకురంగు మనకంఠం గంటలు మోగిస్తే అధికారపీఠం అదరాలే... సగటు మనిషి చేతి స్పర్శకే జగతి రాత మారాలే. బెదురుగా ఆగడం– కిందకే అణగడం ఎదురుగా నిలవడం– ఎత్తుకే ఎదగడం నోటుకు ఓటు అమ్మేశావే– మందే తాగి తొంగున్నావే మత్తే దిగి మేల్కోన్నావే ఉరిమితే ఉద్యమం–ఉరికితే విప్లవం మీ రంగుల బొమ్మల వెల మా రక్తం అయితే ఎలా ఈ రాజ్యం మారుట కల నిలదీసి అడుగుదాం మోసమే జరిగితే – కన్నులే మూసినం ద్రోహమే పెరిగితే– ఖర్మగా తలచినాం విందులే వద్దులే– తిండినే అడిగినాం మేడలే వద్దులే– నీడకై నలిగినాం నదులలో నీటినే– కళ్ళలో దాచినాం గుండెలో మండినాం–బూడిదై బతికినాం కమ్ముకున్న మత్తు వీడితే– కనబడునోయ్ కొత్త కాంతులే -
వాజ్‌పేయి.. గాంధీ, మోడీ.. బోస్ వంటి వారు
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయిని మహాత్మ గాంధీతోనూ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని సుభోష్ చంద్రబోస్తోనూ పోల్చారు. జాతీయవాదం, లౌకికవాదం విషయాల్లో వాజ్‌పేయి, మోడీలది ఒకే విధానమని అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడాన్ని సీనియర్ నేత ఎల్ కే అద్వానీ వ్యతిరేకించలేదని, కాకపోతే ప్రకటించిన సమయం పట్ల మాత్రమే అసంతృప్తి చెందారని ఇంద్రేష్ కుమార్ వివరణ ఇచ్చారు. సంఘ్ ఎప్పుడూ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించదని, ఇలాంటి విమర్శలు చేసే వారు అవివేకులని విమర్శించారు.