Vedha Movie Teaser Released By Famous Director Sukumar - Sakshi
Sakshi News home page

Vedha Teaser: 'వేద' టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్

Published Sat, Sep 17 2022 7:31 PM | Last Updated on Sat, Sep 17 2022 9:04 PM

Vedha Movie Teaser Released By Famous Director Sukumar - Sakshi

ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ పతాకంపై యంగ్ హీరో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటిస్తున్న చిత్రం 'వేద'. ఈ సినిమాకు జేడీ స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్, శివ, రాజీవ్ కుమార్, శ్రీనివాస్ లావూరి, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.   

అనంతరం సుకుమార్‌ మాట్లాడుతూ..'ఈ సినిమాకు ఏడు కొండల స్వామి లాగా ఏడుగురు నిర్మాతలు ఉన్నారు. ఇక్కడే వీరి సక్సెస్ కన్‌ఫర్మ్‌ అయింది. నిర్మాతలందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడు అజయ్‌, చంద్రబోస్‌ గారి సాహిత్యం మరో ప్లస్. హీరో ‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా బాగుంది. టీం అందరికీ  అల్ ద  బెస్ట్' అన్నారు.

 ప్రముఖ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ..'ప్రపంచంలో ఏడు వింతలు చూడలేదు కానీ.. ఈ సినిమాకు మాత్రం ఏడుగురు నిర్మాతలను చూశాను. చిత్ర దర్శకుడు  జేడీ చిన్న నాటి  ఫ్రెండ్. తనుకూడా నాలాగే  ఇండస్ట్రీలో పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే అక్షరానికి గౌరవమిచ్చే సంగీత దర్శకుడు అజయ్‌కు మంచి ఫ్యూచర్ ఉంది. ఇలాంటి మంచి సినిమాలో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది' అన్నారు.

(చదవండి:  ఈ వయసులో పెళ్లెందుకు అని ‍ ట్రోల్స్.. ఎమోషనల్ అయిన సునీత)

 సొసైటీలో ఉన్న చాలా విషయాలతో ఒక సైకో రొమాంటిక్ థ్రిల్లర్ కథను ముందుకు తీసుకురావడానికి ముగ్గురే కారణమని చిత్ర దర్శకుడు జేడీ స్వామి అన్నారు. వారే చిత్ర నిర్మాతలు, సుకుమార్, చంద్రబోస్ అని తెలిపారు. ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌లో చంద్రబోస్ గారితో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు సంగీత దర్శకుడు అజయ్ అన్నారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుందని హీరో చేనాగ్ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement