న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయిని మహాత్మ గాంధీతోనూ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని సుభోష్ చంద్రబోస్తోనూ పోల్చారు. జాతీయవాదం, లౌకికవాదం విషయాల్లో వాజ్పేయి, మోడీలది ఒకే విధానమని అన్నారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ఎంపిక చేయడాన్ని సీనియర్ నేత ఎల్ కే అద్వానీ వ్యతిరేకించలేదని, కాకపోతే ప్రకటించిన సమయం పట్ల మాత్రమే అసంతృప్తి చెందారని ఇంద్రేష్ కుమార్ వివరణ ఇచ్చారు. సంఘ్ ఎప్పుడూ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించదని, ఇలాంటి విమర్శలు చేసే వారు అవివేకులని విమర్శించారు.
వాజ్పేయి.. గాంధీ, మోడీ.. బోస్ వంటి వారు
Published Fri, May 2 2014 8:15 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM
Advertisement
Advertisement