ఇంకా తగ్గని 'నాటు నాటు' సాంగ్​ మేనియా.. ఖాతాలో మరో రికార్డు | Natu Natu Song From RRR Movie Got 200 Million Views | Sakshi
Sakshi News home page

Natu Natu Song: ఇంకా తగ్గని 'నాటు నాటు' సాంగ్​ మేనియా.. ఖాతాలో మరో రికార్డు

Published Fri, Feb 25 2022 8:04 PM | Last Updated on Fri, Feb 25 2022 8:06 PM

Natu Natu Song From RRR Movie Got 200 Million Views - Sakshi

Natu Natu Song From RRR Movie Got 200 Million Views ఓటమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​, మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​ల భారీ మల్టీ స్టారర్​ చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. సినీ అభిమానులు, ప్రేక్షకుల ఈ మోస్ట్​ అవేయిటెడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ అనేక కారణాలతో అనేకసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తామని మేకర్స్​ ప్రకటించారు. 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రం అనేక వాయిదాలు పడటంతో సినీ ప్రేక్షక లోకం ఎంతో నిరాశకు గురైంది. ఆ నిరాశ నుంచి సాంత్వన కలిగించేందుకు సినిమా టీజర్స్​, మేకింగ్ వీడియోస్​, పోస్టర్లతో అలరించారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్​ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట 'నాటు నాటు' సాంగ్​. ఈ పాటలో ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ కలిసి వేసిన స్టెప్స్​ రికార్డు సృష్టించాయి. అంతేకాకుండా ఈ పాటను అనుకరిస్తూ వివిధ భాషల్లో అనేకమంది తమదైన స్టైల్​లో కవర్ సాంగ్స్​, రీల్స్​, వీడియోస్​ చేసి ఆకట్టుకున్నారు. ఇక యూట్యూబ్​లో రికార్డ్ స్థాయిలో వీక్షణలు దక్కించుకుని ట్రెండ్​ క్రియేట్​ చేసింది. తాజాగా ఈ పాట మరో రికార్డు సొంతం చేసుకుంది. 'నాటు నాటు' సాంగ్​ అన్ని భాషల్లోనూ కలుపుకొని ఏకంగా 200 మిలియన్ క్లబ్​లోకి చేరుకుంది. ​ఈ వ్యూస్​తో తన మేనియా ఇంక తగ్గలేదని దుమ్ములేపుతోంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్​ సాహిత్యానికి కీరవాణి సంగీతం తోడవడంతో సూపర్​ హిట్​గా నిలిచింది. ఇప్పుడే ఇంత రికార్డ్​ క్రియేట్​ చేస్తున్న ఈ సాంగ్​ వెండితెరపై ఏ స్థాయిలో హైలెట్​ అవుతుందో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement