Nakokati Nikokati Song Launch By Chandra Bose | Umapathi - Sakshi
Sakshi News home page

Avika Gor: చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ తాజా చిత్రం.. క్రేజీ అప్‌డేట్!

Published Tue, Aug 8 2023 6:54 PM | Last Updated on Tue, Aug 8 2023 7:41 PM

Chandrabose Released Song From Anurag and Avika Gor Movie Umapathi - Sakshi

యంగ్ హీరో అనురాగ్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఉమాపతి’.  క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీలోని ‘నాకొకటి నీకొకటి’ మాస్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రాయగా.. ఆయన చేతుల మీదుగానే విడుదల చేశారు. ఫిదా మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

(ఇది చదవండి: నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్‌ రోషన్‌)

చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. నీకొకటి నాకొకటి అనే పాటను రిలీజ్ చేశాం. ఈ సినిమాలో ప్రత్యేక గీతం రాసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను రాసిన పాటను నా చేతుల మీదగానే రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తోంది. పాట ఎంత బాగుంటుందో లిరికల్ వీడియో కూడా అంతే బాగుంటుంది.' అని అన్నారు.

కాగా.. ఇప్పటికే విడుదల చేసిన ఉమాపతి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కలవాని సినిమాను తెలుగులో ఉమాపతి అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయిగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

(ఇది చదవండి:  అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్!  )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement