Anurag
-
Success Story: పట్టుదలకు మారుపేరు అనురాగ్ గౌతమ్
పట్టుదల, ఏకాగ్రత విజయానికి మూలసూత్రాలని చెబుతారు. వీటిని ఆశ్రయించినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. పట్టుదలతో చదివి విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని మనం చూసేవుంటాం. అలాంటి వారిలో ఒకరే అనురాగ్ గౌతమ్.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన అనురాగ్ గౌతమ్ ఐఈఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించాడు. ఆల్ ఇండియా ర్యాంక్ వన్ (ఏఐఆర్ 1) సాధించి, అనురాగ్ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.అనురాగ్ గౌతమ్ బొకారో డీపీఎస్ స్కూలులో చదువుకున్నాడు. అతని తండ్రి అనుపమ్ కుమార్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో అధికారి. అతని తల్లి కుమారి సంగీత గృహిణి. చిన్నతనం నుంచే అనురాగ్‌కు చదువుపై అమితమైన ఆసక్తి ఉంది. పాఠశాల విద్య పూర్తిచేసిన అనురాగ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.తన కుమారుడు ఎన్టీఎస్ఈ, కేవీపీవై తదితర పరీక్షలలో విజయం సాధించాడని అనురాగ్ తండ్రి అనుపమ్ కుమార్ తెలిపారు. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారి కావడం అనురాగ్ కల అని, తొలి ప్రయత్నంలో విఫలమైనా ధైర్యం కోల్పోకుండా, రాత్రి పగలు కష్టపడి ఎట్టకేలకు ఈ పరీక్షలో విజయం సాధించాడన్నారు. రెండవ ప్రయత్నంలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్ తన కలను నెరవేర్చుకున్నాడన్నారు.అనురాగ్ సాధించిన విజయం గురించి తెలుసుకున్న డీపీఎస్ బొకారో ప్రిన్సిపాల్ డాక్టర్ గంగ్వార్ కూడా అనురాగ్‌ను అభినందించారు. ఈ విజయం అతని కుటుంబానికే కాకుండా, రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఎవరైనా అంకితభావంతో పనిచేస్తూ, లక్ష్యం దిశగా పయనించినప్పుడు ఏ సవాలూ పెద్దది కాదనేందుకు ఈ విజయం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
ఎన్నికల వేళ ఈసీ ఆదేశాలు..
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే తొలగించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఆయన స్థానంలో అదే కేడర్‌లోని అత్యంత సీనియర్ డీజీపీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. అర్హులైన అధికారుల పేర్లను ఈ నెల 21వ తేదీలోగా తమకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అనురాగ్ గుప్తాపై వచి్చన ఆరోపణలపై విచారణకు ఈసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు
-
విలేజ్ లవ్‌స్టోరీ
అనురాగ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉమాపతి’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు ఊర్ల మధ్య గొడవలు హీరో హీరోయిన్ల ప్రేమకు ఎలా అడ్డంకిగా మారాయి? ఫైనల్‌గా వీరి లవ్‌స్టోరీ ఎలా ముగుస్తుంది? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందన్నట్లుగా విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది. పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్ కార్తీక్, నేపథ్య సంగీతం: జీవన్ బాబు. -
బిగ్‌బాస్ వార్నింగ్.. డబ్బులిచ్చి మరీ ఎలిమినేట్ అవుతానంటున్న కంటెస్టెంట్!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్. బాలీవుడ్లో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ షోను తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం హిందీలో సీజన్-17 నడుస్తోంది. ఈ సీజన్‌కు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అనురాగ్ ధోబాల్.. హోస్ట్‌గా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని హోస్లో ఉన్న మరో కంటెస్టెంట్ సనా రయీస్ ఖాన్‌తో చెప్పారు. హోస్ట్‌గా ఉండాల్సిన మీరే పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సల్మాన్‌ను ఉద్దేశించి అనురాగ్ ధోబాల్ ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బిగ్‌బాస్.. కంటెస్టెంట్ అనురాగ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించాడు. అయితే బిగ్ బాస్ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న అనురాగ్ ఈ షో నుంచి మధ్యలోనే తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. బిగ్‌బాస్ వార్నింగ్ ఇవ్వడాన్ని తనకు అగౌరవంగా భావిస్తున్నట్లు హౌస్‌మేట్స్‌తో చెప్పడం కనిపించింది. బిగ్ బాస్ తనను తిట్టిన తరువాత స్వచ్ఛందంగా షో నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు హోస్‌మేట్స్‌తో చెప్పారు. ఇకపై ఈ షో గురించి పట్టించుకోనని అనురాగ్ అన్నారు. ఈ షో కంటే నాకు అభిమానులు, కుటుంబం చాలా ముఖ్యమని తెలిపారు. బిగ్ బాస్ షో నుంచి స్వచ్ఛందంగా తప్పుకునేందుకు రూ.2 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని హోస్‌మేట్స్‌తో అనురాగ్ ధోబాల్ అన్నారు. Bhai ne Maa Ka Sapna Pura Kiya Ab Bhai ka Sapna Pura Karte hain ❤️🤌🏻 pic.twitter.com/0hsRKarUNq — Anurag Dobhal (@uk07rider) November 25, 2023 -
హీరోయిన్గా బిగ్‌బాస్ ఫేమ్.. టీజర్ రిలీజ్!
బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ...' చిత్రబృంద సభ్యులు పగలు, రేయి బాగా కష్టపడ్డారు. అనురాగ్, భానుశ్రీ, సోనాక్షి వర్మ, రోషిణిలు అద్భుతంగా నటించారు. మా అందరినీ వెనుక ఉండి నడిపించిన స్వామి, మేడమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘కలశ’ అనే టైటిల్ ఈ సినిమాలోని క్యారెక్టర్. అందుకే కలశం నుంచి ‘కలశ’ను తీసుకోవడం జరిగింది. బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్ చేస్తూ రాసుకున్న సినిమా ఇది. అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.' అని అన్నారు. దర్శకుడు సాగర్ చంద్ర మాట్లాడుతూ... 'టీజర్ చాలా బాగుంది. మంచి ఎమోషన్, యాక్షన్ ఉంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అందరికీ అల్ ది బెస్ట్' అని అన్నారు. నిర్మాత చంద్రజ మాట్లాడుతూ...' రాంబాబు చాలా హార్డ్ వర్కర్. ఈ కథకు కావాల్సిన కమర్షియల్ హంగులతో తెరకెక్కించాం. ఎక్కడా అశ్లీలత లేకుండా చూశాం. సెన్సార్ వారు కూడా కట్స్ లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడం మా తొలి విజయంగా భావిస్తున్నా. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి విజయ్ కురాకుల సంగీతమందించారు. -
పంద్రాగస్టు వేడుకకి వెళ్లమంటే.. ప్రాణం తీసుకున్నాడు
ఆదిలాబాద్: పాఠశాలకు వెళ్లకుండా ఇంటికి ఎందుకు వచ్చావని తండ్రి మందలించడంతో కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీంపూర్ మండలంలోని రాజుల్కోరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిడాం అనురాగ్(13) అందర్‌బంద్ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 4న ఉపాధ్యాయులకు తెలియకుండా ఇంటికి వెళ్లాడు. తిరిగి పాఠశాలకు వెళ్లాలని తండ్రి సీతారాం చెప్పినా వెళ్లలేదు. పంద్రాగస్టు వేడుకలు ఉన్నందున వెళ్లాలని శనివారం మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అనురాగ్ ఇంటి వద్ద పురుగుల మందు తాగి కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై లాల్‌సింగ్‌నాయక్ మృతదేహన్ని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు అప్పగించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఐటీడీఏ ఏపీవో భాస్కర్, ఏటీడీవో నిహారిక రాజుల్కోరిలో కుటుంబసభ్యులను పరామర్శించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని హెచ్ఎం రాజశేఖర్‌ను ఆదేశించారు. -
చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ తాజా చిత్రం.. క్రేజీ అప్డేట్!
యంగ్ హీరో అనురాగ్, చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఉమాపతి’. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే కోటేశ్వర రావు నిర్మిస్తుండగా.. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలోని ‘నాకొకటి నీకొకటి’ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రాయగా.. ఆయన చేతుల మీదుగానే విడుదల చేశారు. ఫిదా మూవీకి పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతమందించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. (ఇది చదవండి: నాకు నత్తి.. ఏం మాట్లాడినా ఎగతాళి చేశారు: హృతిక్ రోషన్) చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. నీకొకటి నాకొకటి అనే పాటను రిలీజ్ చేశాం. ఈ సినిమాలో ప్రత్యేక గీతం రాసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను రాసిన పాటను నా చేతుల మీదగానే రిలీజ్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తోంది. పాట ఎంత బాగుంటుందో లిరికల్ వీడియో కూడా అంతే బాగుంటుంది.' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విడుదల చేసిన ఉమాపతి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కలవాని సినిమాను తెలుగులో ఉమాపతి అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయిగా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. (ఇది చదవండి: అతనిలో నాకు నచ్చింది అదే.. లవర్‌పై శృతిహాసన్ ఆసక్తికర కామెంట్స్! ) -
ఎం జి కామెట్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అనువైన ధరలో
-
గ్రామీణ ప్రేమకథాంశంగా వస్తున్న 'ఉమాపతి'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
అనురాగ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఉమాపతి'. గ్రామీణ నేపథ్యం ఆధారంగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కె.కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శక్తికాంత్ కార్తిక్ సంగీతమందిస్తున్నారు. ప్రేమకథను ఎంతో వినోదాత్మకంగా కామెడీకి పెద్దపీట వేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలవాని' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందిస్తున్నారు. (చదవండి: అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు.. ఎవర్గ్రీన్ బ్యూటీ చెప్పిన రేఖ చిట్కాలివే!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ప్రమోషన్లలో భాగంగా దీపావళి కానుకగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. పచ్చని పంట పొలాల్లో గ్రామీణ వాతావరణంలో ఒకరినొకరు చూసుకుంటున్న పోస్టర్ చూస్తే కచ్చితంగా ప్రేమకథే ప్రధాన అంశంగా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. లవ్ స్టోరీతో పాటు కామెడీ సీన్స్ జోడిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ప్రధాన పాత్రలు పోషించారు. -
మేజర్ తీసినందుకు గర్వంగా ఉంది: నిర్మాతలు అనురాగ్, శరత్
‘‘మేజర్’లాంటి గౌరవప్రదమైన సినిమా తీశాం. దేశమంతా మంచి పేరు వచి్చంది. ఈ సినిమాకు టైటిల్స్ చివర్లో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు కూర్చొని ఉన్నారంటేనే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క’’ అన్నారు నిర్మాతలు అనురాగ్, శరత్. అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్, శరత్ మాట్లాడుతూ– ‘‘మాకు ఛాయ్ బిస్కట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ అనే నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఫస్ట్ షో మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా 200 సినిమాలు మార్కెటింగ్ చేశాం. ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడివి శేష్ చెప్పాడు. నమ్రతగారికి కూడా ఈ కథ నచ్చడంతో మాతో భాగమయ్యారు. ‘మేజర్’ని తెలుగు, హిందీలోనే తీద్దామనుకున్నాం. కేరళలో ఉండే సందీప్ తల్లిదండ్రులను కలిశాక మలయాళంలోనూ డబ్ చేశాం. సందీప్ తల్లిదండ్రులకు రాయల్టీ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నా వారు తిరస్కరించారు. ఆర్మీలో చేరాలనుకున్నవారికి తగిన సపోర్ట్‌గా నిలిచేలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫౌండేషన్ అనే సోషల్ మీడియా వేదిక నెలకొల్పాలనుకున్నాం. అదే మేం వారి తల్లిదండ్రులకు ఇచ్చే రాయలీ్ట. ‘రైటర్ పద్మభూషణ్, మేం ఫేమస్’ సినిమాలు నిర్మించాం. తొట్టెంపూడి వేణు లీడ్ రోల్లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. -
ట్రాక్ట్రర్పై బయటకు వచ్చిన కలెక్టర్ అనురాగ్ జయంతి
-
కేసీఆర్ దృష్టికి తీసుకెళతా!
‘‘ప్రపంచ ప్రఖ్యాత నిర్మల్ బొమ్మల నేపథ్యంలో, అంతరించిపోతున్న హస్తకళలు, కళాకారుల గురించి కృష్ణకుమార్ తీసిన ‘రాధాకృష్ణ’ను అంతా ఆదరించాలి’’ అని తెలంగాణ పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందింది. టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో పుప్పాల సాగరికా కృష్ణకుమార్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి మాట్లాడుతూ–‘‘పూర్తిగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోనే చిత్రీకరించిన సినిమా ఇది. అందులోనూ నిర్మల్ కళాకారుల కష్టాల నేపథ్యంలో మంచి ఆశయంతో తీసినందున ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీనుకెళ్తాను’’ అన్నారు. ‘‘శ్రీనివాస్‌రెడ్డి పట్టుబట్టి ఈ సినిమాలో నాతో ఒక పాత్ర చేయించారు’’ అన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. ‘‘కేవలం ప్రేమకథా చిత్రంగానే కాక అంతరించి పోతున్న హస్తకళలను బ్రతికించాలని ఒక మంచి సందేశాన్ని ‘రాధాకృష్ణ’లో ఇస్తున్నాం’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు పుప్పాల సాగరిక కృష్ణకుమార్. ప్రసాద్ వర్మ, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, నటుడు అలీ, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తదితరులు మాట్లాడారు. -
మంచి సందేశం ఉన్న చిత్రం రాధాకృష్ణ
‘‘కేవలం ప్రేమకథా చిత్రంగానే కాకుండా అంతరించిపోతున్న హస్తకళలను బతికించాలనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘రాధాకృష్ణ’. నవరసాల సమ్మేళనం ఈ చిత్రం. అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘రాధాకృష్ణ’. టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో అనురాగ్, ముస్కాన్ సేథీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి కీలక పాత్రలో నటించారు. పుప్పాల సాగరిక, కృష్ణకుమార్ నిర్మించారు. ఫిబ్రవరి 5న విడుదల కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో.. ‘‘మమ్మల్ని నిర్మాతలుగా పరిచయం చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డికి ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు పుప్పాల కృష్ణకుమార్. ‘‘దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది’’ అన్నారు టి.డి. ప్రసాద్ వర్మ. ఈ కార్యక్రమంలో అనురాగ్, కృష్ణభగవాన్ మాట్లాడారు. -
తంగేడు పువ్వు
అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మించారు. టి.డి. ప్రసాద్‌వర్మ దర్శకత్వం వహించారు. యం.యం. శ్రీలేఖ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలోని ‘తంగేడు పువ్వు...’ పాటను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నిర్మల్ బొమ్మల నేపథ్యంలో లవ్‌స్టోరీని తెరకెక్కించారు ప్రసాద్‌వర్మ. హీరో అనురాగ్‌కి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. చిత్రనిర్మాణ సారధి కృష్ణకుమార్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే విడుదలైన ‘కొట్టుకొట్టు..’ అనే సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘తంగేడు పువ్వు...’ పాటకు కూడా మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ఈ పాట రాసిన అనంత్ శ్రీరామ్‌కి, పాట పాడిన శ్రుతికి అభినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సమర్పకులు శ్రీనివాస్ రెడ్డి, యం.యం. శ్రీలేఖ, హీరో అనురాగ్, దర్శకుడు టి.డి. ప్రసాద్‌వర్మ, రాథోడ్ రాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మల్ బొమ్మ నేపథ్యంలో...
‘‘ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మ కాలక్రమేణా ప్లాస్టిక్ బొమ్మల తాకిడికి కుదుపులకు లోనయ్యింది. ఈ నేపథ్యంలో ఒక గొప్ప సందేశాత్మక ప్రేమకథగా మా ‘రాధాకృష్ణ’ చిత్రం తెరకెక్కించాం’’ అని చిత్ర నిర్మాణసారథి పుప్పాల కృష్ణ కుమార్ అన్నారు. ప్రముఖ దర్శకులు శ్రీనివాసరెడ్డి సమర్పణ, స్క్రీ¯Œ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. హారిణి ఆరాధన క్రియేష¯Œ ్స, శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకాలపై పుప్పాల సాగరిక నిర్మించారు. పుప్పాల కృష్ణకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణ కుమార్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ఎన్నో గొప్ప విశేషాల్లో నిర్మల్ బొమ్మ ప్రత్యేకమైనది. ఆదిలాబాద్ ఆటవీ ప్రాంతంలో లభించే పొనికి చెక్కతో ప్రాణం పోసుకునే నిర్మల్ బొమ్మ తయారీ పరిశ్రమపై ఆధారపడిన ఎంతో మంది కళాకారుల నం ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో మా సినిమా రూపొందింది. మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కెమెరా: సురేందర్ రెడ్డి. -
నిర్మల్ కొయ్యబొమ్మల నేపథ్యంలో...
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మీ పార్వతి తొలిసారి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ శెట్టి జంటగా నటించారు. ప్రసాద్ వర్మ దర్శకత్వం వహించారు. దర్శకుడు ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక, శ్రీనివాస్ కానూరు నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కనుమరుగవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అందరి హృదయాలను హత్తుకునే ఆప్యాయతలు ఉంటాయి. పల్లె వాతావరణంలోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక అందమైన ప్రేమకథ ఇది. ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా చిత్రీకరించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు అతి త్వరలో పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. సంపూర్ణేష్ బాబు, అలీ , కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ. -
టీజర్ ఫ్రెష్‌గా ఉంది – డి. సురేశ్‌బాబు
‘‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ చిత్రకథాంశం యువతకు బాగా చేరువయ్యేలా ఉంది. అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. అనురాగ్ కొణిదెన హీరోగా, శ్వేతా అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా సాయిదేవ రామన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై కొణిదెన కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని సురేశ్‌బాబు విడుదల చేశారు. నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మేం అనుకున్న దానికంటే ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా బాగా వచ్చింది. మా చిత్రకథ నచ్చి టీజర్ విడుదల చేసిన సురేశ్‌బాబుగారికి ధన్యవాదాలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ మా ‘మళ్లీ మళ్లీ చూశా. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అన్నారు సాయిదేవ రామన్. ‘‘కంటెంట్ ఓరియంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవడం హ్యాపీ’’ అన్నారు అనురాగ్. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కెమెరా: సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి సతీష్ పాలకుర్తి. -
సురేష్ బాబు చేతుల మీదుగా ‘మళ్ళీ మళ్ళీ చూశా’ టీజర్
అనురాగ్ కొణిదెనని హీరోగా పరిచయ చేస్తూ క్రిషి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ‘మళ్ళీ మళ్ళీ చూశా’. సాయిదేవ రామన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కొణిదెన కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘మళ్ళీ మళ్ళీ చూశా’ టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. కంటెంట్ యూత్ కు బాగా చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ కు ఆల్ ది బెస్ట్’ అన్నారు. దర్శకుడు సాయిదేవ రామన్ మాట్లాడుతూ.. ‘సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ చిత్రం మా మళ్ళీ మళ్ళీ చూశా సినిమా’ అన్నారు. నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. ‘మా సినిమా కంటెంట్ నచ్చి టీజర్ విడుదల చేసిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో రిలీజ్ ని చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం.’ అన్నారు. -
వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్ ఆత్మహత్య కలకలం!
సాక్షి, హైదరాబాద్ : వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్, జూనియర్ ఆర్టిస్ట్ అనురాగ్ వినిల్ (నాని) ఆత్మహత్య కలకలం రేపుతోంది. వారం రోజుల కిందట అనురాగ్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. అతడు ఆత్మహత్య చేసుకున్న స్థలం, వివరాలపై భిన్న కథనాలు వెలుగు చూస్తున్నాయి. వికారాబాద్ సమీపంలోని మర్పల్లిలో ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతుండగా, హైదరాబాద్ నాగోల్ మమత నగర్లో సూసైడ్ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. కొందరు అనురాగ్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని, కొందరి ప్రోద్బలంతో అతడు బలవన్మరణం చెందాడని తెలుస్తోంది. పలు షార్ట్ఫిల్మ్స్లకు అనురాగ్ పని చేశాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలా జరగడం అతడి కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేని కుటుంబసభ్యులు వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 9వ తేదీన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనురాగ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
రూ.66కే ఆన్లైన్ దుకాణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రాత్రికి రాత్రే మీ ఆఫ్‌లైన్ దుకాణం ఆన్‌లైన్‌లోకి మారిపోవాలంటే? వెబ్సైట్ అభివృద్ధి, నిర్వహణ కోసం టెక్నాలజీ సంస్థలతో.. ఉత్పత్తుల సరఫరా కోసం లాజిస్టిక్స్‌తో.. నగదు లావాదేవీల కోసం పేమెంట్ గేట్వేలతో ఒప్పందం చేసుకోవాలి. నిజానికిది రాత్రికి రాత్రే జరిగే పనేం కాదు. కానీ షాప్మాటిక్తో ఒప్పందం చేసుకుంటే చాలు!! జస్ట్.. 15 నిమిషాల్లో మీ ఆఫ్‌లైన్ స్టోర్ కాస్త ఈ–కామర్స్ స్టోర్‌గా మారిపోతుంది. అంతే! వెబ్సైట్ అభివృద్ధి నుంచి మొదలుపెడితే నిర్వహణ, ప్యాకింగ్, లాజిస్టిక్, పేమెంట్ గేట్‌వే అన్ని రకాల సేవలూ ఒకే వేదికగా అందించడమే దీని ప్రత్యేకత. దీనికయ్యే ఖర్చు 3 నెలలకు రూ.66. ఇదే షాప్‌మాటిక్ సక్సెస్ మంత్రమంటున్నారు హైదరాబాద్‌కు చెందిన అనురాగ్ ఆవుల. మరిన్ని వివరాలు ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారాయన. ‘‘మాది కూకట్పల్లి. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తయ్యాక.. మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశా. ఆ తర్వాత స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్, ఎన్సీఆర్ కార్పొరేషన్లో కొన్నాళ్లు పనిచేశా. అక్కడి నుంచి ఫిన్‌టెక్ కంపెనీ పేపాల్‌లో సింగపూర్‌లో చేరా. వృత్తిరీత్యా ఈ–కామర్స్ కంపెనీలతో పనిచేయాల్సి ఉండటంతో మన దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు (ఎంఎస్ఎంఈ), ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ–కామర్స్ వ్యాపారం ప్రారంభించేందుకు ఎంత వ్యయ ప్రయాసలు పడుతున్నారో తెలిసింది. సులువుగా, అందుబాటు ధరలో దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించుకొని పేపాల్లోని మరో ఇద్దరు సహోద్యోగులు క్రిస్ చెన్, యెన్లీతో కలిసి రూ.2 కోట్ల పెట్టుబడితో 2015 అక్టోబర్‌లో బెంగళూరు కేంద్రంగా షాప్‌మాటిక్.కామ్‌ను ప్రారంభించాం. 15 నిమిషాల్లో ఈ–కామర్స్ స్టోర్.. ప్రస్తుతం 60కి పైగా ఉచిత స్టోర్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. షాప్మాటిక్తో ఒప్పందమైన 15 నిమిషాల్లో ఆన్లైన్ వ్యాపారం ప్రారంభించవచ్చు. ఈ–కామర్స్ నిర్వహణ సేవలతో పాటూ ప్రమోషన్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు, ఉత్పత్తుల రికమండేషన్స్ అన్ని ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం షాప్మాటిక్కు 1.5 లక్షల మంది కస్టమర్లున్నారు. వీరిలో 45 శాతం కస్టమర్లు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల వారే. అత్యధిక కస్టమర్లు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఉన్నారు. ఏపీ, తెలంగాణ వాటా 13 శాతం వరకూ ఉంటుంది. 3, 6, 12 నెలల వారీగా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. 3 నెలలకు రూ.66. నెల రోజుల్లో యూఈఏకి విస్తరణ.. ప్రస్తుతం మన దేశంతో పాటూ సింగపూర్, తైవాన్, హాంకాంగ్ దేశాల్లో సేవలందిస్తున్నాం. నెల రోజుల్లో యూఏఈకి విస్తరించనున్నాం. ఈ ఏడాది ముగిసేలోగా ఇండోనేషియా, ఫిలిప్పిన్స్ దేశాలకు విస్తరించాలని, వచ్చే ఏడాది కాలంలో కస్టమర్ల సంఖ్యను 3 లక్షలకు చేర్చాలని లకి‡్ష్యంచాం. ఉత్పత్తుల డెలివరీ కోసం డెల్హివరీ, ఫెడెక్స్, డీహెచ్ఎల్ వంటి అన్ని కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రూ.70 కోట్ల నిధుల సమీకరణ.. ఏటా 310 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 70 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి మరో 25 మందిని నియమించుకోనున్నాం. గతేడాది ఏసీపీ వెంచర్స్, స్ప్రింగ్స్ సీడ్ క్యాపిటల్ సంస్థలు రూ.25 కోట్ల పెట్టుబడి పెట్టాయి. మరో 2 నెలల్లో రూ.70 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఈ రౌండ్లో పాత ఇన్వెస్టర్లతో పాటూ కొత్తవాళ్లూ ఉంటారు’’ అని అనురాగ్ వివరించారు. -
‘మహా’ ఇసుక కాంట్రాక్టర్ల దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/కోటగిరి: మహారాష్ట్ర ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు దౌర్జన్యానికి తెగబడ్డారు. మంజీరా నదిలో మహారాష్ట్ర క్వారీ పేరుతో తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తుండగా అడ్డుకున్న బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలోని తహసీల్దార్ల బృందంపై దాడికి పాల్పడ్డారు. సుమారు 50 మంది రాళ్లతో దాడి చేశారు. జప్తు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు నది ఒడ్డు వరకు తెచ్చిన 4 జేసీబీలు, డోజర్లను తిరిగి లాక్కెళ్లిపోయారు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యా యి. అధికారుల ఫిర్యాదు మేరకు కోటగిరి పోలీసులు మహారాష్ట్ర క్వారీ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పరిధిలో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మంజీరా నదిలో మహారాష్ట్ర వైపు ఉన్న శాఖా పూర్ క్వారీలో ఇసుక తవ్వుకునేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ క్వారీ కాంట్రాక్టర్ నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి.. రాష్ట్ర భూభాగంలోకి వచ్చి ఇసుక తవ్వుతున్నాడు. పేరుకు మహారాష్ట్ర క్వారీ అయినా.. తోడేస్తున్నది మాత్రం తెలంగాణ భూభాగంలోనే. రాత్రయితే పదుల సంఖ్యలో భారీ యంత్రాలు జిల్లా భూభాగంలో తవ్వడం నిత్యకృత్యమైంది. ఈ క్రమం లో బోధన్ సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వం లోని కోటగిరి, వర్ని, రెంజల్ మండలాల తహసీల్దా ర్లు, డీటీలు, వీఆర్ఓలు సుమారు 30 మందితో కూడిన బృందం మంగళవారం తెల్లవారుజామున నదిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్వారీల నిర్వాహకులు జిల్లా భూభాగంలో ఇసుక తవ్వుతుండగా, నాలుగు జేసీబీలు, డోజర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు.. నది ఒడ్డు వరకు తెచ్చారు. వెంటనే మహారాష్ట్ర క్వారీ నిర్వాహకులు 50 మంది వరకు వచ్చి అధికారుల బృందంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది సాయినాథ్ తలకు గాయాలయ్యాయి. ఈ మేరకు రెవెన్యూ అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర క్వారీ కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దెగ్లూర్‌కు వెళ్లి క్వారీ కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకుంటామని కోటగిరి ఎస్ఐ రాజ్‌భరత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఈసారి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేవలం రెవెన్యూ అధికారులే ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఏటా కొనసాగుతున్న తంతు మహారాష్ట్ర క్వారీల అనుమతుల పేరుతో జిల్లా భూభాగంలోని ఇసుక వనరులను దోచేయడం ఏటా పరిపాటిగా మారింది. జిల్లా అధికారులు అప్పుడప్పుడూ దాడులు చేయడం, కేసు నమోదు చేయడంతో సరిపెడుతున్నారు. గతేడాది మహారాష్ట్ర కాంట్రాక్టర్లు తెలంగాణ భూభాగం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడి చేసి, యంత్రాలను సీజ్ చేశారు. తాజాగా మహారాష్ట్ర క్వారీల నిర్వాహకులు జిల్లా అధికారులపైనే దాడికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. -
ఈ క్షణమే
అనురాగ్‌ని హీరోగా పరిచయం చేస్తూ సాయిదేవ రామన్ దర్శకత్వంలో ‘ఈ క్షణమే’ సినిమా తెరకెక్కుతోంది. శ్వేత కథానాయిక. జనని క్రియేషన్స్ పతాకంపై పోకూరి లక్ష్మణాచారీ నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్లాప్ ఇవ్వగా, జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘‘మా బ్యానర్లో ‘ఈ క్షణమే’ తొలి చిత్రం. సాయిదేవ్ కథే మా సినిమాకి ప్రధాన బలం. అన్నివర్గాలను అలరించే అంశాలతో రూపొందుతోంది. అనురాగ్‌కు మంచి ఇంట్రడక్షన్ సినిమా అవుతుంది’’ అని నిర్మాత పోకూరి లక్ష్మణాచారీ అన్నారు. ‘‘సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే అయింది. జనని బ్యానర్లో ఓ మంచి సినిమాగా ‘ఈ క్షణమే’ నిలుస్తుంది’’ అన్నారు సాయిదేవ రామన్. ‘‘కథ బాగుంది. పది రోజుల్లో షూటింగ్ మొదలుపెడతాం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని అనురాగ్ అన్నారు. శ్వేత, నటుడు సంపూర్ణేష్ బాబు, మైత్రి హాస్పిటల్ అధినేత డా.ప్రకాష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్, పాటలు: అనంత్ శ్రీరామ్, మాటలు: హేమంత్ కార్తీక్. -
అనురాగ్ ఠాకూర్ కొత్త ఇన్నింగ్స్!
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీ ఎంపీ, బీసిసిఐ ఛీఫ్ అనురాగ్ ఠాకూర్ ఇప్పుడు ఎల్టీ అనురాగ్ ఠాకూర్ గా మారిపోయారు. శుక్రవారం ఆయన టెరిటోరియల్ ఆర్మ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు సౌత్ బ్లాక్ లో ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ దల్బీర్ ఎస్ సుహాగ్ ద్వారా టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ గా కొత్త బాధ్యతలు చేపట్టారు. దీంతో మిలటరీలో చేరిన మొదటి బీజేపీ ఎంపీగా ఠాకూర్ రికార్డు సృష్టించారు. బీసీసీఐ చీఫ్, బిజేపీ ఎంపి, 41 ఏళ్ళ అనురాగ్ ఠాకూర్ ఆర్మీ ఆఫీసర్ గా శుక్రవారం ఉదయం నూతన బాధ్యతలు స్వీకరించారు. తాతగారు ఆర్మీలో పనిచేయడంతో తనకు ఆర్మీలోచేరి, దేశానికి సేవ చేయాలన్న కోరిక చిన్నతనంనుంచీ బలంగా ఉండేదని వేడుక సందర్భంగా మాట్లాడిన ఠాకూర్ తెలిపారు. తన కల ఇన్నాళ్ళకు సాకారమైందని, టెరిటోరియల్ ఆర్మీలో పనిచేస్తూ... దేశ ప్రజల సమస్యలను పార్లమెంట్ లో వినిపించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, దేశ భద్రతకు తనవంతు సేవ అందిస్తానని ఠాకూర్ పేర్కొన్నారు. టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించిన పరీక్షను పూర్తి చేసిన అనంతరం ఠాకూర్ తన పర్సనల్ ఇంటర్వ్యూను ఛండీగఢ్ లోనూ, ట్రైనింగ్ ను భోపాల్ లోనూ పూర్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిత్ పూర్ నుంచి లోక్ సభ మెంబర్ గా ఎన్నికైన ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆఫీసర్ కు అవసరమైన ట్రైనింగ్ ను పూర్తి చేశారు. డిఫెన్స్ లో రెగ్యులర్ ఆర్మీ తర్వాతి స్థానంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో.. సుమారు నెలనుంచి, సంవత్సరంపాటు ప్రత్యేక మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న వాలంటీర్లను, అత్యవసర పరిస్థితుల్లో దేశ భద్రతకోసం వినియోగించుకుంటారు. -
ఆర్మీలోకి అనురాగ్ ఠాకూర్!
బీజేపీ ఎంపీ, బిసిసిఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ త్వరలో ఆర్మీలో చేరబోతున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారిగా నూతన ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించిన పరీక్షను, ఇంటర్వూను, పూర్తి చేసిన ఆయన.. తన కల ఇన్నాళ్ళకు సాకారం కానుందని, మిలటరీ డ్రెస్ వేసుకోవాలని, దేశ భద్రతకు తనవంతు సేవ అందించాలన్న కోరిక తీరనుందని ఠాకూర్ వెల్లడించారు. అనురాగ్ ఠాకూర్ త్వరలో ఆర్మీ దుస్తుల్లో కనిపించనున్నారు. టెరిటోరియల్ ఆర్మీ అధికారిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆయన.. దానికి సంబంధఙంచిన పరీక్షను, ఇంటర్వ్యూను పూర్తి చేశారు. బీజేపీ ఎంపీగా, బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన... టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించి, మిలటరీ లో చేరిన మొదటి బీజేపీ ఎంపీగా రికార్డు సృష్టించనున్నారు. తాతగారు ఆర్మీలో పనిచేయడంతో తనకు ఆర్మీలో చేరాలన్న కోరిక బలంగా ఉండేదని, అయితే అనుకోకుండా తన కెరీర్ క్రికెట్, పాలిటిక్స్ మార్గంలోకి మారిపోయిందని ఠాకూర్ తెలిపారు. టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ ఆఫీసర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్న 41 ఏళ్ళ ఠాకూర్.. ఛండీగర్ లో నిర్వహించిన పర్సనల్ ఇంటర్వ్యూలో అర్హత పొందిన అనంతరం, భోపాల్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమిత్ పూర్ నుంచి లోక్ సభ మెంబర్ గా ఎన్నికయిన ఠాకూర్.. టెరిటోరియల్ ఆర్మీలో అర్హతకోసం ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నారు. డిఫెన్స్ లో రెగ్యులర్ ఆర్మీ తర్వాతి స్థానంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీలో.. సుమారు నెల నుంచి సంవత్సరంపాటు ప్రత్యేక మిలటరీ ట్రైనింగ్ తీసుకున్న వాలంటరీర్లను తీసుకొని, అత్యవసర పరిస్థితుల్లో దేశ భద్రతకోసం వినియోగించుకుంటారు. దేశానికి సేవ చేయాలన్న తన కల ఇన్నాళ్ళకు నిజం కాబోతోందని, ఆర్మీ యూనిఫాం ధరించేందుకు ఎంతో తహ తహగా ఉందని ఠాకూర్ ఈ సందర్భంలో తెలిపారు. భద్రతా దళాల్లోని ఎన్నో సమస్యలను ఇప్పటిదాకా బయటినుంచే చూడగల్గుతున్నానని, ఇప్పుడు వాటిని దగ్గరినుంచీ చూడటమే కాక, ఎంపీగా సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి సాధనకోసం పనిచేసే అవకాశం ఉందని తెలిపారు.