మంచి సందేశం ఉన్న చిత్రం రాధాకృష్ణ | Radhakrishna Release Date Fixed | Sakshi
Sakshi News home page

మంచి సందేశం ఉన్న చిత్రం రాధాకృష్ణ

Published Sun, Jan 31 2021 6:31 AM | Last Updated on Sun, Jan 31 2021 6:31 AM

Radhakrishna Release Date Fixed - Sakshi

శ్రీనివాస్‌రెడ్డి, యంయం శ్రీలేఖ, అనురాగ్, కృష్ణకుమార్, టి.డి. ప్రసాద్‌ వర్మ

‘‘కేవలం ప్రేమకథా చిత్రంగానే కాకుండా అంతరించిపోతున్న హస్తకళలను బతికించాలనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘రాధాకృష్ణ’. నవరసాల సమ్మేళనం ఈ చిత్రం. అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘రాధాకృష్ణ’. టి.డి. ప్రసాద్‌ వర్మ దర్శకత్వంలో అనురాగ్, ముస్కాన్‌ సేథీ హీరోహీరోయిన్లుగా నటించారు. ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి కీలక పాత్రలో నటించారు. పుప్పాల సాగరిక, కృష్ణకుమార్‌ నిర్మించారు. ఫిబ్రవరి 5న విడుదల కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో.. ‘‘మమ్మల్ని నిర్మాతలుగా పరిచయం చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డికి ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్‌ చేస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు పుప్పాల కృష్ణకుమార్‌. ‘‘దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది’’ అన్నారు టి.డి. ప్రసాద్‌ వర్మ. ఈ కార్యక్రమంలో అనురాగ్, కృష్ణభగవాన్‌ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement