
ఏ పెళ్లి బెటర్?
అనురాగ్, రోహిత్‌రాజ్, మేర్లిన్ జెస్సీ, ఆషా, సితార ప్రధాన పాత్రధారులుగా రూపొందనున్న చిత్రం ‘గుండెల్లో గుచ్చి గుచ్చి చంపకే’. కృష్ణ తోట దర్శకుడు. షా ఐటి సొల్యూషన్స్ ప్రై.లిమిటెడ్‌తో కలిసి వి.వెంకట్రావ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మార్చి తొలివారంలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో నిర్మాత మాట్లాడుతూ -‘‘మార్చిలో వరంగల్‌లో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు. మే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎంబీఎస్ ప్రసాద్ తెలిపారు. ‘‘ప్రేమ వివాహం,పెద్దలు కుదిర్చిన వివాహం, షరతులతో కూడిన వివాహం, పెళ్లితో నిమిత్తం లేకుండా అవగాహనతో కలిసుండటం వీటిల్లో ఏది బెటర్.. అనే నేపథ్యంలో సరదాగా సాగే సినిమా ఇది’’అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌రెడ్డి, కెమెరా: ఎం.మురళీకృష్ణ.