
జార్ఖండ్ తాత్కాలిక డీజీపీ తొలగింపు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే తొలగించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.
ఆయన స్థానంలో అదే కేడర్‌లోని అత్యంత సీనియర్ డీజీపీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. అర్హులైన అధికారుల పేర్లను ఈ నెల 21వ తేదీలోగా తమకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అనురాగ్ గుప్తాపై వచి్చన ఆరోపణలపై విచారణకు ఈసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.