transfar
-
ఎన్నికల వేళ ఈసీ ఆదేశాలు..
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక డీజీపీ అనురాగ్ గుప్తాను తక్షణమే తొలగించాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఆయన స్థానంలో అదే కేడర్‌లోని అత్యంత సీనియర్ డీజీపీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. అర్హులైన అధికారుల పేర్లను ఈ నెల 21వ తేదీలోగా తమకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అనురాగ్ గుప్తాపై వచి్చన ఆరోపణలపై విచారణకు ఈసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కాగా, నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?
భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్‌ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
ఆస్తుల బదిలీ.. ఇలా ఈజీ!
కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. జీవితాంతం ఎంతో కష్టించి, ఆస్తులు, సంపద కూడబెట్టుకోవడంతోనే సరికాదు. తమ వారికి సాఫీగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆకాంక్ష ఫలిస్తుంది. ఒక ఆస్తికి ఒకటికి మించిన వారసులు ఉంటే పంపకం సమస్యగా మారకూడదు. క్లిష్టమైన కుటుంబ నిర్మాణం ఉన్న వారు ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందే. దురదృష్టవశాత్తూ తమకు ఏదైనా జరిగితే, తమ పేరిట ఉన్న ఆస్తులు వారసులకు సాఫీగా బదిలీ అయ్యేది ఎలా? ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏర్పడకుండా చూసుకునేది ఎలా..? ఎస్టేట్ (ఆస్తి) ప్లానింగ్ ఇందుకు పరిష్కారం అవుతుంది. వీలునామా రాస్తే సరిపోతుందిలే అనుకోవద్దు. దీనికంటే మెరుగైనది కుటుంబ ట్రస్ట్. ఆస్తులనే కాకుండా, కుటుంబ వ్యాపారాల సాఫీ పంపిణీ సైతం ఎస్టేట్ ప్లానింగ్‌తో సాధ్యపడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ అంటే..? ఆస్తుల పంపకాన్నే ఎస్టేట్ ప్లానింగ్‌గా చెబుతారు. తమ మరణానంతరం కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎలా పంపిణీ చేయాలన్నది ఇందులో ఉంటుంది. తమ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటే కుటుంబ వ్యాపారానికి ఎవరు నాయకత్వం వహించాలి? అనే వివరాలు కూడా ఇందులో భాగమే. ప్లాట్లు, ఇళ్లు, పొలాలు, బంగారం, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటికీ ఇందులో చోటు ఉంటుంది. కాయిన్లు, పెయింటింగ్‌లు తదితర అన్నింటి పంపిణీని ఎస్టేట్ ప్లానింగ్‌తో సులభతరం చేసుకోవచ్చు. ట్రస్ట్ ఏర్పాటు కొన్ని కుటుంబాల నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. అలాగే, కొన్ని పెద్ద కుంటుంబాలు ఉంటాయి. మొదటి వివాహం ద్వారా పిల్లలు ఉండి, తర్వాత రెండో వివాహం ద్వారా పిల్లలు కన్న వారికి ఆస్తుల పంపిణీలో సహజంగా వివాదాలు ఏర్పడుతుంటాయి. అలాగే, ప్రత్యేక అవసరాల (దివ్యాంగులు) వారూ ఉండొచ్చు. అలాంటి వారికి ఆస్తుల పంపిణీని తమ ఇష్ట ప్రకారం చేసుకోవాలంటే అందుకు వీలునామా లేదా ఫ్యామిలీ ట్రస్ట్ మార్గాలవుతాయి. తమ సంపద సాఫీగా బదిలీ అయ్యేందుకు ట్రస్ట్ వీలు కలి్పస్తుంది. ట్రస్ట్ అంటే ధర్మనిధి. ట్రస్ట్ ఏర్పాటు చేసే వ్యక్తికి, ధర్మ కర్తలకు మధ్య ఒప్పందమే ట్రస్ట్ డీడ్. దీని ద్వారా తనకు సంబంధించిన ఆస్తులను ధర్మకర్తలకు అప్పగిస్తారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి మరణానంతరం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న విధంగా ఆస్తుల బదిలీ పూర్తి చేయాల్సిన బాధ్యత ట్రస్ట్ నిర్వాహకులపై ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకునే వారు ట్రస్ట్ డీడ్ రాయాల్సి ఉంటుంది. సంపదను ఎలా బదిలీ చేయాలన్నది అందులో స్పష్టంగా పేర్కొనాలి. స్థిర, చరాస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలి. ట్రస్ట్ డీడ్ రాసిన తర్వాత దాని నిర్వహణకు ట్రస్టీ (ధర్మకర్త)ని నియమించాలి. స్టాంప్ డ్యూటీ చెల్లించి, ట్రస్ట్‌ను రిజి్రస్టార్ కార్యాలయం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ట్రస్ట్ ఏర్పాటు ఉద్దేశాన్ని ట్రస్ట్ డీడ్ తెలియజేయాలి. దీని ఏర్పాటు ఉద్దేశం, ఎలా పనిచేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలి. ట్రస్టీ లేదంటే ట్రస్టీలుగా ఎవరిని నియమించాలి? అన్న సందేహం రావచ్చు. స్నేహితులు లేదా బంధువులను ట్రస్టీలుగా నియమించుకోవచ్చు. లేదా కార్పొరేట్ సంస్థను అయినా ట్రస్టీగా నియమించొచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ట్రస్ట్ సేవలను అందిస్తున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరణించినా లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన సందర్భాల్లో ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న సూచనలను ట్రస్ట్ డీడ్‌లో పేర్కొనొచ్చు. అలాగే, ధర్మకర్త జీవించి లేకపోయినా లేక రిటైర్మెంట్ తీసుకున్నా.. తదుపరి ట్రస్టీగా ఎవరు వ్యవహరించాలన్నది కూడా టస్ట్ర్ డీడ్‌లో పేర్కొనాలి. వీలునామా.. కోర్టు విచారణలు! వీలునామా గురించే ఎక్కువ మందికి తెలుసు. సులభమైన, మెరుగైన సాధనమని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. వీలునామా రిజిస్టర్ చేసినా, చేయకపోయినా దాన్ని కోర్టుల్లో సవాలు చేయవచ్చు. వీలునామా అనేది కేవలం వ్యక్తి మరణానంతరం అమల్లోకి వచ్చే పత్రం. వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో వీలునామా పని చేయదు. మరణించిన వ్యక్తి ఆస్తుల బదిలీకి సంబంధించినదే కానీ, ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించినది కాదు. వీలునామా కింద లబి్ధదారులు హక్కులను కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఆ ఆస్తులను వినియోగించుకోవడానికి వీలు పడదు. మోసం, ఫోర్జరీ, ఒత్తిడితో రాయించినట్టు లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సమయంలో రాయించినట్టు, తెలియకుండా రాయించుకున్నట్టు తదితర ఆరోపణలపై వీలునామాను కోర్టులో సవాలు చేయవచ్చు. వీలునామాను రిజిస్టర్ చేసినంత మాత్రాన అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయిపోతుందని అనుకోవడం పొరపాటు. రిజిస్టర్ చేయించిన వీలునామా సైతం కోర్టుల విచారణ పరిధిలోకి వస్తుంది. మనదేశంలో ఎస్టేట్ ప్లానింగ్ కోసం హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఏర్పాటును కొంత మంది అనుసరిస్తుంటారు. ఇది పన్నుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి హెచ్‌యూఎఫ్ రిజిస్టర్ చేసి, ఆస్తులు దానికి బదలాయించారంటే.. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు దఖలు పడతాయి. హెచ్‌యూఎఫ్ పరిధిలోని ఆస్తులను విభజించడం వివాదాలు, కోర్టు కేసులకు దారితీయవచ్చు. వీటన్నింటిలోకి మెరుగైనది ఫ్యామిలీ ట్రస్ట్. పిల్లలకు కూడా.. మైనర్ చిన్నారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎస్టేట్ ప్లానింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తాము లేని రోజున తమ పిల్లల బాధ్యతను బంధువులపై మోపడం.. వారు చూస్తారని ఆశించడం అన్ని సందర్భాల్లో సరైనది అనిపించుకోదు. ఇది పూర్తిస్థాయి, పెద్ద బాధ్యత. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని నిర్వహణ బాధ్యతను కార్పొరేట్ ట్రస్టీకి అప్పగించడం మెరుగైనది అవుతుంది. కార్పొరేట్ ట్రస్టీ అయితే.. ప్రత్యేక అవసరాల పిల్లలకు (దివ్యాంగులు) పూర్తి సమయం పాటు సహాయకుడు/సహాయకురాలిని అందుబాటులో ఉంచుతారు. అలాగే వంట మనిíÙ, వైద్య సాయం సహాయకులు, స్పెషలిస్ట్ డాక్టర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పిల్లలు సాధారణంగా తమ హక్కులను క్లెయిమ్ చేసుకోలేరు. అందుకుని వీలునామా రాస్తే, దాని నిర్వహణ బాధ్యతను ఒకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకే వీలునామాలో ఉన్న ప్రతికూలతల దృష్ట్యా పిల్లల కోసం ఫ్యామిలీ ట్రస్ట్ మెరుగైనది అవుతుంది. ఎవరికి అవసరం..? నిజానికి ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా అనేవి సంపన్నులకేనన్న ఒక అపోహ నెలకొంది. ఇది నిజం కాదు. ప్రతి ఒక్కరికీ ఇది ఎంతగానో సాయపడుతుంది. తమ పేరిట ఆస్తులు ఉన్నా, లేదా అప్పులు ఉన్నా సరే ఎస్టేట్ ప్లానింగ్‌తో వారసులకు మార్గం స్పష్టంగా మారుతుంది. అకాల మరణం ఎదురైతే, తమ పేరిట ఉన్న ఆస్తులు ఎలా పంచాలి? అప్పులు ఎలా తీర్చాలి? ఏ ఆస్తి విక్రయించి అప్పు చెల్లించాలి? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వొచ్చు. నిజానికి మనలో 90 శాతం మంది ఆస్తులకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచించరు. వీలునామా కూడా రాయరు. తాము క్షేమంగా ఉన్నందున, మరణం గురించి చర్చించడం, ఆస్తులపై చర్చను కోరుకోకపోవడం వల్ల ప్రణాళికకు దూరంగా ఉంటుంటారు. నిజానికి ఎంతో ముఖ్యమైన ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. దీనివల్ల ఉపయోగాలే కానీ, నష్టం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ దీనికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మార్గాలు.. నామినేషన్, వీలునామా (విల్లు), ఫ్యామిలీ ట్రస్ట్ ఇవన్నీ ఎస్టేట్ ప్లానింగ్‌లో పలు రకాల సాధనాలు. ఆర్థిక సాధనాలకు నామినేషన్ సదుపాయం ఉంటుంది. సంబంధిత ఆస్తి ఎవరికి వెళ్లాలని అనుకుంటే వారి పేరును నామినీగా నమోదు చేసుకోవచ్చు. కానీ, అన్నింటికీ నామినేషన్ సదుపాయం ఉండదు. ముఖ్యంగా స్థిరాస్తులకు నామినేషన్ చేసుకోలేరు. కనుక అన్నింటికీ పరిష్కారంగా ఫ్యామిలీ ట్రస్ట్ అక్కరకు వస్తుంది. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ లేకుండా ఓ కుటుంబ యజమాని మరణించిన సందర్భాల్లో లేదా వారసులు కాని వ్యక్తి నామినీగా ఉండి వివాదాలు ఏర్పడిన సందర్భాల్లో.. ఆస్తుల పంపిణీ అన్నది ఆయా మతస్థుల వారసత్వ చట్టం ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కోర్టులను ఆశ్రయించాల్సిందే. హిందూ వారసత్వ చట్టం ప్రకారమైతే మరణించిన వ్యక్తి జీవిత భాగస్వామి, అతని తల్లి, పిల్లలకు సమానంగా ఆస్తులు బదిలీ చేసుకోవాలి. ఈ విషయంలో వివాదం ఏర్పడితే అప్పుడు పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది నిజం కాదు.. ట్రస్ట్ ఏర్పాటు చేస్తే, తమ ఆస్తులన్నీ ట్రస్టీ నిర్వహణలోకి వెళ్లిపోతాయని, వాటిపై తాము నియంత్రణ కోల్పోతామనే అపోహ ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దానికి తమ ఆస్తులను బదిలీ చేసిన తర్వాత అప్పుడు ట్రస్టీయే యజమాని అవుతారు. నిజానికి ట్రస్ట్ డీల్‌లో పేర్కొన్న మేరకు బాధ్యతలను నిర్వహించడమే ట్రస్టీ పని. అంతేకానీ, సంబంధిత ట్రస్ట్ నిర్వహణలోని ఆస్తులను వినియోగించుకునే, అనుభవించే హక్కులు ట్రస్టీలకు ఉండవు. కేవలం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న లబి్ధదారుల ప్రయోజనాల కోసమే ఆ ఆస్తులను వినియోగించాల్సి ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వారు జీవించి ఉన్నంత వరకు బదిలీ చేసిన ఆస్తులు, ట్రస్ట్ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. నేడు పలు ప్రొఫెషనల్ ట్రస్ట్ ఏజెన్సీలు ట్రస్టీ సేవలను అందిస్తున్నాయి. అవి ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాయి. ట్రస్ట్ డీడ్‌కు పూర్తి స్థాయి నిర్వాహకుడి మాదిరే పనిచేస్తాయి. -
బదిలీలకు 1,920 దరఖాస్తులు
నిర్మల్: జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ వేగవంతమైంది. బదిలీ కోసం 1,920 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 1,780 మంది దరఖాస్తు చేసుకోగా తాజాగా 140 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఎంఈవోల ద్వారా తమ హార్డు కాపీలను డీఈఓ కార్యాలయానికి పంపించారు. ఆ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు సీనియర్ పీజీ ప్రధానోపాధ్యాయులతోపా టు, ఉపాధ్యాయులను కమిటీగా నియమించారు. -
వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాష్‌బ్యాక్
-
తెలంగాణలో అటవీశాఖ అధికారులు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పలువురు అటవీ శాఖ (IFS) సీనియర్ అధికారులుఅధికారుల బదిలీలు అయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన అధికారుల జాబితాను విడుదల చేసింది. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా డాక్టర్. జి. చంద్రశేఖర్ రెడ్డి అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ గా బి. శ్రీనివాస్. స్టేట్ ట్రేడింగ్ సర్కిల్ అదనపు పీసీసీఎఫ్ గా డాక్టర్ ఏ.కే. సిన్హా. ఐ.టీ, వర్కింగ్ ప్లాన్ అదనపు పీసీసీఎఫ్ గా వినయ్ కుమార్. ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ గా పి. వెంకట రాజా రావు. ఫారెస్ట్ కాలేజీ, పరిశోధనా సంస్థ పర్సన్ ఇంఛార్జిగా ప్రియాంక వర్గీస్ కు అదనపు బాధ్యతలు. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎం.జె. అక్బర్. అదిలాబాద్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డాక్టర్ జి. రామలింగం. వరంగల్ సర్కిల్ జీఫ్ కన్జర్వేటర్ గా ఎస్.జె. ఆశ. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా డి. భీమా నాయక్. మహబూబ్ నగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా ఎన్. క్షితిజ. కరీంనగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ గా బి. సైదులు. నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ గా వీవీఎల్. సుభద్రా దేవి. -
డీఎస్పీ శిరీష బదిలీ
వికారాబాద్: వికారాబాద్ డీఎస్పీ శిరీష రాఘవేంద్రను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2017 ఆగస్టు నెలలో ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆమె శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు వికారాబాద్ వచ్చిన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకుసాగారు. డివిజన్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా తనదైన శైలిలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అన్ని మతాలకు సంబంధించిన పండుగలు.. కులమతాలకు అతీతంగా, శాంతియుతంగా జరుపుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. క్లిష్టమైన అనేక కేసులను తేలికగా ఛేదించిన అధికారిగా అవార్డులు సైతం అందుకున్నారు. ఫిర్యాదే కారణమా..? త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, ఎంపీ,స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఉన్న సమయంలో డీఎస్పీని అకస్మాత్తుగా డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు భూతగాదాలో తలదూర్చడంతో.. బాధితులు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తర్వాతే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా డీఎస్పీని అటాచ్ చేయడం సాధారణంగానే జరిగిందని.. ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏదిఏమైనా గత పది రోజుల క్రితం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్న సీఐ సీతయ్యను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడం మరవక ముందే.. డీఎస్పీని డీజీపీ ఆఫీస్‌కు పంపించడం చర్చనీయాంశంగా మారింది. సీఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసిన తర్వాత శాఖాపరమైన వ్యవహారాలన్నింటినీ డీఎస్పీయే పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆమె కూడా లేకపోవడంతో.. ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ సాగుతోంది. కొత్త అధికారిగా ఎవరు రానున్నారోనని డివిజన్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. -
ఎన్నికల బదిలీలు
సాక్షి, వరంగల్ రూరల్: ఎన్నికల సందర్భంగా జిల్లాలో బదిలీలు జరగనున్నాయి. సొంత జిల్లా అధికారులతోపాటు ఇదే జిల్లాలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు శాఖలో బదిలీల ఫీవర్ పట్టుకుంది. ఎన్నికల సమయంలో దీర్ఘకాలికంగా పనిచేసిన అధికారులు ఒకే దగ్గర ఉంటే అభ్యర్థులకు సహకరించే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది తహసీల్దార్లకు తప్పని బదిలీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో తహసీల్దార్ల బదిలీల ప్రక్రియ ఉన్నతాధికారులు చేపట్టారు. జిల్లాలో తొమ్మిది మంది తహసీల్దార్లకు బదిలీ తప్పేలా లేదు. జిల్లాలో 16 మండలాలుండగా అందులో 9 మంది తహసీల్దార్లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. వచ్చే నవంబర్ 30 నాటికి ఒకే జిల్లా పరిధిలో గడిచిన నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు బదిలీ జాబితాను రూపొందించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తహసీల్దార్లు సరిత(దామెర), హరికృష్ణ(పరకాల), వెంకన్న(ఆత్మకూరు), సుభాషిణి(చెన్నారావుపేట),శ్రీనివాస్(గీసుకొండ), రజినీ(ఖానాపూర్), పూల్‌సింగ్(నర్సంపేట), కనకయ్య(వర్ధన్నపేట), రాంమూర్తి(రాయపర్తి)కి బదిలీ కానున్నట్లు విశ్వనీయంగా తెలిసింది. రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో స్థానికులు తహసీల్దార్లుగా పని చేయడం లేదు. పోలీస్ శాఖలో ఇప్పటికే పూర్తి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో బదిలీలు నెల రోజుల క్రితమే పూర్తయ్యాయి. ఇప్పటికే సీఐ, ఏసీపీ, డీసీపీ స్థాయిలో పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ పని చేస్తున్న పోలీస్ అధికారులను గుర్తించి లూప్ లైన్‌కు పంపించారు. గత నెలలో పోలీస్ శాఖలో బదిలీలు కావడంతో మళ్లీ ఉండకపోవచ్చు తెలుస్తోంది. పోలీసు శాఖ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో తమకు అనుకులమైన పోలీసు అధికారులను టీఆర్ఎస్కు చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేలు బదిలీలు చేయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. -
కొండూర్ శశాంక బదిలీ
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ కొండూర్ శశాంక బదిలీ అయ్యారు. బుధవారం ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీల్లో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఇరవై నెలల పాటు ఇక్కడ సేవలందించిన శశాంక తన సహ జ స్వభావంతో ఐఏఎస్ మార్కు చూపారు. 2016 డిసెంబర్ 8న నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరపాలక సంస్థను అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో నిలిపేందుకు కృషిచేశారు. ముఖ్యంగా స్మార్ట్‌సిటీ సాధనలో కీలక పాత్ర పోషించారు. స్మార్ట్‌సిటీ రేసులో ఉన్నప్పుడు అధికారులను, పాలకులను, ప్రజలను పరుగులు పెట్టించారు. ఢిల్లీ స్థాయిలో స్మార్ట్‌సిటీ హోదా కోసం నిరంతరం శ్రమించారు. స్మార్ట్‌సిటీ పొందిన నగరాలను సందర్శిస్తూ ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుంటూ డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సమర్పించడంలో సఫలీకృతులయ్యారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ నేతృత్వంలో 2017 జూన్ 23న స్మార్ట్‌సిటీ హోదాను సాధించడంలో కీలక భూమిక పోషించారు. స్మార్ట్‌సిటీ హోదాను దక్కించుకోవడంలో ప్రణాళికాబద్ధంగా సమయస్ఫూర్తితో ముందుకెళ్లడంలో శశాంక చేసిన కృషిని ప్రజాప్రతినిధులు సైతం ప్రశంసించారు. ఐఏఎస్ అధికారిగా ఎవరూ పనిచేయనంత కాలం ఇక్కడి పనిచేసి తన సమర్థతను నిరూపించుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్–2018లో.. దేశవాప్తంగా 4 వేల పైచిలుకు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొనగా, కరీంనగర్ మెరుగైన ర్యాంకు సాధించడంలో శశాంక కీలక పాత్ర పోషించారు. కరీంనగర్లో శానిటేషన్ వ్యవస ్థను మెరుగపరచడంలోనూ, ఇంటింటి చెత్త సేకరణ, డంప్‌యార్డుకు చెత్తను తరలించడం, వీ ధుల్లో చెత్త కనిపించకుండా చేయడం, ఓడీఎఫ్ సాధించడంలో, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, వాటి నిర్వహణలో మెరుగైన సేవలందించడంతో దేశంలో 73వ ర్యాంకు సాధించాం. అప్పటికే స్మార్ట్‌సిటీ సాధించుకున్న నగరానికి స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ ర్యాంకు రావడంతో దేశం చూపు ఒక్కసారిగా కరీంనగర్‌పై పడింది. జీవన ప్రమాణాల్లో 11వ ర్యాంకు.. జీవన ప్రమాణాల అంశంపై దేశవ్యాప్తంగా 111 నగరాల్లో జరిగిన సర్వేలో కరీంనగర్‌కు 11వ ర్యాంకు రావడంలో కమిషనర్ పాత్ర ఎంతో ఉంది. ఈ అంశంపై పోటీ జరుగుతుందనే విషయం కూడా తెలియని నగరాలు చాలా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక పద్ధతి ప్రకారంగా పనులు చేస్తూ ప్రజల మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడంతోపాటు నివేదికను సిద్ధం చేసి సమర్పించడంలో విజయం సాధించారు. తెలంగాణలోనే మొదటి స్థానంలో కరీంనగర్ నిలువగా, ఇక్కడి నుంచి పోటీ పడ్డ హైదరాబాద్‌కు 23, వరంగల్‌కు 61వ ర్యాంకు రావడం గమనార్హం. హరిత అవార్డు.. కరీంనగర్లో హరితహారంలో నాటిన మొక్కలను కాపాడడంలో సక్సెస్ సాధించారు. గతేడాది నాటిన మొక్కల్లో 80 శాతం మొక్కలను కాపాడి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డుల్లో హరిత నగరం అవార్డు కరీంనగర్‌కు దక్కేలా కృషి చేశారు. విద్యార్థులకు సమ్మర్‌క్యాంపులు.. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థుల కోసం రెండు దఫాలుగా నిర్వహించిన సమ్మర్ క్యాంపుల్లో వేలాది మంది విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. వివిధ క్రీడాంశాల్లో నిర్వహించిన శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. 2017లో 1,300 మందికి, 2018లో 2,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో మెరుగైన పాత్ర పోషించారు. కలెక్టర్లుగా కమిషనర్లు.. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇప్పటివరకు ముగ్గురు ఐఏఎస్‌లు పనిచేశారు. వీరంతా జగిత్యాల సబ్‌కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ చేసి తర్వాత కమిషనర్లుగా కరీంనగర్ వచ్చారు. మొదటి శ్రీకేష్‌లఠ్కర్ కమిషనర్‌గా రాగా.. ఆయన 2014లో రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన కృష్ణభాస్కర్ జిల్లాల విభజనతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం పనిచేసిన శశాంక జోగులాంభగద్వాల జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్నారు. మొత్తం మీద ఇద్దరు ఐఏఎస్‌లకు కరీంనగర్ కలిసివచ్చిందనే చెప్పవచ్చు. జేసీలుగా పనిచేయకుండానే డైరెక్ట్ కలెక్టర్లు కావడం గమనార్హం. -
ఎంబీఎంసీ కమిషనర్ బదిలీ
సాక్షి, ముంబై : మీరా–భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ)లో కమిషనర్ల బదిలీల పరంపర కొనసాగుతూనే ఉంది. అధికార బీజేపీ, ఎంబీఎంసీ కమిషనర్ నరేశ్ గీతే మధ్య కొనసాగుతున్న వివాదం తారస్థాయికి చేరడంతో బదిలీ చేశారు. నరేశ్ గీతే కేవలం సంవత్సరన్నర కాలం మాత్రమే ఎంబీఎంసీలో విధులు నిర్వహించారు. వివిధ కారణాల వల్ల 2011 తరువాత ఒక్కరు కూడా పూర్తికాలం విధులు నిర్వహించలేకపోవడం గమనార్హం. దీంతో కమిషనర్ల బదిలీల సంఖ్య ఐదుకు చేరింది. ఒత్తిళ్లకు లొంగబోనని.. ఎంబీఎంసీలో బీజేపీ అధికారంలో ఉంది. కొద్ది రోజులుగా ఎంబీఎంసీ కమిషనర్ నరేశ్ గీతే, ఇతర ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర మెహతా మధ్య రాజీ కుదరలేదు. గీతే నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మెహతా ఆరోపించారు. పరిపాలన విభాగం విధించిన నియమాలకు లోబడి పనిచేస్తానని, మీ ఒత్తిళ్లకు, బెదిరింపులకు తను భయపడడని కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడే గీతే అధికార పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం జరుగుతూనే ఉంది. ఫలితంగా అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. దీంతో వచ్చే ఆర్థిక బడ్జెట్ సమావేశంలో దీని ప్రభావం కచ్చితంగా చూపనుంది. వీరి మధ్య జరుగుతున్న వివాదం రోజురోజుకు తారస్థాయికి చేరుకుంది. పరిష్కారమయ్యే మార్గం కనిపించకపోవడంతో, అధికార పార్టీ కార్పొరేటర్లు నేరుగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. అందులో గీతే బదిలీ విషయంపై చర్చించి, ఆయన్ని బదిలీ చేశారు. కమిషనర్లపై బదిలీ వేటు.. 2011లో కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌పై కేవలం సంవత్సరన్నర కాలంలోనే బదిలీ వేటు పడింది. ఆ తరువాత వచ్చిన సురేశ్ కాకాణీ, సుభాష్ లాఖే, అచ్యుత్ హాంగే లపై కూడా సంవత్సరన్నర పదవీ కాలం పూర్తిచేయకుండానే బదిలీ చేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారులకు కార్పొరేషన్ పనితీరును తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఆ తరువాత ఈ అధికారులు తమ పనిలో స్థిరపడతారు. కానీ, ప్రజా ప్రతినిధులతో ఎలా మసులుకోవాలి, వారితో కలిసి ఎలా పనిచేయాలో అప్పటికీ ఇంకా వీరికి తెలియదు. ఇది తెలుసుకునే లోపు వారి మధ్య విభేదాలు పొడచూపడం, వివాదానికి దారి తీయడం, బదిలీ వేటు పడటం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. -
పది మంది డీటీల బదిలీ
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 10 మందిని బదిలీ చేశారు. అలాగే సెలవులో ఉన్న చండ్రుగొండ తహసీల్దార్ ఎన్.అరుణకు డిప్యూటేషన్‌పై కలెక్టరేట్లో పోస్టింగ్ ఇచ్చారు. కాగా.. డీటీల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కె.ప్రమీలæ నేలకొండపల్లి(లీవ్) డీఎం సివిల్æసప్లై, ఖమ్మం ఎంఏ.రాజు సెలవులో అశ్వాపురం డీటీ టి.వేణుగోపాల్ జూలూరుపాడు డీఎం సివిల్ సప్లై బి.వెంకటేశ్వరరావు ఎస్డీసీ కంతనపల్లి రికవరీ ఆఫీసర్ ఎస్వీ.నారాయణమూర్తి చింతకాని ఎస్డీసీ కంతనపల్లి జీఎల్ఎస్.స్వామి దుమ్ముగూడెం జూలూరుపాడు డీటీ ఆర్ఏ.రామకష్ణ ఖమ్మం అర్బన్ ఎలక్షన్ చింతకాని డిప్యూటేషన్ కలెక్టరేట్ బి.భద్రాకాళి ఇల్లెందు తల్లాడ డీటీ బి.విజయ ఎలక్షన్ డీటీ ఇల్లెందు ఇల్లెందు డీటీ ఎస్.అంజమ్రాజు వైరా డీటీ ఇల్లెందు ఎలక్షన్ డీటీ –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
రామగుండం ఎన్టీపీసీ జీఎం బదిలీ
జ్యోతినగర్: ఎన్టీపీసీ, రామగుండం జనరల్ మేనేజర్ వి.ఎం. రాజన్ బదిలీ అయ్యారు. ఆపరేషన్ విభాగంలో జీఎంగా విధులు నిర్వహిస్తున్న ఆయన చెన్నైలోని వల్లూర్ ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ ప్రాజెక్టుకు బదిలీ అయ్యారు. రాజన్‌ను బుధవారం పరిపాలనా భవనంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు సన్మానించారు. రాజన్ స్థానంలో బెనర్జీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.