ఆదిలాబాద్: పాఠశాలకు వెళ్లకుండా ఇంటికి ఎందుకు వచ్చావని తండ్రి మందలించడంతో కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీంపూర్ మండలంలోని రాజుల్‌కోరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిడాం అనురాగ్(13) అందర్‌బంద్ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 4న ఉపాధ్యాయులకు తెలియకుండా ఇంటికి వెళ్లాడు. తిరిగి పాఠశాలకు వెళ్లాలని తండ్రి సీతారాం చెప్పినా వెళ్లలేదు. పంద్రాగస్టు వేడుకలు ఉన్నందున వెళ్లాలని శనివారం మందలించాడు.
దీంతో మనస్తాపం చెందిన అనురాగ్ ఇంటి వద్ద పురుగుల మందు తాగి కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై లాల్‌సింగ్‌నాయక్ మృతదేహన్ని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు అప్పగించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఐటీడీఏ ఏపీవో భాస్కర్, ఏటీడీవో నిహారిక రాజుల్‌కోరిలో కుటుంబసభ్యులను పరామర్శించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని హెచ్‌ఎం రాజశేఖర్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment