
అనురాగ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఉమాపతి'. గ్రామీణ నేపథ్యం ఆధారంగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కె.కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శక్తికాంత్ కార్తిక్ సంగీతమందిస్తున్నారు. ప్రేమకథను ఎంతో వినోదాత్మకంగా కామెడీకి పెద్దపీట వేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలవాని' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందిస్తున్నారు.
(చదవండి: అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు.. ఎవర్‌గ్రీన్ బ్యూటీ చెప్పిన రేఖ చిట్కాలివే!)
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ప్రమోషన్లలో భాగంగా దీపావళి కానుకగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. పచ్చని పంట పొలాల్లో గ్రామీణ వాతావరణంలో ఒకరినొకరు చూసుకుంటున్న పోస్టర్ చూస్తే కచ్చితంగా ప్రేమకథే ప్రధాన అంశంగా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది.
లవ్ స్టోరీతో పాటు కామెడీ సీన్స్ జోడిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment