మెగా అభిమాని జీఎస్ఎన్ నాయుడు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం యుగల్. ది మాన్ విత్ డైవర్సన్ అనేదే ట్యాగ్ లైన్. ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్ బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మి గణ సుబ్రమణ్య స్వామి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం.
హీరో జీఎస్ఎన్ నాయుడు మాట్లాడుతూ.. 'మొదట ఈ చిత్రానికి గన్ని అనే టైటిల్ అనుకున్నాం. కానీ తర్వాత యుగల్ పేరు ఖరారు చేశాం. మేము ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి.' అని తెలిపారు.
దర్శకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ..' ఈరోజు యుగల్ మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హీరో మెగా పవర్ స్టార్ వీరాభిమాని. అందుకే మా చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రం పవన్ కల్యాణ్ అభిమానులకి విపరీతంగా నచ్చుతుంది. కథ స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. మీ అందరికి సినిమా బాగా నచ్చుతుంది" అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment