Avikagor
-
‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నిర్మాతగా మారడానికి ఇదే సరైన కథ! – అవికా గోర్
‘‘నిర్మాతని కావాలని నా 21వ ఏటనే అనుకున్నాను.. నిర్మాతగా మారడానికి ‘పాప్ కార్న్’ సరైన కథ. అందుకే ఈ చిత్రంతో తొలి అడుగు వేశాను’’ అని అవికా గోర్ అన్నారు. సాయి రోనక్ హీరోగా మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాప్ కార్న్’. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా నటించడంతో ΄ాటు నిర్మాతగా (సహ నిర్మాత) మారారు. ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో భోగేంద్ర గుప్త నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్ చెప్పిన విశేషాలు. ♦ డైరెక్టర్ మురళి చెప్పిన ‘పాప్ కార్న్’ కథ ఆసక్తిగా అనిపించింది. 90 శాతం లిఫ్ట్‌లో జరిగే కథ ఇది. ఇప్పుడు ఆడియెన్స్ కి మంచి కంటెంట్ లేదా మాస్ మసాలా కావాలి. ఆ రెంటినీ బ్యాలన్స్ చేస్తూ ‘పాప్ కార్న్’ తీశారు మురళి. ♦ చిత్రపరిశ్రమలో నాకు గాడ్‌ఫాదర్స్ లేరు. అందుకే నేను నిర్మాతగా చేస్తానని చెప్పగానే ముందు సందేహం వ్యక్తం చేశారు మా పేరెంట్స్. కానీ, ఇది నా కల అని చెప్పగానే వాళ్లు ఒప్పుకున్నారు. నిర్మాతగా సినిమా ఎలా వస్తోంది? ఎలా ప్రమోట్ చేయాలి? అని ఆలోచించడం కొత్తగా అనిపించింది. నాప్రొడక్షన్ హౌస్‌లో మరో సినిమా షూటింగ్ చేశాం. అలాగే ఇంకో మూవీ ప్రీప్రొడక్షన్ జరుగుతోంది. ♦ ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్నాను. ‘1920’ అనే చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెడుతున్నాను. -
గ్రామీణ ప్రేమకథాంశంగా వస్తున్న 'ఉమాపతి'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
అనురాగ్, అవికా గోర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఉమాపతి'. గ్రామీణ నేపథ్యం ఆధారంగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కె.కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శక్తికాంత్ కార్తిక్ సంగీతమందిస్తున్నారు. ప్రేమకథను ఎంతో వినోదాత్మకంగా కామెడీకి పెద్దపీట వేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలవాని' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందిస్తున్నారు. (చదవండి: అందం అంటే మేని మెరుపు ఒక్కటే కాదు.. ఎవర్గ్రీన్ బ్యూటీ చెప్పిన రేఖ చిట్కాలివే!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ప్రమోషన్లలో భాగంగా దీపావళి కానుకగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తే హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. పచ్చని పంట పొలాల్లో గ్రామీణ వాతావరణంలో ఒకరినొకరు చూసుకుంటున్న పోస్టర్ చూస్తే కచ్చితంగా ప్రేమకథే ప్రధాన అంశంగా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. లవ్ స్టోరీతో పాటు కామెడీ సీన్స్ జోడిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ప్రధాన పాత్రలు పోషించారు. -
‘నెట్’ మూవీ ట్రైలర్ విడుదల, సస్పెన్స్ మమూలుగా లేదుగా..
హీరోయిన్ అవికాగోర్, కమెడియన్ రాహుల్ రామకృష్ణ కాంబోలో వస్తున్న చిత్రం ‘నెట్’. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అవికాగోర్.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించగా.. అశ్లీల చిత్రాలు వీక్షించే యువకుడిగా రాహుల్ కనిపిస్తాడు. ఈ క్రమంలో ప్రియ ఇంట్లో సీక్రెట్ కెమెరాలను ఉంచి వాటి ద్వారా ఆమె ప్రతి కదలికలను గమనించిన రాహుల్ చివరకు ఎలాంటి చిక్కుల్లో పడతాడు, ప్రియ జీవితాన్ని సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఈ టైలర్ విషయానికోస్తే.. మహిళల గోప్యత, భద్రత లాంటి అంశాలపై చర్చను లేవనెత్తేలా ఈ ట్రైలర్ కొనసాగుతుంది. నరేశ్ కుమరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంది. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రపీ, ఎడిటర్ రవితేజ గిరిజాల పర్ ఫెక్ట్ కట్స్‌తో అందించిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అవికాగోర్ చాలా కాలం తర్వాత తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తమాడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమాడా, సాయి దీప్ రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు. జీ 5 ఓటీటీ ప్లాట్ ఫాంలో సెప్టెంబర్ 10న ఈ మూవీ విడుదల కానుంది. -
చిన్నారి పెళ్ళి కూతురు ఫేమ్ అవికా గోర్ ఫోటోలు
-
తారలు నెలల్లో స్లిమ్ అయిపోతారు
తగ్గడాలు పెరగడాలు సినిమాల్లో సాధారణం. బొద్దుగా కనిపించే తారలు నెలల్లో స్లిమ్ అయిపోతారు. కొన్ని సార్లు సినిమాలో పాత్రలు కోసం ఇలా చేస్తారు. కొన్నిసార్లు ఫిట్‌గా ఉండాలని ఫిక్స్ అయ్యే తగ్గిపోతారు. లాక్డౌన్లో కొందరు స్టార్స్ ఫిట్‌గా మారిపోయారు. బరువును మొత్తం దించేసుకున్నారు. బరువు తగ్గడంతో కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందంటున్నారు. ఆ విశేషాలు... పెరిగి.. తగ్గారు కృతీ సనన్ నాజూకుగానే ఉంటారు. అయితే ‘మిమి’ అనే హిందీ సినిమా కోసం సుమారు 15 కిలోల బరువు పెరిగారీ బ్యూటీ. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో నటించారు కృతి. అందుకోసమే 15 కిలోలు పెరిగారామె. సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే తగ్గే పని మీద దృష్టి పెట్టారు. లాక్డౌన్ ఆమెకు కలిసొచ్చింది. ‘‘ఈ లాక్డౌన్లో బరువునంతా తగ్గించుకోవడం సులువు అయింది. నా ట్రైౖనర్ సహాయం వల్లే ఈజీ అయింది’’ అన్నారు కృతీ సనన్. ఫిట్ శింబు ఆ మధ్య తమిళ హీరో శింబు బరువు బాగా పెరిగారు. లాక్డౌన్లో పూర్తి శ్రద్ధ బరువు తగ్గడం మీదే పెట్టారు శింబు. లాక్డౌన్ ముందు వరకూ ఆయన సుమారు 102 కిలోల బరువు ఉన్నారు. ఇప్పుడు 71 కిలోలకు వచ్చేశారు. తగ్గడానికి ఎన్ని నెలలు పట్టిందీ అంటే.. దాదాపు ఏడాది. తగ్గే ప్రయత్నాన్ని గత నవంబర్‌లో మొదలుపెట్టారు. లాక్డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయంలో కఠోర శ్రమతో వర్కౌట్స్ చేశారట. రోజుకి రెండు మూడు గంటలు వ్యాయామానికి కేటాయించారు శింబు. ప్రతిరోజూ వాకింగ్, జిమ్‌తో పాటు టెన్నిస్, బాస్కెట్‌బాల్ ఆడుతూ వెయిట్‌లాస్ అయ్యారు. ‘‘ఏ పని చేయడానికి అయినా మనం బలంగా సంకల్పించుకోవాలి. మన సంకల్పమే ముఖ్యం’’ అంటారు శింబు. ఇంకో విశేషం ఏంటంటే.. రెండువారాలుగా హీరోయిన్ శరణ్యా మోహన్ వద్ద భరతనాట్యంలో కోచింగ్ తీసుకుంటున్నారాయన. ఓ డ్యాన్స్ బేస్డ్ సినిమాలో నటించనున్నారట. అందుకే ఈ శిక్షణ అని సమాచారం. నిజమైన ఆత్మవిశ్వాసం ఇప్పుడొచ్చింది కామెడీ పాత్రల్లో అందర్నీ ఆకట్టుకున్నారు తమిళ పొన్ను (తమిళ అమ్మాయి) విద్యుల్లేఖా రామన్. స్వతహాగా ఆమె బొద్దుగానే ఉంటారు. చేసేవి కూడా కామెడీ ప్రధానంగా సాగే పాత్రలే కాబట్టి తెర మీద మెరుపు తీగలా కనపడాల్సిన పని లేదు. అయితే ఫిట్ గా ఉండటం ముఖ్యం అనుకున్నారు. అందుకే బరువు తగ్గడం మీద శ్రద్ధ పెట్టారు. ‘‘ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అనుకున్నాను. కానీ అలా అనుకున్నాను.. అంతే. బరువు తగ్గిన తర్వాతే నిజమైన ఆత్మవిశ్వాసం వచ్చింది. మనసు పెట్టి చేస్తే అసంభవం అంటూ ఏదీ లేదు. అలాగే బరువు తగ్గడం వెనక పెద్ద రహస్యాలేవీ ఉండవు. శ్రద్ధగా శ్రమించడమే’’ అంటారు విద్యుల్లేఖా రామన్. దాదాపు పది కిలోలు తగ్గారామె. శరీరాన్ని గౌరవించాలి ‘‘మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మన శరీరాన్ని గౌరవించాలి. అనారోగ్య సమస్యల వల్ల లావు అవ్వడాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. కానీ తిండి విషయంలో కంట్రోల్ లేకపోవడం సరైనది కాదు’’ అంటారు ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ అవికా గోర్. ‘ఉయ్యాల జంపాల’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన అవికా తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో చాలా బరువు పెరిగారామె. లాక్డౌన్లో శరీరం మీద దృష్టి పెట్టి సుమారు 13 కిలోల వరకూ తగ్గారు. ‘‘ఇష్టమొచ్చింది తినేస్తూ వ్యాయామం చేయకుండా లావయ్యాను. ఓరోజు అద్దంలో నన్ను నేను చూసుకుని నివ్వెరపోయాను. చాలా నిరాశపడ్డాను. నా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ బరువు పెరగడంతో సరిగ్గా చేయలేకపోయాను. ఇక లాభం లేదనుకుని మళ్లీ వర్కౌట్స్ మొదలుపెట్టాను. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’’ అన్నారు అవికా. -
ప్రేక్షకుల సపోర్ట్ చాలు
ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘రాజుగారి గది–3’. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్‌బాబు, అవికాగోర్ జంటగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ –‘‘నా తమ్ముడు అశ్విన్‌ను హీరోగా యాక్సెప్ట్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సాధారణంగా పెద్ద íహీరో సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఫుల్ అవుతుంటాయి. అలాంటిది మా ‘రాజుగారి గది 3’ చిత్రం ఫుల్ అవుతోంది’’ అన్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని నేను కూకట్‌పల్లిలోని థియేటర్లో ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాను. వారందరూ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఆడాలంటే ప్రేక్షకుల సపోర్ట్ ఉంటే చాలు’’ అన్నారు. ‘‘4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. అశ్విన్ ప్రాణం పెట్టి నటించారు’’ అన్నారు కెమెరామెన్ ఛోటా. కె. నాయుడు. ‘‘సినిమా చెయ్యాలనే ఆసక్తే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. ఈ చిత్రంతో నాకు ఓ మార్కెట్ ఏర్పడింది అని ఫ్రెండ్స్ అంటుంటే చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు అశ్విన్. ‘‘సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు మా యూనిట్‌కి అభినందన లు’’ అన్నారు అవికాగోర్. సంగీత దర్శకుడు షబ్బీర్ పాల్గొన్నారు. -
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
-
'రాజుగారి గది 3' మూవీ రివ్యూ
టైటిల్ : రాజుగారి గది 3 జానర్ : హర్రర్ కామెడీ నటీనటులు : అశ్విన్ బాబు, అవికా గోర్, అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ, బ్రాహ్మాజీ, గెటప్ శ్రీను, శివశంకర్ మాస్టార్, హరితేజ సంగీతం : షబీర్ దర్శకత్వం : ఓంకార్ నిర్మాణం : ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ‘ఆట’లాంటి షోస్‌తో టెలివిజన్ తెరపై సత్తా చాటిన ఓంకార్.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్ కామెడీ జానర్లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సిరీస్‌లో తీసే చిత్రాలకు క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్‌తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్ కామెడీనే నమ్ముకున్న ఓంకార్ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్ బాబుకు జోడీగా అవికా గోర్ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిందా? అసలు గదిలో ఏముంది? ఈ మూడోపార్టులో దెయ్యం నవ్వించి.. భయపెట్టిందా? తెలుసుకుందాం పదండి! కథ..: మాయా (అవికా గోర్) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయను ఎవ్వరూ వెంబడించి వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. మరోవైపు అశ్విన్ ఓ కాలనీలో ఆటోడ్రైవర్. నిత్యం తాగి తందనాలు ఆడుతూ.. కాలనీ వాసులను వేధించుకు తింటుంటాడు. మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న డాక్టర్ శశి (బ్రహ్మాజీ).. కాలనీ వాసులతో పథకం రచించి.. మాయను అశ్విన్ ప్రేమించేలా చేస్తాడు. అశ్విన్ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్, తన మామ అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి. ఎవరు ఎలా చేశారు? రాజుగారి గదిలో హీరోగా చేస్తూ వస్తున్న అశ్విన్ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ, డైలాగ్ మాడ్యులేషన్ అనేక యాసల్లో ఉండటం కనిపిస్తుంది. ఇక, మాయగా అవికా గోర్ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది. క్లైమాక్స్‌లో కాసేపు దెయ్యంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో అలీ, అశన్లతో కలిసి బ్రహ్మాజీ, శివశంకర్ మాస్టార్, గెటప్ శ్రీను తదితరులు కాసింత నవ్వులు పంచారు.సెకండ్ హాఫ్‌లో గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్ ఘోష్, సీనియర్ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్ కామెడీ పండించారు. ముఖ్యంగా అలీ, అజయ్ ఘోష్, ఊర్వశీ తమ పాత్రలకు న్యాయం చేస్తూ.. నవ్వులు పంచారు. విశ్లేషణ..! హర్రర్ కామెడీ సినిమాలకు బలమైన కథ, కథనాలు ముఖ్యం. దర్శకుడిగా ఓంకార్.. ఈ హర్రర్ కామెడీ సినిమాకు ఒకింత డిఫరెంట్ పాయింట్‌నే ఎంచుకున్నారు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్ ఆడటమనే కాన్సెప్ట్ బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. సెకండాఫ్‌లో దెయ్యాలన్నీ వచ్చి కామెడీ పండించడం తప్ప పెద్దగా ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయవు. యక్షిని నేపథ్యాన్ని కార్టూన్రూపంలో చెప్పడం కన్విన్సింగ్‌గానే ఉన్నా.. ఇంకాస్త మెరుగ్గా చెబితే ప్రేక్షకుల్లో నాటుకుపోయేది. దర్శకుడిగా ఓంకార్ టేకింగ్ బాగుంది. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫి.. షబీర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను బాగా ఎలివేట్ చేశాయి. ఎప్పటిలాగే బుర్ర సాయిమాధవ్ డైలాగులు హాస్యాన్ని పండిస్తూ.. అదనపు బలాన్ని చేకూర్చాయి. షబీర్ పాటలు అంతగా గుర్తుండిపోవు కానీ పాటల టేకింగ్ బావుంది. మొత్తానికి ఈ హర్రర్ కామెడీలో హర్రర్ అంతలేకపోయినా కామెడీ ప్రేక్షకులను మెప్పించవచ్చు. బలాలు కామెడీ సినిమాటోగ్రఫీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓంకార్ టేకింగ్ బలహీనతలు కథ, కథనాలు సాలిడ్‌గా లేకపోవడం హార్రర్ పెద్దగా లేకపోవడం ఫస్టాఫ్‌లో సాగదీత ఫీలింగ్ - శ్రీకాంత్ కాంటేకర్ -
సస్పెన్స్‌తో మాంజ
ముగ్గురు బాల నేరస్థుల జీవితాలను తెరపై ఆవిష్కరించిన హిందీ చిత్రం ‘కిల్ దెమ్ యంగ్’. బాలీవుడ్ నాయిక ఈషా డియోల్, అవికాగోర్, కిషన్ ఎస్.ఎస్ ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. కన్నడంలో ‘ఫుట్పాట్2’గా విడుదలై హిట్టయిన ఈ చిత్రాన్ని ‘మాంజ’ పేరుతో రాజ్‌కిరణ్ సమర్పణలో గిరిధర్, పద్మజ మామిడిపల్లి తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రం పాటల వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. సీడిని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి నిర్మాత దామోదర్ ప్రసాద్‌కు అందించారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ- ‘‘కిషన్ తొమ్మిదో ఏటే ‘ఫుట్‌పాత్’ అనే సినిమా తీసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు’’ అని గుర్తుచేశారు. ‘‘ఈ చిత్రం ఎమోషనల్, సస్పెన్స్, థ్రిల్లర్. నవంబర్ చివరిలో రిలీజ్’’అని దర్శకుడు కిషన్ చెప్పారు. -
పాటలు వినిపిస్త మావా!
‘‘రాజ్ తరుణ్, అవికాగోర్ లది హిట్ పెయిర్. ‘ఉయ్యాల జంపాల’ తర్వాత వీరిద్దరూ కలిసి మళ్లీ నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని కృష్ణంరాజు ఆకాంక్షించారు. రాజ్‌తరుణ్, అవికాగోర్ జంటగా ఆర్యత్ సినీ ఎంటర్టైన్మెంట్స్, కీ మీడియా సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి.గోహిల్, జి. సునీత నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక సోమవారం రాత్రి హదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని సీనియర్ నటుడు కృష్ణంరాజు విడుదల చే సి దర్శకుడు శ్రీనువైట్లకు అందించారు. రాజ్‌తరుణ్ మాట్లాడుతూ -‘‘ఉయ్యాల జంపాల తర్వాత మంచి కథ కోసం గ్యాప్ తీసుకున్నా. ఆ సమయంలోనే దర్శకుడు చెప్పిన ఈ కథ నచ్చింది. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోలు సునీల్, సందీప్ కిషన్ , నిర్మాత సి.కల్యాణ్ పాల్గొన్నారు. -
‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రం ప్రారంభం