‘‘నిర్మాతని కావాలని నా 21వ ఏటనే అనుకున్నాను.. నిర్మాతగా మారడానికి ‘పాప్ కార్న్’ సరైన కథ. అందుకే ఈ చిత్రంతో తొలి అడుగు వేశాను’’ అని అవికా గోర్ అన్నారు. సాయి రోనక్ హీరోగా మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాప్ కార్న్’. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్‌గా నటించడంతో ΄ాటు నిర్మాతగా (సహ నిర్మాత) మారారు. ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో భోగేంద్ర గుప్త నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్ చెప్పిన విశేషాలు.
♦ డైరెక్టర్ మురళి చెప్పిన ‘పాప్ కార్న్’ కథ ఆసక్తిగా అనిపించింది. 90 శాతం లిఫ్ట్‌లో జరిగే కథ ఇది. ఇప్పుడు ఆడియెన్స్ కి మంచి కంటెంట్ లేదా మాస్ మసాలా కావాలి. ఆ రెంటినీ బ్యాలన్స్ చేస్తూ ‘పాప్ కార్న్’ తీశారు మురళి.
♦ చిత్రపరిశ్రమలో నాకు గాడ్‌ఫాదర్స్ లేరు. అందుకే నేను నిర్మాతగా చేస్తానని చెప్పగానే ముందు సందేహం వ్యక్తం చేశారు మా పేరెంట్స్. కానీ, ఇది నా కల అని చెప్పగానే వాళ్లు ఒప్పుకున్నారు. నిర్మాతగా సినిమా ఎలా వస్తోంది? ఎలా ప్రమోట్ చేయాలి? అని ఆలోచించడం కొత్తగా అనిపించింది. నాప్రొడక్షన్ హౌస్‌లో మరో సినిమా షూటింగ్ చేశాం. అలాగే ఇంకో మూవీ ప్రీప్రొడక్షన్ జరుగుతోంది.
♦ ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్నాను. ‘1920’ అనే చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాను.
Comments
Please login to add a commentAdd a comment