‘నెట్‌’ మూవీ ట్రైలర్‌ విడుదల, సస్పెన్స్‌ మమూలుగా లేదుగా.. | Avika Gor And Rahul Ramakrishna NET Movie Trailer Release | Sakshi
Sakshi News home page

అవికా ఇంట్లో సీసీ కెమెరాలు.. ఆ తర్వాత ఏం జరిగింది..

Published Thu, Aug 26 2021 9:01 PM | Last Updated on Thu, Aug 26 2021 9:03 PM

Avika Gor And Rahul Ramakrishna NET Movie Trailer Release - Sakshi

హీరోయిన్‌ అవికాగోర్, క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ కాంబోలో వ‌స్తున్న చిత్రం ‘నెట్’. క్రైం థ్రిల్ల‌ర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించగా.. అశ్లీల చిత్రాలు వీక్షించే యువకుడిగా రాహుల్‌ కనిపిస్తాడు. ఈ క్రమంలో  ప్రియ ఇంట్లో సీక్రెట్‌ కెమెరాలను ఉంచి వాటి ద్వారా ఆమె ప్రతి కదలికలను గమనించిన రాహుల్‌ చివరకు ఎలాంటి చిక్కుల్లో పడతాడు, ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ మూవీని రూపొందించారు. 

ఈ టైలర్‌ విషయానికోస్తే.. మ‌హిళ‌ల గోప్య‌త‌, భ‌ద్ర‌త లాంటి అంశాల‌పై చ‌ర్చ‌ను లేవ‌నెత్తేలా ఈ ట్రైలర్‌ కొనసాగుతుంది. నరేశ్ కుమ‌ర‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కొత్త‌గా ఉంది. అభిరాజ్ నాయ‌ర్ సినిమాటోగ్ర‌పీ, ఎడిట‌ర్ ర‌వితేజ గిరిజాల ప‌ర్ ఫెక్ట్ క‌ట్స్‌తో అందించిన ఈ ట్రైల‌ర్ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. అవికాగోర్ చాలా కాలం త‌ర్వాత తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. భార్గ‌వ్ మాచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని త‌మాడా మీడియా బ్యాన‌ర్ పై రాహుల్ త‌మాడా, సాయి దీప్ రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు. జీ 5 ఓటీటీ ప్లాట్ ఫాంలో సెప్టెంబ‌ర్ 10న ఈ మూవీ విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement