Rahul Ramakrishna
-
ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ
-
‘ఓం భీమ్ బుష్’ ఓటీటీ వివరాలు.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్ భీమ్ బుష్’ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 10.44 కోట్ల గ్రాస్ వసూళ్ల సాధించి, ఔరా అనిపిస్తోంది. లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. (చదవండి: ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు..) ఈ మధ్య కాలంలో ఫుల్లెన్త్ కామెడీ చిత్రాలేవి తెలుగులో రిలీజ్ కాకపోవడం కూడా ఓం భీమ్ బుష్‌కి బాగా కలిసొచ్చింది. వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డిటేల్స్ బయటకు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఓటీటీలోకి 'ఓపెన్‌హైమర్' తెలుగు వర్షన్ వచ్చేసింది) రిలీజ్‌కి ముందే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కింకుంది. మంచి రేటుకే ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు వారాల వరకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేదు. ఏప్రిల్ చివరి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు మాత్రం ఆగాల్సిందే. -
‘ఓం భీమ్ బుష్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ
టైటిల్: ఓం భీమ్ బుష్ నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సమర్పణ: యూవీ క్రియేషన్స్ దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి సంగీతం: సన్నీ ఎమ్ఆర్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం ఎడిటింగ్: విజయ్ వర్ధన్ విడుదల తేది: మార్చి 22, 2024 ‘ఓం భీమ్ బుష్’ కథేంటంటే? కృష్ణ కాంత్ అలియాస్ క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మాధవ్ రేలంగి అలియాస్ మ్యాడీ(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వారి కోరిక .పీహెచ్డీ కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. ఐదేళ్లయినా పీహెచ్డీ పూర్తి చేయరు. కాలేజీలో వీళ్లు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ విలుకొండ(శ్రీకాంత్ అయ్యంగార్). ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి, తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. సైంటిస్టుల అవతారమెత్తి ఎ టు జెడ్ సర్వీసెస్ పేరు ఓదుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాంగ్ బ్రోస్(ఈ ముగ్గురి టీమ్ పేరు బ్యాంగ్ బ్రోస్) నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బుకోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్(ఆదిత్యా మీనన్).. ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఊరి చివరన ఉన్న సంపంగి మహాల్‌లోకి వెళ్లి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంపంగి దెయ్యం ఉన్న ఆ మహాల్‌లోకి వెళ్లిన తర్వాత బ్యాంగ్ బ్రోస్కి ఎదురైన సంఘటనలు ఏంటి? సంపంగి మహల్ కథ ఏంటి? ఇంతకీ ఆ మహల్ లో నిధి ఉందా లేదా? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఓం భీమ్ బుష్’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు వాస్తవానికి విరుద్దంగా, లాజిక్ లెస్‌గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ ఒకటి. ‘నో లాజిక్ ఓన్లీ మేజిక్ ’అని టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు శ్రీహర్ష.. అందుకు తగ్గట్టే ఓన్లీ స్క్రీన్‌ప్లేతో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తరహాలో సాగే ముగ్గురు స్నేహితుల కథకి హారర్‌ని జోడించి.. చివరిలో ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల భయపెడతూనే ఓ డిఫరెంట్, ఎమోషనల్ లవ్‌స్టోరీని చెప్పాడు. టైటిల్లో చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచే ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మహల్ లో తాంత్రిక పూజ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్ తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చేవరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. భైరవపురంలో బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఊరి ప్రజలతో ఈ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్‌కి థియేటర్స్‌లో పగలబడి నవ్వుతారు. అలాగే అర్థరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి చేసే అల్లరి, ప్రియదర్శి, ఆదిత్య మీనన్‌కు సంబంధించిన సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.ద్వితియార్థం మొత్తం సంపంగి మహాల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హారర్ సీన్ పెట్టాలి? ఎలాంటి సీన్‌కి నవ్వుతారు? లాంటివి లెక్కలేసుకొని బలమైన స్క్రీప్ట్ రాసుకున్నాడు. సంపంగి దెయ్యం, ప్రియదర్శిని భయపెట్టే సీన్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూనే నవ్వుతుంటాం. అయితే సంపంగి దెయ్య నేపథ్యం తెలిశాక వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్‌గా ఉంటాయి. కానీ చివరిలో మాత్రం ఓ కొత్త పాయింట్‌ని టచ్ చేశాడు. ఇంతవరకు ఎవరూ అలాంటి అంశాన్ని ఇంత డిఫరెంట్‌గా తెరపై చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్నీ సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. క్రిష్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన చేసే ఇన్నోసెంట్‌గా కామెడీ నవ్వులు పూయిస్తుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. భయస్తుడు వినయ్ గుమ్మడి పాత్రకి ప్రియదర్శి వందశాతం న్యాయం చేశాడు. సినిమాలో బాగా నవ్వించిన సీన్లలో ఎక్కువగా ప్రియదర్శివే ఉంటాయి.మహల్లో అతనికి, దెయ్యంకి మధ్యవచ్చే సీన్లు హిలేరియస్‌గా అనిపిస్తాయి. ఇక రాహుల్ రామకృష్ణ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్, కామెడీతో ఆకట్టుకున్నాడు.స్పెషల్ సాంగ్‌లో ప్రియా వడ్లమాని అందాల అరబోసింది.ప్రీతీ ముకుందన్ , ఆయేషా ఖాన్, రచ్చరవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా ఉన్నతంగా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు బాగుంది. సన్నీ అందించిన బీజీఎం కొన్ని సీన్లను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్ విజయ్ వర్దన్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Om Bheem Bush: నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్.. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్?
తెలుగు తెరపై మరో కామెడీ సినిమా సందడి చేయబోతుంది. అదే ఓమ్ బీమ్ బుష్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ(U/A) సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు సెన్సార్ సభ్యులు నవ్వుతూనే ఉన్నారట. కామెడీతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ పోటీపడి నటించారట. శ్రీవిష్ణు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటే.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ స్పాంటేనియస్ డైలాగ్స్‌తో అదరగొట్టారట. క్లైమాక్స్ లో భారీ ఎమోషన్ తో ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయట. సెన్సార్ సభ్యుల మాదిరే థియేటర్స్‌లో సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వెళ్లిపోతాడని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్? సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు నటించిన ఫుల్లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ ఓమ్ బీమ్ బుష్. డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి ఈ కథకి హారర్ టచ్ ఇవ్వడంతో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ని జతచేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేసింది. సెన్సార్ సభ్యులు ప్రశంసలు.. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చుస్తుంటే శ్రీవిష్ణు ఖాతాలో కచ్చితంగా మరో హిట్ పడేలా ఉంది. మరి జాతిరత్నాలు మాదిరే ‘ఓమ్ బీమ్ బుష్’ కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది. -
ఓం భీమ్ బుష్ ట్రైలర్.. టైటిల్‌కు తగ్గట్టే ఉంది
‘సామజవరగమన’(2023) వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ‘నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్’ అన్నది ఉపశీర్షిక. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ప్రీతి ముకుందన్,ఆయేషా ఖాన్ కథానాయికలుగా ఉన్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్‌పై సునీల్ బలుసు నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.. ‘‘గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే నేపథ్యంలో తెరకెక్కిన ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ట్రైలర్లో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు. ట్రైలర్ మొత్తం కామెడీ ట్రాక్‌లో ఉంది. సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. -
ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్ఫెక్ట్ యూత్‌పుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్లో రాస్తూ..' బ్లాక్‌బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్ జత చేశారు. కాగా.. ఈ చిత్రంలో నవీన్‌తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. Today marks 3 years to this joyful blockbuster film #JathiRatnalu. World was in the middle of a pandemic. But despite all challenges this throwback video is a small reminder of the euphoria that we saw in theatres that day. Sometimes I feel emotional to see how you guys have made… pic.twitter.com/Eph3DwnUwq — Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2024 -
Om Bhim Bush: పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ
‘‘గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే నేపథ్యంలో ‘ఓం భీమ్ బుష్’ ఆసక్తిగా ఉంటుంది. మా పాత్రలకు (శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి) ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. రెండు గంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు.. ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్‌లో యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా మార్చి 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘టీజర్ అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే ప్రేక్షకులు చూడాలి’’ అన్నారు రాహుల్ రామకృష్ణ. ‘‘మా సినిమాని అందరూ చూడాలి’’ అన్నారు శ్రీహర్ష కొనుగంటి. -
రాహుల్ రామకృష్ణ హిలేరియస్ ఫన్నీ స్పీచ్
-
మంత్రాన్ని తలపించేలా సినిమా టైటిల్.. ఆసక్తిగా పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. గతేడాది సామజవరగమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో తాజాగా మరో హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు టైటిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ చూడగానే ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి ఓం భీమ్ బుష్ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. అంతే కాకుండా నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్, టైటిల్ కొత్తగా ఉండడం చూస్తే థియేటర్లలో ఫుల్ కామెడీ ఖాయంగా కనిపిస్తోంది. ఓం భీమ్ బుష్ అనే పేరు వినగానే ఏదో మంత్రం చదివినట్లు అనిపిస్తోంది. పోస్టర్ చూస్తే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యోమగాముల పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో వీరి ముగ్గురి కాంబోలో బ్రోచేవారెవరురా అనే సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులని నవ్వించడానికి రాబోతున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. The hilarious trio of @sreevishnuoffl, @PriyadarshiPN & @eyrahul are back 👨🏻🚀👨🏻🚀👨🏻🚀 And they are bringing the 𝐍𝐄𝐖 𝐌𝐀𝐍𝐓𝐑𝐀 𝐎𝐅 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐌𝐄𝐍𝐓 - #OmBheemBush - No Logic Only Magic 🪄 Directed by @HarshaKonuganti ❤️🔥 Grand Release Worldwide on March 22nd 💫… pic.twitter.com/8x6wMICA3R — UV Creations (@UV_Creations) February 22, 2024 -
అన్న నువ్వు ఇట్లనే మాట్లాడితే వెళ్లిపోతా..!
-
నేను నాస్తికుడిని పూజలు చేయను అంటున్న రాహుల్
-
ఆర్జీవీకి పట్టిన గతే మనకు పట్టేలా ఉంది: రాహుల్ రామకృష్ణ
-
అలాంటి లింకులు ఏమి లేవు..!
-
అతనితో పోల్చడమంటే కించపరిచినట్లే.. రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్‌గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లతో నటిస్తూ.. బిజీగా ఉన్నారు. ఇటీవల రాహుల్ రామకృష్ణ నటించిన ఇంటింటి రామాయణం సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా రామకృష్ణ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: సూపర్‌స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు) ఈ ఏడాది అందరినీ కంటతడి పెట్టించిన సినిమా బలగం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ ప్రధానపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాహుల్ నటించిన ఇంటింటి రామాయణం సూపర్ హిట్ కావడంతో నెటిజన్స్ అతన్ని ప్రియదర్శితో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరలవుతున్న వాటిపై రాహుల్ రామకృష్ణ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాహుల్ ట్విటర్లో రాస్తూ.. 'నా ప్రాణ మిత్రుడు ప్రియదర్శి హార్ట్ వర్క్‌తో పాటు మంచి నటుడు. అతనితో నన్ను పోల్చడమంటే మీరు అతన్ని కించపరిచినట్లే. అతను గొప్ప నటుడే కాదు.. మంచి వ్యక్తితమున్న వ్యక్తి. ఇలా పోల్చడం మీ పిరికితనంలా అనిపిస్తుంది. నేను అతని బాటలోనే నడుస్తాను.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఇంటింటి రామాయణం చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించగా..ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్‌లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. (ఇది చదవండి: ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది) pic.twitter.com/E51s5hGVfw — Rahul Ramakrishna (@eyrahul) July 16, 2023 -
మంచి సినిమాకి ఆదరణ ఉంటుంది
‘‘డైరెక్టర్ శివ ప్రసాద్‌గారు తొలి సినిమా ‘విమానం’తో మంచి హిట్ అందుకున్నందుకు అభినందనలు. మంచి సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని ‘విమానం’ మరోసారి నిరూపించింది’’ అని నటుడు, దర్శకుడు సముద్ర ఖని అన్నారు. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘విమానం’ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే కొత్త దర్శకులకు ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది’’ అన్నారు. ‘‘విమానం’ చిత్రం చూశాక ‘మా నాన్న గుర్తుకొచ్చాడు’ అంటూ మా నాన్న, అమ్మ చెప్పడంతో చాలా ఆనందం వేసింది’’ అన్నారు శివప్రసాద్ యానాల. నటుడు ధనరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, రైటర్ హను, సినిమాటోగ్రాఫర్ వివేక్, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్ మాట్లాడారు. -
ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది
‘‘మానవ సంబంధాల నేపథ్యంలో నడిచే చిత్రం ‘ఇంటింటి రామాయణం’. కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మా చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది’’ అని డైరెక్టర్ సురేష్ నరెడ్ల అన్నారు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు ΄ోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో సురేష్ నరెడ్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అమెరికాలోనూ మంచి స్పందన వస్తోంది. నాకు స΄ోర్ట్ చేసిన నాగవంశీ, మారుతిగార్లకు, ఆహా వారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంటింటి రామాయణం’కి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది.. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నటి నవ్య స్వామి అన్నారు. -
రైలు ప్రమాదం.. కమెడియన్ అనుచిత ట్వీట్.. ఆ వెంటనే డిలీట్!
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శుక్రవారం రాత్రి ఒకే చోట ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురవడంతో 260కి పైగా మంది మృత్యువాత పడగా వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా భయానక రైలు ప్రమాదం దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ అనుచిత ట్వీట్ చేశాడు. కమెడియన్‌పై మండిపాటు సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పక్క వందల కుటుంబాలు ట్రైన్ యాక్సిడెంట్లో సమాధి అయిపోతే మీకు కామెడీగా ఉందా? రైలు విన్యాసాలు షేర్ చేస్తున్నారేంటి? అని మండిపడ్డారు. వెంటనే తప్పు తెలుసుకున్న రాహుల్ సదరు ట్వీట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు 'ఇంతకు ముందు చేసిన ట్వీట్‌పై క్షమాపణలు కోరుతున్నాను. ఒట్టేసి చెప్తున్నా.. ఆ విషాదం గురించి నాకసలు ఏమీ తెలియదు. అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నాను.. ఏ వార్తలూ చూడలేదు. అందుకే తప్పు జరిగింది. మరోసారి క్షమాపణలు చెప్తున్నా' అని ట్వీట్ చేశాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ 'మీ నిజాయితీని మెచ్చుకుంటున్నా. మిమ్మల్ని ట్రోల్ చేయాలనుకోలేదు. కేవలం మీకు ఆ ఘటన గురించి మరింత సమాచారం ఇవ్వాలనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. దీనికి రాహుల్ రిప్లై ఇస్తూ.. 'థాంక్యూ.. గత కొన్ని గంటలుగా నేను న్యూస్ ఫాలో అవడం లేదు. కేవలం నా పనిపైనే ఫోకస్ చేశాను. నన్ను అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్' అని పేర్కొన్నాడు. Terribly sorry about the previous tweet. I had no idea about the tragedy on the news. Promise. I’ve been writing a script since midnight and have been cut off from all forms of news. Very sorry, once again. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 Thank you. I have generally not been following the news for a while on account of trying to focus my energies on work. This was definitely a faux pas. Thank you for alerting me about it. Much appreciated. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 A quote tweet I shared of a buster Keaton silent movie gif about trains in films . Doesn’t matter now. — Rahul Ramakrishna (@eyrahul) June 2, 2023 చదవండి: విషమంగా పంచ్ ప్రసాదం ఆరోగ్యం ఒడిశా రైలు ప్రమాదం: ఈ పాపం ఎవరిది? -
మీ పెంపకం ఎలాంటిదోనన్న అనసూయ.. ఈ లొల్లేందన్న రాహుల్
హీరోలకు అభిమానులు రక్షణ కవచం వంటివారు. తమ అభిమాన హీరోను పల్లెత్తు మాట అన్నా అస్సలు సహించలేరు. అలాంటిది ఏకంగా కించపరిస్తే ఊరుకుంటారా? పట్టపగలే చుక్కలు చూపిస్తారు. యాంకర్, నటి అనసూయ విషయంలో ఇదే జరిగింది. ఎందుకోగానీ ఎప్పటినుంచో అనసూయకు, విజయ్ దేవరకొండ అంటే పడదు. గతంలో ఈ హీరో స్టేజీపైనే బూతు డైలాగ్ చెప్పాడని విమర్శించినందుకు ఫ్యాన్స్ అనసూయనే తిట్టిపోశారు. ఇటీవల డైరెక్ట్‌గా విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ అతడు ఖుషి సినిమా పోస్టర్లో పేరుకు ముందు The అని పెట్టుకోవడంపై సెటైర్లు వేసింది. పైత్యం.. అంటకుండా చూసుకుందాం అంటూ ట్వీట్ చేసింది. ఇంకేముంది, ఆ మాట ఎవరిని ఉద్దేశించి అందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు అభిమానులు. మా రౌడీ హీరో మీద నీకెందుకంత ఒళ్లు మంట ఆంటీ.. అంటూ మళ్లీ ఆమెను ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అటు అనసూయ కూడా ఎక్కడా తగ్గకుండా వీలు దొరికినప్పుడల్లా రివర్స్ కౌంటర్ ఇస్తూ వస్తోంది. తనపై బూతుల వర్షం కురిపిస్తున్నవారిని ఉద్దేశిస్తూ తాజాగా ఓ ట్వీట్ వేసింది అనసూయ. 'నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనెలా తప్పవుతాను? నా పెంపకం గర్వించదగ్గది.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి' అని రాసుకొచ్చింది. దీనిపై కమెడియన్ రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ 'ఇలా అడుగుతున్నందుకు దయచేసి నన్ను క్షమించగలరు, ఇంతకీ ఇక్కడ జరుగుతున్న లొల్లి ఏంటో తెలుసుకోవచ్చా?' అని అడిగాడు. దీనికి నెటిజన్లు.. 'అనసూయ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ వార్ జరుగుతోంది', 'ఎప్పుడు చూడూ లైమ్ లైట్ కోసం హంగామా అనిపిస్తోంది, బేకార్ ముచ్చట్లు బేకార్ పంచాయితీలు.. అందరూ ఆమెను ఆంటీ అనడం మేడమ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం', 'విజయ్ The అన్న పదం ఖుషీ పోస్టర్లో వాడినందుకు అనసూయకు కోపమొచ్చింది నోటికొచ్చినట్లు వాగింది, చివరికి ఫ్యాన్స్ చేతిలో చీవాట్లు తింటోంది' అని కామెంట్లతో క్లారిటీ ఇస్తున్నారు. Pardon me for being uninformed but I’m curious to know what this is all about 🧐 — Rahul Ramakrishna (@eyrahul) May 10, 2023 చదవండి: భార్యను దూరం పెట్టిన పూరీ జగన్నాథ్? క్లారిటీ ఇదే! -
రాహుల్ రామకృష్ణ కొడుకుని చూశారా? పేరు భలేగా ఉందే?
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్‌గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించాడు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లతో నటిస్తూ.. బీజియెస్ట్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ఈ టాలెంటెండ్ యాక్టర్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్‌లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. (చదవండి: రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!) ఇక సంక్రాంతి రోజు అబ్బాయి పుట్టాడని ట్వీట్ చేశాడు. కానీ అతని కొడుకు ఫోటోని మాత్రం చూపించలేదు. ఇన్నాళ్లకు తన వారసుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కొడుకు పేరు రూమి అని చెబుతూ.. ఓ ఫోటోని ట్విటర్లో షేర్ చేశాడు. అందులో రాహుల్ భార్య కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. రూమి.. జూనియర్ రాహుల్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పేరు కొత్తగా ఉందని, దాని అర్థం ఏంటి? అని అభిమానులు కామెంట్ పెడుతున్నారు. కాగా, రూమి పాపులర్ పర్సియన్ కవి. అతడి పేరును తన తనయుడికి రాహుల్ రామకృష్ణ పెట్టడం గమనార్హం. Meet Rumi along with his family 😘 pic.twitter.com/SJefvm2Gho — Rahul Ramakrishna (@eyrahul) April 24, 2023 -
తండ్రి అయిన స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ
ప్రముఖ కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ తండ్రి అయ్యాడు. సంక్రాంతి పండుగ రోజున తన భార్య హరిత పండండి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా కొడుకు ఫొటోను షేర్ చేస్తూ ‘మగబిడ్డ.. సంక్రాంతి రిలీజ్’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ దంపతులకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గతంలో గర్ల్‌ఫ్రెండ్‌కు లిప్ కిస్ ఇస్తున్న ఫొటోను షేర్ చేస్తూ రాహుల్ పెళ్లి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి అయితే పెళ్లి తేదీ కానీ, పెళ్లికి సంబంధించిన ముచ్చట్లను కానీ ఆ తర్వాత రాహుల్ వెల్లడించలేదు. కానీ గతేడాది నవంబర్‌లో తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పి అందరికి షాకిచ్చాడు. కాగా కమెడియన్‌గా పరిశ్రమలో రాహుల్ రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేసి ఫేమస్ అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాతో తెచ్చుకున్న గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. Boy. Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1 — Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023 -
ఆహా ఒరిజినల్ 'ఇంటింటి రామాయణం', అప్పుడే స్ట్రీమింగ్!
షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలతో తెలుగువారిని ఆకట్టుకుంటోంది ఆహా. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంటింటి రామాయణం అనే చిత్రం రాబోతోంది. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశించనున్నారు. ఈ సినిమా టీజర్ నవంబర్ 25న విడుదల చేయనున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్) కుటుంబం ఓ సమస్యలో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. ఈ కుటుంబ కథా చిత్రం డిసెంబర్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఎంట్రీపై సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులున్నారు. ఎంతో గొప్ప టీం పని చేసింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా రావాలని కష్టపడ్డారు. ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించాం. అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది” అన్నారు. Iga mucchata shuru!😉 Ee gammatthu katha chudaniki ready kaandi thondarlo... Teaser out on November 25th. An @ahavideoIN Original.#IntintiRamayanamOnAHA @DirectorMaruthi @vamsi84 @eyrahul #NavyaSwamy @SitharaEnts @Sureshflms @Venkatupputuri @innamuri8888 @GangavvaMilkuri pic.twitter.com/9zoRyStvwZ — Sithara Entertainments (@SitharaEnts) November 21, 2022 చదవండి: ఆస్పత్రిలో ప్రేమదేశం హీరో అబ్బాస్ నీ నుంచి కంటెంటే రాదు, ఇంకా కోపం కూడానా.. యాంకర్ వెకిలి చేష్టలు -
అర్జున్ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదు, ఆ కమెడియన్: రాహుల్ రామ్కృష్ణ
రాహుల్ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు రాహుల్. చదవండి: జబర్దస్త్ ‘పంచ్’ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే? ఈ గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ టాక్‌లో షో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు రాహుల్ రామక్రష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నేను, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అందరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం. పెళ్లి చూపులు సినిమాకి ముందు మేమంత సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాం. చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే అదే సమయంలో తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చేసే అవకాశం వచ్చింది. అందులో విజయ్ హీరోగా ముందు అనుకున్నాడు. ఇక అతడి ఫ్రెండ్ రోల్‌కు అప్పటికే తరుణ్ ప్రియదర్శికి ఛాన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనుకున్నాడు. ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ సినిమాలో ‘శివ’ పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అర్జున్ రెడ్డిలో నా పాత్రకి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం తెలిసింది. మొదట ఈ సినిమాలో నా పాత్రకు ఫస్ట్ చాయిస్ నేను కాదని, ప్రియదర్శిని అనుకున్నారని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు. -
తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’
ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీంతో నెటిజన్లు, అతడి ఫాలోవర్స్ షాకవుతున్నారు. అంతేకాదు అసలు పెళ్లెప్పుడు జరింగింది బ్రో? అని నటుడిని ప్రశ్నిస్తున్నారు. కాగా రీసెంట్గా తన కాబోయే భార్యకు లిప్‌లాక్ ఇస్తూ రాహుల్ పెళ్లి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తేదీ కానీ, పెళ్లి సంబంధించిన ముచ్చట్లను కానీ ఇప్పటి వరకు రాహుల్ వెల్లడించలేదు. కానీ సడెన్ తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తాజాగా షేర్ చేశాడు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఏంటీ బ్రో పెళ్లి చేసుకున్న విషయం చెప్పనే లేదు, అసలు మీ పెళ్లి ఎప్పుడు జరిగింది’ అంటూ రాహుల్ పోస్ట్‌లో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత అయితే గత నెలలో మాత్రం ‘సె హాయ్ టూ మై వైఫ్’ అంటూ భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. సె హాలో టూ మై లిటిల్ ఫ్రెండ్’ అంటూ తనదైన శైలిలో పోస్ట్ షేర్ చేశాడు. కాగా కమెడియన్‌గా పరిశ్రమలో రాహుల్ రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాతో తెచ్చుకున్న గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు Say hello to our little friend pic.twitter.com/q7t5htIZEO — Rahul Ramakrishna (@eyrahul) November 7, 2022 View this post on Instagram A post shared by Rahul Ramakrishna (@weirddivide) Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6 — Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022 -
బ్రో, నువ్వు తాగి ట్వీట్ చేశావా? కమెడియన్ ఆన్సరేంటంటే?
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో ఆకట్టుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత జాతిరత్నాలు, కల్కి, స్కైలాబ్ సినిమాలతో అలరించాడు. ఇటీవలే హ్యాపీ బర్త్‌డే మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా ఈ కమెడియన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. బోర్ కొడుతోంది.. సినిమా, సాహిత్యం, సంగీతం.. వీటి గురించి ఏదైనా అడగండి.. ఆసక్తిగా ఉన్న ప్రశ్నలకు ఆన్సరిస్తానని ట్వీట్ చేశాడు. ఇంకేముంది.. నెటిజన్లు దొరికిందే ఛాన్సని వరుస ప్రశ్నలు కురిపించారు. మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటి? అన్న ప్రశ్నకు బెటర్ కాల్ సాల్ అని బదులిచ్చాడు. ఈ మధ్య నీలెక్క తెలంగాణ మాండలికంలో చాలా తక్కువమంది మాట్లాడుతరు. నువ్వు యాస చాలా స్పష్టంగా మాట్లాడుతవు. దానికి ఏమన్నా హోంవర్క్ చేస్తవ భయ్ లేదా సహజంగానే అంతేనా? అని అడగ్గా.. మాతృభాషకు హోం వర్క్ అక్కర్లేదని నా ఫీలింగ్ అని రిప్లై ఇచ్చాడు. తాగేసి ట్వీట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయా గురూ అని అడగ్గా.. చాలా సార్లు అని బదులిచ్చాడు రాహుల్ రామకృష్ణ. Chaala saarlu — Rahul Ramakrishna (@eyrahul) August 5, 2022 మాతృ భాషకి హోమ్ వర్క్ అక్కర్లేదు అని నా ఫీలింగ్ — Rahul Ramakrishna (@eyrahul) August 5, 2022 చదవండి: నా మాజీ భార్యకు అతడితో వివాహేతర సంబంధం, ఇద్దరూ నా ఇంట్లోనే తిష్ట వేశారు వాచిపోయిన కాళ్లు... సోషల్ మీడియాలో కష్టాలు చెప్పుకున్న సోనమ్ కపూర్ -
రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే..
ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. లిప్‌లాక్ ఫోటోతో కాబోయే భార్యను పరిచయం చేస్తూ.. ఎట్టకేలకు త్వరలోనే పెళ్లి అంటూ శుభవార్త చెప్పాడు. అర్జున్‌రెడ్డి స్టైల్లో ఢిపరెంట్‌గా పెళ్లి వార్తను అనౌన్స్ చేయడంతో క్షణాల్లోనే రాహుల్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: లిప్ లాక్ ఫోటోతో పెళ్లి అనౌన్స్ చేసిన ప్రముఖ కమెడియన్ ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయేది ఎవరు,ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరిగింది. మరికొందరేమో ఆమె పేరు బిందు అంటూ నెట్టింట ప్రచారం చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు హరిత.. బిందు కాదు' అంటూ క్లారిటీ ఇచ్చాడు. చదవండి: అల్టీమేట్ ఫన్ ఎఫ్-3 ట్రైలర్ వచ్చేసింది.. Small clarification- my fiancé’s name is Haritha, not Bindu. ☺️ — Rahul Ramakrishna (@eyrahul) May 8, 2022 -
లిప్ లాక్ ఫోటోతో పెళ్లి అనౌన్స్ చేసిన ప్రముఖ కమెడియన్
ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాబోయే భార్యకు ముద్దు ఇస్తున్న ఫోటోను షేర్చేస్తూ.. త్వరలోనే పెళ్లి అంటూ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. అసలైన జాతిరత్నానివి నువ్వు.. అర్జున్ రెడ్డి స్టైల్లో చెప్పినవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ డజనుకు పైగా చిత్రాల్లో నటించిన రాహుల్ రామకృష్ణకు అర్జున్ రెడ్డితో పాటు గీత గోవిందం, హుషారు,ఆర్ఆర్ఆర్ తదితర చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రాహుల్ నటించిన 'కృష్ణ వ్రింద విహారి', 'విరాటపర్వం' సినిమాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6 — Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022 -
విశ్వక్సేన్కు సపోర్ట్.. టీవీ ఛానెల్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు
హీరో విశ్వక్ సేన్- ఓ టీవీ యాంకర్ మధ్య జరిగిన వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో కొందరు ఆ యాంకర్‌కు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు విశ్వక్సేన్కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం విశ్వక్సేన్కు సపోర్ట్‌గా నిలుస్తూ సదరు టీవీ ఛానెల్‌ను వరుస ట్వీట్స్‌తో ఏకిపారేశాడు. ఆయన ఏం అన్నారంటే.. 'ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కస్ ఫీట్లో నేను కూడా భాగమవుదామనుకుంటున్నా.విశ్వక్సేన్ను అవమానించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జర్నలిస్టుల ముసుగులో వీళ్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఛానెల్ కేవలం డబ్బుల కోసమే న్యూస్ కవర్ చేస్తుంది. నీచమైన రూపంలో ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమైనా చేస్తుంది. సదరు ఛానెల్ న్యూస్ తప్పా మిగతావన్నీ కవర్ చేస్తారని, వాళ్లకి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయంటూ సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ఈ మొత్తం ఇష్యూపై సదరు ఛానెల్ వాళ్లు పిలిస్తే లైవ్ డిబెట్లో పాల్గొంటా' అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. I’d like to be a part of the circus that is surrounding and humiliating a grounded, humble person as #VishwakSen He has my total support especially in light of how @TV9Telugu treated him. I don’t know what they do to journalists these days..jeez.. — Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022 Their news is about monetary benefits. It is just shameful that people salivate for the kind of nonsense that they mostly* perpetuate. — Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022 I really want @TV9Telugu to call me over for a live television debate. — Rahul Ramakrishna (@eyrahul) May 4, 2022 -
సినిమాలు మానేస్తానని జోక్ చేశా, ఫూల్స్: మాట మార్చిన కమెడియన్!
కమెడియన్ రాహుల్ రామకృష్ణ సినిమాల్లో మంచి కామెడీ పండిస్తాడు. జాతిరత్నాలు చిత్రంతో అతడి క్రేజ్ ఆకాశాన్నంటగా ఆ తర్వాత విడుదలైన పలు సినిమాల్లో ఈయన తళుక్కుమని మెరిశాడు. టాలీవుడ్లో టాప్ కమెడియన్‌గా ఫాంలోకి వచ్చిన రాహుల్ మొన్న(ఫిబ్రవరి 4) అర్ధరాత్రి సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో చాలామంది ఇది జోకా? సీరియసా? ఏదైనా వెబ్ సిరీస్ స్టంటా? అని రకరకాలుగా కామెంట్లు చేశారు. మరికొందరైతే అప్పుడే ఎందుకు సినిమాలు వదిలేస్తున్నావు రాహుల్ అంటూ విచారం వ్యక్తం చేశారు. అలా తన మాటలను నమ్మినవాళ్లను పిచ్చోళ్లను చేశాడు రాహుల్. శనివారం సాయంత్రం అదంతా అబద్ధమని వెల్లడిస్తూ మరో ట్వీట్ చేశాడు. (చదవండి: ఇక మీదట సినిమాలు చేయను: 'జాతిరత్నాలు' ఫేం రాహుల్ రామకృష్ణ) 'అదంతా వట్టి జోక్, ఫూల్స్.. నేనెందుకు మంచి పారితోషికం, లగ్జరీ లైఫ్ వంటి ఎన్నో లాభాలున్న జీవితాన్ని వదిలేసుకుంటాను. నేను నిజంగానే రిటైర్మెంట్ తీసుకున్నాననుకుని నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెపుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది' అని చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. 'ఆ ట్వీట్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు జోక్ ఎందుకు అనాలి?', 'ఎవరూ ఫూల్స్ కాదు.. నువ్వంత నమ్మదగినవాడివి కాదని నీ ట్వీట్ల ద్వారా నువ్వే ప్రూవ్ చేశావ్', 'కామెడీ సినిమాల్లో చేసుకో ఇక్కడ కాదు', 'ఇప్పుడిదో జోకు అంటారు.. నవ్వమంటారా అయితే!' అంటూ వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. It’s a joke you fools Why would I throw away a high paying, luxury life so full of benefits? I can’t believe my friends are calling me up to congratulate me on my retirement 😆 — Rahul Ramakrishna (@eyrahul) February 5, 2022 -
సినిమాల నుంచి తప్పుకుంటున్నా: కమెడియన్ అనూహ్య నిర్ణయం
రాహుల్ రామకృష్ణ.. కమెడియన్‌గా, నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. 'జాతిరత్నాలు' సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈయన తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇకమీదట సినిమాల్లో నటించనని వెల్లడించాడు. 2022 వరకు మాత్రమే సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత నటనకు దూరం అవుతానని ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఎవ్వరేమన్నా తను ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నాడు. ఇలా ఉన్నట్టుండి ఎందుకు సినిమాలు మానేస్తున్నాడని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. 'ఇదంతా ప్రాంక్ కదా', 'నిజం చెప్పు రాహుల్', 'ఇదేదో వెబ్‌సిరీస్ ప్రమోషన్ అయ్యుంటుంది', 'నావల్ల ప్రాబ్లమ్ అయితే నేను వెళ్లిపోతా మామా.. అన్న డైలాగ్‌ను నిజం చేయట్లేదుగా' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో తెరంగేట్రం చేసిన రాహుల్ 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'జాతిరత్నాలు', 'కల్కి', 'స్కైలాబ్' చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ఈ ఏడాదితో తన యాక్టింగ్ కెరీర్‌కు ఎందుకు ఫుల్స్టాప్ పెడుతున్నాడనేది తెలియాల్సి ఉంది. 2022 is my last. I will not do films anymore. Not that I care, nor should anybody care — Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022 -
‘స్కైలాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : స్కైలాబ్ నటీనటులు : సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు నిర్మాణ సంస్థ: బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ నిర్మాతలు : పృథ్వీ పిన్నమరాజు, నిత్యా మేనన్ దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది ఎడిటింగ్: రవితేజ గిరిజాల విడుదల తేది : డిసెంబర్ 4, 2021 విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘స్కైలాబ్’.నిత్యామీనన్ హీరోయిన్. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించాడు. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై సినిమాపై ఆసక్తి పెంచింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా భారీగా చేయడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శనివారం(డిసెంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్కైలాబ్’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘స్కైలాబ్’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1979 నాటికాలంలో సాగుతుంది. కరీంనగర్ జిల్లా బండలింగంపల్లి గ్రామానికి చెందిన గౌరి(నిత్యామీనన్).. జమీందార్ కూతురైనప్పటికీ జర్నలిజంలో తనేంటో నిరూపించుకోవాలనుకుని హైదరాబాద్‌లో ప్రతిబింబం పత్రికలో చేరుతుంది. ఎప్పటికైనా తన పేరుతో వార్త అచ్చువేయించుకుంటానని తండ్రితో సవాల్ చేస్తుంది. అయితే తన రాతల వల్ల పత్రికకు ఇబ్బందులు తప్ప లాభమేమిలేదని పత్రిక ఎడిటర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేస్తాడు. రైటర్‌గా తనను తాను నిరూపించుకోవడానికి మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది గౌరి. అదే గ్రామానికి చెందిన డాక్టర్ ఆనంద్(సత్యదేశ్) సస్పెండై సొంతూరికి వచ్చి క్లినిక్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే తనకు కాస్త స్వార్థం ఎక్కువ. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తాడు. వీరితో పాటు అదేగ్రామానికి చెందిన సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) కుటుంబం చేసిన అప్పులు తీర్చడానికి నానా తంటాలు పడుతుంటాడు. వివాదంలో ఉన్న తాత భూమి అమ్మితే చాలు.. అప్పులన్ని తీర్చి హాయిగా బతకొచ్చని భావిస్తాడు. ఇలా వేరు వేరు సమస్యలో సతమతమవుతున్న ఈ ముగ్గురు.. ఒక బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో. అమెరికా అంతరిక్ష ప్రయోగశాల నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి. అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందనే పుకార్లు వస్తాయి. ఆ సమమంలో గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? స్కైలాబ్ నిజంగానే బండలింగంపల్లి గ్రామంలో పడిందా? ఈ సంఘటన కారణంగా గౌరి, డాక్టర్ ఆనంద్, సుభేదార్ జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అనేదే ‘స్కైలాబ్’మిగతా కథ. ఎవరెలా చేశారంటే... జర్నలిస్ట్ గౌరిగా నిత్య అద్భుతంగా నటించారు. హీరోయిన్లా కాకుండా.. గౌరి అనే పాత్రగా మాత్రమే తెరపై కనిపిస్తారు. ఆమె వాయిస్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక సత్యదేశ్, రాహుల్ రామకృష్ణ నటనకు వంక పెట్టాల్సిన అవసరంలేదు. నటులుగా వారు ఎప్పుడో నిరూపించుకున్నారు. డాక్టర్ ఆనంద్‌గా సత్యదేవ్, సుబేదార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆనంద్ తాతయ్య పాత్రలో తనికెళ్ల భరణి, గౌరి తల్లి పాత్రలో తులసి మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. ఇక గౌరి ఇంట్లో పనిచేసే శ్రీను పాత్రలో కొత్త కుర్రాడు విష్ణు బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ? 1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అప్పట్లో స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విశ్వక్ ఖండేరావు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. అయితే అనుకున్న పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు తెరపై చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కథ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అయితే కథ ఎప్పటికీ ముందుకుసాగదు. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సెకండాఫ్‌లో అయినా కథలో వేగం పెరుగుతుందనుకుంటే.. అక్కడ కూడా అంతే. స్లోగా సాగుతూ.. బోర్ కొట్టిస్తుంది. అయితే క్లైమాక్స్ సీన్స్, సంభాషణలు బాగున్నాయి. అలాగే అంతర్లీనంగా అప్పట్లో మనషుల మధ్య ఉన్న వివక్షను చూపించే ప్రయత్నం బాగుంది. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా సందర్భానుసారం వస్తాయి. రీ రికార్టింగ్ కూడా ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫికీ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 1979నాటి పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం మెచ్చుకోవాలి. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు బాగా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. ‘స్కైలాబ్’ప్రయోగం విఫలమైనా.. ప్రయత్నం మాత్రం బాగుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘నెట్’ మూవీ ట్రైలర్ విడుదల, సస్పెన్స్ మమూలుగా లేదుగా..
హీరోయిన్ అవికాగోర్, కమెడియన్ రాహుల్ రామకృష్ణ కాంబోలో వస్తున్న చిత్రం ‘నెట్’. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అవికాగోర్.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించగా.. అశ్లీల చిత్రాలు వీక్షించే యువకుడిగా రాహుల్ కనిపిస్తాడు. ఈ క్రమంలో ప్రియ ఇంట్లో సీక్రెట్ కెమెరాలను ఉంచి వాటి ద్వారా ఆమె ప్రతి కదలికలను గమనించిన రాహుల్ చివరకు ఎలాంటి చిక్కుల్లో పడతాడు, ప్రియ జీవితాన్ని సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ మూవీని రూపొందించారు. ఈ టైలర్ విషయానికోస్తే.. మహిళల గోప్యత, భద్రత లాంటి అంశాలపై చర్చను లేవనెత్తేలా ఈ ట్రైలర్ కొనసాగుతుంది. నరేశ్ కుమరన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంది. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రపీ, ఎడిటర్ రవితేజ గిరిజాల పర్ ఫెక్ట్ కట్స్‌తో అందించిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అవికాగోర్ చాలా కాలం తర్వాత తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తమాడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమాడా, సాయి దీప్ రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు. జీ 5 ఓటీటీ ప్లాట్ ఫాంలో సెప్టెంబర్ 10న ఈ మూవీ విడుదల కానుంది. -
1979 లోభూమి నాశనం అవుతుందన్నారు..అసలేం జరిగిందంటే..
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ కందెరావ్ దర్శకత్వంలో డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను హీరోయిన్ తమన్నా విడుదల చేశారు. ‘‘1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని అప్పట్లో వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: నిత్యామీనన్, కెమెరా: ఆదిత్య జవ్వాది, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి. -
'పీకలదాక విస్కీ తాగించి మా డైరెక్టర్ ఏదేదో చేయించాడు'
సాక్షి, హైదరాబాద్ : రోజూపూలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో శ్రీరామ్. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆయన చాలా కాలం తర్వాత నటిస్తున్న చిత్రం ‘వై’. ఏప్రిల్2 ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ..‘నేను రోజా పూలు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాను. దాదాపు 20 ఏళ్లు కావొస్తుంది. మళ్లీ ఇన్ని రోజుల తరువాత ఇలాంటి వేదిక దొరికింది. నా జీవితంలోనే అతి తక్కువ సమయంలో చేసిన సినిమా ఇదే. రాహుల్ రామకృష్ణతో చేసిన ఆ సీన్లో ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. ఏమేమో జరిగిపోయింది. పీకలదాక విస్కీ తాగించి మా డైరెక్టర్ ఏదేదో చేయించాడు. ఆయన ఓ టాస్క్ మాస్టర్. ఏమాత్రం హద్దు దాటకుండా చాలా నీట్‌గా తీసిన చిత్రమిది. ఇలాంటి సినిమాలో పనిచేయడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు. బాలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్ర పోషించారు. చదవండి : రష్మిక..కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది' సారంగదరియా.. స్పీడు మామూలుగా లేదయా.. -
‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్
కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం జాతిరత్నాలు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ జాతిరత్నాలు 20 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చారు. భారీ లాభాలు రావడంతో సక్సెన్ టూర్‌ని కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సక్సెస్ టూర్లో భాగంగా నవీన్, ప్రియదర్శి అమెరికాకు వెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు అన్ని చోట్ల తిరుగుతున్నారు. వారి ప్రయాణంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం నవీన్, ప్రియదర్శి అమెరికా టూర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన రాహుల్ రామకృష్ణ.. తనను అమెరికా తీసుకెళ్లకుండా మోసం చేశారంటూ.. ప్రియదర్శి, నవీన్‌లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అరేయ్ దర్శి, నవీన్.. పీపుల్స్ ప్లాజాలో సక్సెస్‌మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్ కార్డ్ ఉందని. పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా..! జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా! మీరు రండ్రా మీ సంగతి చెబుతా..!’అంటూ ఓ సరదా వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాహుల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Scandalous video response to #JathiRatnalu team’s USA success tour by @eyrahul @NaveenPolishety @priyadarshi_i https://t.co/vZpJocELTI pic.twitter.com/67Upo8Gl1m — Rahul Ramakrishna (@eyrahul) March 20, 2021 -
త్వరలోనే సీక్వెల్ ఉంటుంది
‘‘జాతి రత్నాలు’ సినిమా చూడమని నా స్నేహితులు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల చూడలేకపోయాను. నవీన్, ప్రియదర్శి, రాహుల్ దగ్గర ఎంతో కళ ఉంది.. ఇప్పుడు వారికి సమయం వచ్చింది’’ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘థియేటర్లలో నవ్వులు పూయించేందుకు చేసిన మా ప్రయత్నం ఫలించింది’’ అన్నారు అనుదీప్. ‘‘చిత్రం భళారే విచిత్రం’ విడుదలైనప్పుడు వచ్చిన క్రేజ్‌ని మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను’’ అని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. ‘‘త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుంది’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. -
జాతి రత్నాలు మూవీ సక్సెస్ మీట్ ఫోటోలు
-
అమ్మ మాట కోసం వెయిటింగ్: రాహుల్ రామకృష్ణ
‘‘డిజిటల్ డెమోక్రసీ పెరగడం వల్ల అన్ని సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. విభిన్నమైన సినిమాల పట్ల ప్రేక్షకులకు అవగాహన పెరిగింది. దీంతో కొత్త రకమైన సినిమాలకు ఆదరణ పెరిగింది’’ అని రాహుల్ రామకృష్ణ అన్నారు. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా జంటగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతిరత్నాలు’. స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. రాహల్ రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ కథ వింటున్నప్పుడే చాలా ఎంజాయ్ చేశాను. మొదట్లో ఈ సినిమాకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారా? అనిపించింది. రిలీజ్ తర్వాత మా డౌట్స్ అన్నీ పోయాయి. అనుదీప్‌లో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘జర్నలిస్ట్‌గా నా కెరీర్‌ను స్టార్ట్ చేశాను. క్రైమ్ బీట్ చూశాను. ఆ తర్వాత ఫిల్మ్ రిపోర్టర్ అవుదామనుకొని ఇప్పుడు ఫిల్మ్స్‌లో యాక్టర్‌గా చేస్తున్నాను. ‘అర్జున్‌రెడ్డి’లో శివ పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చింది. మా అమ్మగారు నా నటనకు పెద్ద క్రిటిక్. ‘నువ్వు బాగా నటించావు’ అని మా అమ్మగారు చెప్పే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. రీసెంట్గా ‘వై’ అనే సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చేశాను. హీరోగానో, విలన్‌గానో ఎందుకు చేయకూడదని నాకు అనిపించింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఇందులో నేను లీడ్ యాక్టర్‌గా చేస్తున్నవి కూడా ఉన్నాయి’’ అన్నారు. చదవండి: సోషల్ హల్చల్: అందాల భామలు, లేతమెరుపు తీగలు.. -
వ్యాక్సిన్ వద్దు.. మీ సినిమా చాలన్నారు
‘‘కమెడియన్, హీరో, విలన్ అని కాదు... ఓ మంచి నటుడిగా నన్ను ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటే చాలు. అయినా కామెడీ చేయడం అంత సులువేం కాదు’’ అన్నారు ప్రియదర్శి. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వం వహించిన సినిమా ‘జాతిరత్నాలు’. స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన శేఖర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. సినిమాను, నా పాత్రను అభినందిస్తూ చాలామంది ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. ఒకరైతే వ్యాక్సిన్ వద్దు. మీ సినిమా చాలు అన్నారు. సరదాగా అనిపించింది. మొదట రాహుల్ రామకృష్ణకు కథ నచ్చి నన్ను కూడా వినమన్నాడు. అనుదీప్ ఈ కథ చెబుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. రెండేళ్ళుగా నవీన్ నాకు తెలుసు. పదేళ్లుగా రాహుల్ తెలుసు. మా స్నేహం స్క్రీన్ పై ప్రతిబింబించిందని అనుకుంటున్నా. నాగ్ అశ్విన్ , స్వప్న అక్క బాగా సహాయం చేశారు. ‘మొదట్లో ఇండస్ట్రీలో ప్లేస్ కోసం ప్రయత్నించాను. ‘టెర్రర్’లో విలన్ గా చేశా. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’తో కమెడియన్ గా మారాను. నాకు ఎస్వీఆర్, కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్‌గార్ల యాక్టింగ్ అంటే ఇష్టం. నా భార్య రైటర్. తనతో నా సినిమాలు కొన్ని డిస్కస్స్ చేస్తుంటా. ప్రస్తుతం రెండు సినిమాలతో పాటు ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నా. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. డైరెక్షన్ ఆలోచన ఉంది. కానీ డైరెక్షన్ చాలా టఫ్. భవిష్యత్తులో చూడాలి’’ అని అన్నారు. -
‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ
టైటిల్ : జాతి రత్నాలు జానర్: కామెడీ ఎంటర్టైనర్ నటీనటులు : నవీన్ పోలిశెట్టి, ఫారియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, బ్రహ్మానందం, నరేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు నిర్మాణ సంస్థ : స్వప్న సినిమాస్ నిర్మాతలు : నాగ్ అశ్విన్ దర్శకత్వం : అనుదీప్ సంగీతం : రథన్ సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహర్ కెమెరా ఎడిటింగ్ : అభినవ్ రెడ్డి దండ విడుదల తేది : మార్చి 11, 2021 కొన్ని సినిమాలపై విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి సినిమానే ‘జాతి రత్నాలు’. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే దానిపై చర్చ మొదలయింది. టైటిల్ డిఫరెంట్‌గా ఉండడం, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించడంతో ‘జాతి రత్నాలు’మూవీపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సూపర్ హిట్ కావడంతో ఆ అంచనాలు తారాస్థాయికి పెరిగాయి. ఇక ప్రొమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేసారు. ఇన్ని అంచనాల మధ్య మహాశివరాత్రి కానుకగా గురువారం(మర్చి 11)న విడుదలైన ‘జాతిరత్నాలు’ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి) మెదక్ జిల్లా జోగిపేట గ్రామానికి చెందిన లేడీస్ ఎంపోరియం ఓనర్ (తనికెళ్ళ భరణి) కొడుకు. అతనికి ఇద్దరు స్నేహితులు రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి). ఈ ముగ్గురు అల్లరిచిల్లరగా తిరుగుతుంటారు. వీరంటే ఊళ్లో వాళ్లకి చిరాకు. తన తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియంలో శ్రీకాంత్ పని చేయడంతో అతన్ని అందరూ‘లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్’అని పిలుస్తుంటారు. అలా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని, హైదరాబాద్‌కి వెళ్లి ఉద్యోగం చేస్తానని బ్యాగు సర్దుకొని సిటీకి బయలుదేరుతాడు. అతనితో పాటు ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా హైదరాబాద్‌కు వస్తారు. అక్కడ శ్రీకాంత్ చిట్టి (ఫరియా)తో ప్రేమలో పడతాడు. కట్‌చేస్తే.. ఈ ముగ్గురు అనుకోకుండా ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతారు. అసలు ఆ హత్య కేసుకి, ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ హత్య చేసిందెవరు? ఈ కేసు నుంచి ముగ్గురు ఎలా తప్పించుకున్నారు? అనేదే మిగతా కథ. నటీనటులు ఈ సినిమా మొత్తం నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రల చుట్టే తిరుగుతంది. అమాకత్వం గల శ్రీకాంత్ పాత్రలో నవీన్ ఒదిగిపోయాడు. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. అమాయకత్వంలోనే హీరోయిజం చూపించి మెప్పించాడు. ఇక ప్రియదర్శి, రామకృష్ణ ఎప్పటిలానే ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా చిట్టి పాత్రలో క్యూట్‌గా కనిపించింది. నటన పరంగా కూడా పర్వాలేదు. మురళీశర్మ రొటీన్ గానే కనిపించాడు. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ తమదైన కామెడీ పంచ్‌లతో నవ్వించారు. విశ్లేషణ అమాయకత్వంతో కూడిన కామెడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. 'జాతిరత్నాలు' అలాంటి చిత్రమే. ముగ్గురు అమాయకులు.. ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా మలిచాడు దర్శకుడు అనుదీప్. సింపుల్ కథను మెయిన్ లీడ్ పై అశ్లీలం లేని కామెడీతో బాగా డీల్ చేసాడు. అలాగే తాను రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ చివరి వరకూ ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కొచ్చి సన్నివేశాల్లో కామెడీ మరీ ఓవర్ అయినట్లు అనిపిస్తుంది. అలాగే కేసు విచారణను డీల్ చేసిన విధానం కూడా అంత కన్విన్స్‌గా అనిపించదు. ఎక్కడో లాజిక్స్ మిస్సయ్యారనే భావన కలుగుతుంది. అలాగే సెకండాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాప్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు, పంచ్ డైలాగ్స్మంచి ఫన్ ను జెనరేట్ చేస్తాయి. ముఖ్యంగా బ్రహ్మానందంతో వచ్చే కోర్టు సీన్ అయితే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మరో జాతి రత్నం సంగీత దర్శకుడు రథన్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. సిద్దం మనోహర్ కెమెరా పనితనం కూడా బాగుంది. ఎడిటర్ అభినవ్ రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నవీన్, రాహుల్, ప్రియదర్శి నటన అశ్లీలం లేని కామెడీ రథన్ సంగీతం మైనస్ పాయింట్స్ కథలో కొత్తదనం లోపించడం సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లు -
అంతకు మించిన పేమెంట్ లేదు!
‘‘నేను చేసే ప్రతి సినిమాలో కొత్త పాయింట్ ఉందో లేదో చూసుకుంటాను. అన్ని రకాల పాత్రలు, డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అని నవీన్ పొలిశెట్టి అన్నారు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. నవీన్ మాట్లాడుతూ – ‘‘‘జాతిరత్నాలు’ కథ విన్నప్పుడు ఎంజాయ్ చేశాను. సాధారణంగా గొప్పవారిని జాతిరత్నాలు అంటారు. కానీ మా ‘జాతిరత్నాలు’ సెటైరికల్ మూవీ. మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్ల నుంచి వస్తే నాకు అంతకు మించిన పేమెంట్ లేదు. నేను ముంబైలో ఉన్నప్పుడు నా వీడియోలు నాగీకి పంపేవాడిని. మాలాంటి కొత్తవారికి ఇలాంటి నిర్మాతలు అవకాశాలు ఇస్తే ప్రతి ఇంట్లో ఓ నవీన్ ఉంటాడు. నాకు యాక్సిడెంట్ అయ్యింది. లేకపోతే ‘జాతిరత్నాలు’ను థియేటర్లో పదిసార్లు చూసేవాడిని’ అని ఓ ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. అతనికి సినిమా చూపిస్తే, హిలేరియస్‌గా ఉందని చెప్పాడు’’ అని అన్నారు. -
అందుకే ప్రభాస్ కూల్: నాగ్ అశ్విన్
‘‘అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా వెళ్తుతుందనే నమ్మకం ఉంది. ‘బాహుబలి’ సినిమా వల్ల కొత్త దారులు ఏర్పడ్డాయి. స్పైడర్‌మ్యాన్, జేమ్స్‌బాండ్ వంటి చిత్రాలు మన దగ్గర విడుదలవుతున్నాయి. మన సినిమాలు కూడా ఆ స్థాయిలో అక్కడ రిలీజ్ అయ్యే తరుణం వస్తుంది’’ అని దర్శక -నిర్మాత నాగ్ అశ్విన్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకుడు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చెప్పిన విశేషాలు... ► నాకు జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ హిలేరియస్ మూవీ చేద్దామనుకున్నాను. అనుదీప్ చేసిన ఓ కామెడీ షార్ట్‌ఫిల్మ్ చూసి ఓ హిలేరియస్ సినిమా చేద్దామని నేనే అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లా. అతను చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో దాన్ని డెవలప్ చేయమని చెప్పాను. అలా ‘జాతిరత్నాలు’ మొదలైంది. ఈ సినిమాలో కామెడీ, స్టోరీ ఐడియా అనుదీప్‌దే. ఎక్కువకాలం ట్రావెల్ అయ్యాను కాబట్టి నాకు అనిపించిన ఇన్ పుట్స్ కొన్ని ఇచ్చాను. ► విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి నాకు ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా నుంచి పరిచయం. విజయ్, నవీన్ ల కాంబినేషన్లోనే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తీద్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ షూటింగ్ సమయంలో నవీన్ కు ‘జాతిరత్నాలు’ కథ పంపా. అతనికి కథ నచ్చింది. నవీన్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడు. రాహుల్, ప్రియదర్శి కూడా చాలా బాగా చేశారు. ఒక స్క్రిప్ట్ రాయాలన్నా.. సినిమా తీయాలన్నా బ్రెయిన్ కావాలి. కానీ మంచి కామెడీ తీయాలంటే మాత్రం హార్ట్ ఉండాలి. అనుదీప్‌కి మంచి హార్ట్ ఉంది. అందుకే సినిమా ఇంత హిలేరియస్‌గా వచ్చింది. ► ముగ్గురు సిల్లీ ఫెలోస్ ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కథ. ‘మనీ మనీ..’, ‘అనగనగా..’ తరహాలో ఔట్ అండ్ ఔట్ కామెడీ. రెండు మూడు టైటిల్స్ అనుకున్న తర్వాత ‘జాతిరత్నాలు’ ఫిక్స్ చేశాం. నవీన్ కు హిందీలో మార్కెట్ ఉంది. కాబట్టి దీన్ని హిందీలో డబ్ చేసే ఆలోచనలో ఉన్నాం. ► నాకు నిర్మాతగా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశం లేదు. ఒకవేళ మంచి కంటెంట్ సినిమాలు వస్తే స్వప్న సినిమాస్ ద్వారా ప్రోత్సహిస్తాను. ► నా గత చిత్రాలు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’లో హ్యూమర్ ఉంది. అలాగే ప్రభాస్‌తో నేను చేయబోయే సినిమాలో కూడా కొంత హ్యూమర్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. అందుకే సమయం పడుతోంది. జూలైలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. ► ప్రభాస్ దగ్గరకి ఒక పెద్ద స్టార్‌గా భావించి వెళతాం. కానీ ఆయన సరదాగా ఉంటారు. సినీ లెక్కలు, బాక్సాసీఫ్ ఓపెనింగ్స్ పట్టించుకోరు. సోషల్ మీడియాపై ఆసక్తి చూపించరు. ఎప్పుడైనా మాట్లాడితే మేం చేయాల్సిన సినిమాలు, ఆయన చేస్తున్న ఇతర సినిమాల గురించే మాట్లాడతారు. అందుకే ప్రభాస్ అంత కూల్‌గా ఉంటారేమో! - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
‘షాదీ ముబారక్’ మూవీ రివ్యూ
టైటిల్ : షాదీ ముబారక్ నటీనటులు : సాగర్, దృశ్య రఘునాథ్, రాహుల్ రామకృష్ణ, హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు దర్శకత్వం : పద్మశ్రీ నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫి : శ్రీకాంత్ నరోజ్ ఎడిటింగ్ : మధు చింతల విడుదల తేది : మార్చి 5, 2021 బుల్లితెరపై ఆర్కే నాయుడుగా నటించి కుటుంబ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేం సాగర్. గతంలో ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో వెండితెరపై తళుక్కుమన్న అతడు హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘షాదీ ముబారక్’. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించగా, పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ఆకట్టకునే టైటిల్‌తో తెరకెక్కిన మూవీ ట్రైలర్‌పై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతోమంచి అంచనాలే ఏర్పడ్డాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది? హీరోగా సాగర్ ఎంత వరకు సక్సెస్ అయ్యాడు? అన్న అంశాలు రివ్యూలో గమనిద్దాం. కథ మాధవ్ (సాగర్) ఫారిన్లో ఉంటాడు. ఆస్ట్రేలియాలో నివసించే అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి, వధువును సెలక్ట్ చేసుకునే క్రమంలో హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్) పరిచయం అవుతుంది. తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె మాధవ్‌తో కలిసి సత్యభామ పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ, మాధవ్ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ- మాధవ్ ఒక్కటయ్యారా లేదా తెలియాలంటే షాదీ ముబారక్ చూడల్సిందే. నటీనటులు బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్లో నటించి లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న సాగర్..మంచి కథతో హీరో అయ్యాడు.మాధవ్ పాత్రలో ఒదిగిపోయాడు. స్క్రీన్‌పై బాగా కనిపించడమే కాకుండా మంచి ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించాడు. ఇక హీరోయిన్ దృశ్య రఘునాథ్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది.రాహుల్ రామకృష్ణ, హేమంత్, భద్రం తమదైన కామెడీతో నవ్వించారు. హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ దర్శకుడు పద్మశ్రీకి తొలి సినిమా ఇది. కానీ ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్నట్లుగా కథను తెరకెక్కించాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సాధించాడని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్లో ఓ అందమైన కథను ప్రేక్షకులకు అందించాడు. యువతను అకర్షించే అంశాలైన రొమాన్స్, కామెడీని తన కథలో మిస్ కాకుండా చూసుకున్నాడు. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సింపుల్ కథని చక్కగా తెరపై చూపించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ సునీల్ కశ్యప్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. మధు చింతల ఎడిటింగ్, శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
జాతి రత్నాలు ట్రైలర్ చూసి సరదాగా నవ్వుకోండి
పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో. గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ రిలీజ్ చేశాడు. ఇందులో బీటెక్ విద్యార్థి నవీన్ పొలిశెట్టి ఓ లేడీస్ ఎంపోరియం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని బయట చెప్పుకోవడానికి మాత్రం తెగ సిగ్గుపడుతున్నాడు. ఇక ఓ సన్నివేశంలో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిపేషన్.. అంటూ రాని ఇంగ్లీష్‌ను మాట్లాడే ప్రయత్నం చేసి తప్పులో కాలేశాడు. దీంతో షాకైన నరేశ్ అది కాన్‌స్టిట్యూషన్‌రా అని తప్పును సవరించాడు. శత్రువుకు శత్రువు ఏమవుతారంటే అజాత శత్రువు అని చెప్పడం వంటి కొన్ని డైలాగులు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మా కేసును మేమే వాదించుకుంటాం అని కేసులో ఇరుక్కున్న నవీన్, ప్రియదర్శి న్యాయవాది బ్రహ్మానందానికి తెగేసి చెప్పారు. అప్పుడు బ్రహ్మానందం అయితే తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి అని కోర్టు హాలును వదిలి వెళ్లడం నవ్వు తెప్పిస్తోంది. మొత్తానికి అన్లిమిటెడ్ ఫన్ ప్యాక్డ్గా కనిపిస్తోన్నఈ ట్రైలర్ జనాలను విశేషంగా ఆకర్షిస్తోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది. చదవండి: జాతిరత్నాలు ప్రేక్షకుల్ని నవ్విస్తారు ప్రభాస్ నా చిన్ననాటి ఫ్రెండంటూ హీరో పోజులు! -
టీజర్: నవ్వులు పూయిస్తున్న ‘జాతి రత్నాలు’
‘లైఫ్ అండ్ డెత్’ పరిస్థితిలో కూడా ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ నవ్వులు పూయిస్తున్నారు. వారు ముఖ్యపాత్రలుగా ‘జాతి రత్నాలు’ అనే సినిమా తెరకెక్కుతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఖైదీల వేషంలో నవీన్, ప్రియదర్శి, రాహుల్ కనిపించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నవీన్ పోలిశెట్టికి జోడీగా నటిస్తోంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 11వ తేదీన ‘జాతి రత్నాలు’ థియేటర్లలో విడుదల కానుంది. మురళీ శర్మ రూ.500 కోట్ల ప్రాజెక్టుతో ఈ ముగ్గురు హీరోలకు ఉన్న సంబంధమే చిత్ర కథగా టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. అదే ఈ ముగ్గురి జీవితంలో ‘లైఫ్ అండ్ డెత్’ పరిస్థితి ఏర్పడటానికి కారణంగా కనిపిస్తోంది. ఆసక్తికరంగా, నవ్వులు పంచుతూ సాగిన ఈ టీజర్‌ను చూడండి. సినిమాటోగ్రఫీ సిద్దం మనోహర్, సంగీతం రాధన్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో వీకే నరేశ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
సినిమా తీయడం అంత సులువు కాదు
‘‘నాకు సినిమా పట్ల అంత ఆసక్తి లేదు. కాకపోతే రాయడం నేర్చుకున్నాను. అమెరికాలో ఎమ్మెస్ చేశాను.. అక్కడే ఓ ఐటీ కంపెనీలో 10 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత 2004లో బెంగళూరుకు మారిపోయా’’ అని సుజాయ్ కారంపూడి తెలిపారు. సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో సుజాయ్, సుశీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుజాయ్ మాట్లాడుతూ– ‘‘మధుర’ శ్రీధర్ షార్ట్ ఫిలిం కోసం ఒక స్టోరీ రాశాను. ఆయనకు బాగా నచ్చడంతో సినిమా కథలు రాయమని సలహా ఇచ్చారు. మేం ఇండస్ట్రీకి కొత్త. ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు. అందుకే తెలుగు సినిమాలు చూశాం. మా ప్రయత్నాల్ని, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. సినిమా నిర్మాణం మాకు చాలా నేర్పించింది.. ఆటుపోట్లు తెలిశాయి. సినిమా అనేది అంత సులభమైన పనేం కాదు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో మా కుటుంబాన్ని కనీసం వారాంతంలో కూడా కలవలేకపోయాం. స్క్రిప్ట్ డెవలప్ చేయడమో, సినిమా మేకింగ్‌లోనో బిజీగా ఉండేవాళ్లం’’ అన్నారు. సుశీల్ మాట్లాడుతూ– ‘‘మేం సాఫ్ట్వేర్ నేపథ్యం నుంచి వచ్చాం. అక్కడ చర్చల్లో డెవలప్మెంట్, ఫీడ్‌బ్యాక్ వంటి విలువైన అంశాలు ఉండేవి. ఇవే సూత్రాల్ని మేం స్టోరీ చర్చించేటప్పుడు కూడా పాటించాం. సినిమా మేకింగ్ సమయంలో అవి బాగా దోహదపడ్డాయి. ఒక యువకుడి చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. తల్లిదండ్రుల ఆత్మీయత, భావోద్వేగాల్ని ఈ సినిమాలో చూపించాం. మేకర్స్‌గా మాకిది తొలి సినిమా. విలువైన విమర్శలను ఆహ్వానిస్తాం’’ అన్నారు. -
చిన్నప్పుడే అత్యాచారానికి గురయ్యా : రాహుల్
షార్ట్ ఫిల్మ్స్‌తో తన జర్నీ ప్రారంభించిన రాహుల్ రామకృష్ణ.. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. అయితే తాజాగా రాహుల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తను చిన్నతనంలో అత్యాచారానికి గురైనట్టు తెలిపారు. ఆ బాధను ఎవరితో పంచుకోవాలో కూడా తెలియడం లేదన్న ఆయన.. ట్విటర్లో షేర్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోవడంతో ద్వారా.. తనేంటో తెలుసుకోగలనని పేర్కొన్నారు. అన్ని చాలా బాధగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తెలుసుకున్న నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. రాహుల్‌కి ధైర్యం చెప్తూ పోస్టులు చేస్తున్నారు. తెరపై నవ్వులు పంచే ఓ నటుడి వెనక ఇంతా విషాద గాథ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. నటుడు ప్రియదర్శి కూడా రాహుల్‌కు ధైర్యం చెబుతూ ట్వీట్ చేశారు. ‘నేను ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు అనుభవించిన బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేను. అలాగే నేను ఏమీ చేయలేను కూడా. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలని మాత్రం చెప్పగలను. నువ్వు ప్రతి చెడు అంశం నుంచి బయటకు రావాలి.. వాటిని నీ సామర్థానికి తగ్గట్టుగా ధీటుగా ఎదుర్కొవాలి. నువ్వు ఒక ఫైటర్‌వి. లవ్ యూ బ్రదర్’ అని ప్రియదర్శి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనకు మద్దుతుగా నిలిచినవారికి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ‘అన్నింటికంటే మీ మాటలు నాకు ఎంతో సాయం చేశాయి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. వారి ప్రవర్తనలో కలిగే మార్పులను నిశితంగా గమనించాలి. వారు ఎదుర్కొంటున్న భయానక సంఘటనలు గురించి బయటకు చెప్పే అంతా ధైర్యం, నైపుణ్యత వారికి ఉండకపోవచ్చు’అని వెల్లడించారు. కాగా, గతంలో కూడా పలువురు బాలీవుడ్ ప్రముఖులు తము బాల్యంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. I was raped during childhood. I don’t know what else to say about my grief, except for this, because this is what I seek to know about myself. — Rahul Ramakrishna (@eyrahul) January 20, 2020 -
వినోదాల జాతిరత్నాలు
‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నాగ్అశ్విన్ ‘జాతిరత్నాలు’ సినిమాతో నిర్మాతగా మారారు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న తర్వాత స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రమిది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రియదర్శి 210, నవీన్ పొలిశెట్టి 420, రాహుల్ రామకృష్ణ 840 నంబర్లతో ఖైదీల దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో మంచి క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఫరియా అబ్దుల్లా, మురళీశర్మ, వి.కె.నరేశ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ‘శుభలేఖ’ సుధాకర్, ‘వెన్నెల’ కిషోర్, ‘మిర్చి’ కిరణ్, గిరిబాబు, ‘మహానటి’ ఫేమ్ మహేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: హర్ష గారపాటి, సంగీతం: రధన్, కెమెరా: సిద్ధాన్ మనోహార్. -
నా స్టైల్ ఏంటో తెలియదు
‘‘ఏ కథ తీసుకున్నా ముందు క్లైమాక్స్ రాసుకుంటాను. ముగింపు పూర్తయితే మిగతా కథను ఈజీగా రాసుకోవచ్చని నమ్ముతాను. కథ తయారవుతూ క్లైమాక్స్ కోసం ఎదురుచూస్తే ఆలస్యం అవుతుందనుకుంటాను. ముగింపు ఎలా ఉంటుందో తెలిస్తే కథను ఎలా అయినా అక్కడి వరకూ తీసుకెళ్లొచ్చు’’అని ప్రశాంత్ వర్మ అన్నారు. రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. ఆదాశర్మ, నందితా శ్వేత, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ పంచుకున్న విశేషాలు... ► ‘అ!, కల్కి’ సినిమాలకు క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలే బలం. అలాగని అన్ని సినిమాల్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఉండేలా ప్లాన్ చేయలేము. నెక్ట్స్ అనుకున్న కథలో ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్‌గా ఉండొచ్చు? అలాగే నా సినిమాలు ఇలానే ఉంటాయి అని ఆడియన్స్ కూడా ఓ ముద్ర వేయకూడదు. ప్రస్తుతానికి నా జానర్ ఏంటి? నా స్టైల్ ఏంటో నాకే తెలియదు. మెల్లిగా తెలుసుకుంటున్నాను. ► ‘అ!’ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది కానీ పెద్ద ఆఫర్స్ రాలేదు. పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్ రావాలంటే చాలా విషయాలను పరిగణించాలి. వాళ్లను హ్యాండిల్ చేయగలనా? కమర్షియల్ ఎలిమెంట్స్ డీల్ చేస్తానా?అనేవి చూస్తారు. ఆ ఉద్దేశంతోనే ‘కల్కి’ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్ టేకప్ చేశాను. ► ‘కల్కి’ కథను ముందు నేను డైరెక్ట్ చేయాలనుకోలేదు. స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో తయారయ్యేసరికి నాకే మంచి ఎగై్జటింగ్‌గా అనిపించింది. అలాగే స్క్రిప్ట్‌ను ఎలా డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కమర్షియల్ సినిమాలు రిఫరెన్స్ కోసం చూశా. ‘కేజీఎఫ్’ లాంటి ట్రీట్మెంట్ అయితే బావుంటుందని స్టైలిష్‌గా తీశాం. ► నేను ఐటమ్ సాంగ్స్‌కు వ్యతిరేకిని. కానీ ఇలాంటి సినిమాలో ఉండాలి. అందుకే పెట్టడం జరిగింది. అన్ని సినిమాలు రివ్యూవర్స్‌కి నచ్చాలని లేదు. ‘అ!’ సినిమాకు బాగా రాశారు. ఈ సినిమా ఎవరి కోసం తీశామో వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు నన్నే రివ్యూ రాయమన్నా తప్పులు బడతానేమో? ► రాజశేఖర్‌గారు షూటింగ్ స్పాట్‌కి లేట్‌గా వస్తారని విన్నాను. కానీ వాళ్ల ఫ్యామిలీతో వర్క్ చేయడం నాకు సౌకర్యంగానే అనిపించింది. సినిమా స్టార్ట్ అవ్వకముందు కొన్నిరోజులు వాళ్లతో ట్రావెల్ అయ్యాను. చాలా స్మూత్‌గా జర్నీ నడిచింది. వీళ్లను భరించొచ్చు అని ముందుకెళ్లిపోయా(నవ్వుతూ). ► శ్రావణ్ భరద్వాజ్ నాకు కాలేజ్ టైమ్ నుంచి ఫ్రెండ్. నేను తీసిన యావరేజ్ షార్ట్ ఫిల్మ్స్‌కి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు. ఇప్పుడు మా అందరి కంటే తనకే మంచి పేరొస్తుంది. ► ‘దటీజ్ మహాలక్ష్మీ’ సినిమా దర్శకుడు తప్పుకోవడంతో నేను జాయిన్ అయ్యాను. 31రోజుల్లో మొత్తం రీషూట్ చేశాను. దర్శకుడిగా క్రెడిట్ ఉండకూడదనేది అగ్రిమెంట్. ‘కల్కి’ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉందనడంతో ఆ సినిమా పూర్తి చేశాను. రీమేక్ సినిమా చేయడం కూడా ఓ ఎక్స్పీరియన్స్. ► ప్రస్తుతానికి కథలైతే సిద్ధంగానే ఉన్నాయి. ‘కల్కి’ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యాక కలెక్షన్స్ అన్నీ చూసి నెక్ట్స్ సినిమా ఏంటో అనౌన్స్ చేస్తా. హాట్‌స్టార్ వాళ్లకి ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నాను. ఫ్యామిలీ థ్రిల్లర్. ఇప్పటి వరకు అలాంటి కథ రాలేదు. -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘బ్రోచేవారెవరురా’
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక పాత్రలు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేదా థామస్ లతో పాటు సత్యదేవ్, నివేదా పేతురాజ్‌లను టీజర్లో పరిచయం చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
చలనమే చిత్రము
వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము..’ అనేది ట్యాగ్ లైన్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. రంగురంగుల దుస్తుల్లో ఉన్న శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ఒకే స్కూటర్‌పై వెళుతుండటం ఫస్ట్ లుక్ పోస్టర్లో కనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణుకి జోడీగా నివేదా థామస్ నటించారు. సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు చేశారు. ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమేరా: సాయి శ్రీరాం. -
కొత్తగా ‘బ్రోచేవారెవరురా’
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లేటెస్ట్ సెన్సేషన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కనపడతున్నారు. ఈ త్రయం రంగురంగుల దుస్తులు, షేడ్స్‌తో స్కూటర్ రైడ్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
సినిమా సక్సెస్ కాలేదని.. కమెడియన్ సంచలన నిర్ణయం
అర్జున్ రెడ్డి సినిమాలో నటించి విజయ్ దేవరకొండ ‘బెస్ట్ ఫ్రెండ్’గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. తన కామెడీ టైమింగ్‌తో అనతి కాలంలోనే ప్రేక్షకాదరణ పొందిన ఈ కమెడియన్ ట్విటర్ నుంచి వైదొలిగారు. దీనికి గల కారణం ఆయన ఇటీవల నటించిన సినిమా ‘మిఠాయి’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడమే. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ‘మిఠాయి’ చిత్రం ఈ నెల 22(శుక్రవారం)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రాహుల్ తన ట్విటర్ ద్వారా ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలియజేస్తూ వరుస ట్వీట్స్ చేశారు. అనంతరం ట్విటర్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. ‘మేము సినిమా బాగా రావటానికి చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి మా ప్రయాత్నాలేవి ఫలించలేదు. సినిమాకు ఇలాంటి ఫలితం వస్తుందని ముందే అంచనా వేశాను. సినిమా పరాజయానికి నేనే క్షమాపణలు తెలుపుతున్నా. దర్శకుడు ఆలోచన, ఊహలను ఇప్పటికీ గౌరవిస్తున్నా’’ అని తన చివరి ట్వీట్లో రామకృష్ణ పేర్కొన్నారు. అయితే తన అకౌంట్ తాత్కాలికంగా డి యాక్టివ్ వేట్ చేశారా? లేక శాశ్వతంగా డిలీట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. -
మిఠాయి బాగుంది
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అందరినీ ఆహ్లాదపరిచే చక్కటి వినోదాత్మక చిత్రమిది. డార్క్ కామెడీతో విభిన్న పాత్రల మధ్య సాగే కథ, కథనాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేస్తాయి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అభినయం సినిమాకే హైలైట్. నవరసాలను మేళవించి దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో బాగా తీశాడు. వివేక్ సాగర్ సంగీతం వీనుల విందుగా ఉంటుంది. ప్రేక్షకులకు ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు. భూషణ్ కల్యాణ్, రవివర్మ, గాయత్రి గుప్త, అదితీ మైఖేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్ నీలమేఘం. -
నవ్వించి పంపించే బాధ్యత మాది
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకలుగా నటించిన సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు తరుణŠ æభాస్కర్ బిగ్ సిడీని ఆవిష్కరించి ‘హుషార్’ ఫేమ్ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి అందించారు. అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమందరం కలిసి సైన్మా (షార్ట్ ఫిల్మ్), ‘పెళ్ళిచూపులు’ చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతామని ఎప్పుడూ అనుకోలేదు. అందరూ అనుకున్నట్లు నేను ఇంకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే.. అనుకోకుండా రోల్స్ రావడంతో యాక్ట్ చేస్తున్నాను’’ అన్నారు. ‘‘నా కథపై నమ్మకంతో సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమాను నిర్మించిన ప్రభాత్ కుమార్‌కి థ్యాంక్స్’’ అన్నారు ప్రశాంత్ కుమార్. ‘‘నేను ఓ డాక్టర్ని. నన్ను నిర్మాతను చేసింది ప్రశాంతే. తను ఏడాదిన్నరపాటు సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు’’ అన్నారు ప్రభాత్. ‘‘ప్రశాంత్‌కు తెలుగు రాదు. కానీ తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చిన తర్వాత అంతా సెట్ అయ్యింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. ఒక్క అవకాశం ఇవ్వండి.. నవ్విస్తాం’’ అన్నారు ప్రియదర్శి. సంగీతదర్శకుడు వివేక్ సాగర్ పాల్గొన్నారు. -
‘కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది!’
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. ప్రశాంత్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 22న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియోను శుక్రవారం విడుదల చేశారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్ భాస్కర్ బిగ్ సీడీ, ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని ‘హుషారు’ దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి స్వీకరించారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘అందరూ అనుకున్నట్టు నేనింకా యాక్టర్ అవ్వలేదు. డైరెక్షన్ చేస్తున్నా. కాకపోతే... అనుకోకుండా రోల్స్ రావడంతో చేస్తున్నా. యాక్టింగ్ చాలా కష్టమనేది కూడా అర్థమైంది. మిఠాయి విషయానికి వస్తే... ఈ సినిమా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నా స్నేహితులు. మేమంతా కలిసి ఆడుతూ పాడుతూ సైన్మా, పెళ్లి చూపులు చేశాం. మమ్మల్ని ప్రేక్షకులు ఇంత ఆదరిస్తారని, ఇంత సక్సెస్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్, నేనూ క్లాస్ మేట్స్. కాలేజీ రోజుల నుంచి ప్రశాంత్ కు సినిమాలంటే చాలా ఇష్టం. లక్కీగా నేను ముందు దర్శకుడు అయ్యా. మిఠాయితో ప్రశాంత్ దర్శకుడిగా మారుతున్నాడు. ఇది ఒక స్ట్రాంగ్ డెబ్యూ ఫిల్మ్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రశాంత్ సెన్సాఫ్ హ్యూమర్ గానీ... తను ఫాలో అయ్యే యాక్టర్స్ గానీ డిఫరెంట్ లెవెల్. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రశాంత్.. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ రోజు హీరో వివేక్ సాగర్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు’ అన్నారు. దర్శకుడు శ్రీ హర్ష కొనగంటి మాట్లాడుతూ ‘నా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ హీరోగా నటించిన చిత్రమిది. మేం హుషారు షూటింగ్ చేసేటప్పుడు ఈ సినిమా గురించి రాహుల్ రామకృష్ణ చాలా మంచి మంచి విషయాలు చెప్పేవారు. ప్రేక్షకులు అందరిలా నేను కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్నా. డార్క్ హ్యూమర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం’ అన్నారు. సినిమా దర్శకుడు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘నా కథపై నమ్మకంతో సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా ప్రొడ్యూస్ చేసిన నా బ్రదర్ ప్రభాత్ కుమార్ కి థాంక్స్. నా అకౌంటులో జీరో బాలన్స్ ఉన్నా... షూటింగ్ స్టార్ట్ చేసేవాణ్ణి. హండ్రెడ్ పర్సెంట్ ప్రభాత్ ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తాడని నమ్మకం. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, షఫీ... అందరూ ఎంతో హెల్ప్ చేశారు’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రశాంత్ కుమార్ ఈ కథ ఇచ్చి చదవమన్నాడు. సరేనని చదివా. ఇదేదో కొంచెం డార్క్ డార్క్ ఉందని అనుకున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా భయాలు ఉండేవి. రాహుల్ రామకృష్ణ సినిమాలోకి వచ్చాక.. అంతా సెట్ అయ్యింది. నటీనటులకు దర్శకుడు ప్రశాంత్ చాలా స్పేస్ ఇచ్చాడు. అతడికి ఒక్క ముక్క తెలుగు రాదు. కానీ, ఆయనకు తెలుగు సినిమా అంటే ఎంత ప్రేమ అంటే.. ఎక్కడ ఎక్కడ నుంచో డబ్బులు తీసుకొచ్చి సినిమా పూర్తి చేశాడు. సెట్స్ లో మేం తెలుగులో మాట్లాడేవాళ్ళం. తనకు సరిగా అర్థమయ్యేది కాదు. అందరం ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం. సినిమా బాగా వచ్చింది. ఈ నెల 22న థియేటర్లకు రండి. మీరూ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి పంపే బాధ్యత మాది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి... నవ్విస్తాం’ అన్నారు. -
కామెడీ మిఠాయి
‘మిఠాయి’ తియ్యగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ మా ‘మిఠాయి’ తినేది కాదు చూసేది’’ అంటున్నారు నిర్మాత డా. ప్రభాత్‌కుమార్. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజ్, శ్వేతావర్మ, ఆర్ష ముఖ్య తారలుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. ‘‘చిత్రరంగంలో విశేష అనుభవం సంపాదించుకున్న నిర్మాత మామిడాల శ్రీనివాస్ ఫ్యాన్సీ ధరకు ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు’’ అని నిర్మాత తెలిపారు. రాజేశ్వరి ఫిలింస్, మూవీ మ్యాక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాయి. మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ డార్క్ కామెడీతో విభిన్నమైన పాత్రల మధ్య సాగే చిత్రమిది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పాత్రలు పోటీపడి హాస్యాన్ని పంచుతాయి. అలాగే చిత్రంలో నవరసాలను దర్శకుడు ప్రశాంత్ చక్కగా తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మంచి బాణీలను అందించారు. సంగీతంతో పాటు కెమెరా, కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి పాటలు: కిట్టు విస్సాప్రగడ, మాటలు: బి.నరేశ్ రెడ్డి. -
హాలీవుడ్‌కు హాయ్
‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ దోస్త్‌గా కనిపించి హీరో బెస్ట్ ఫ్రెండ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత ‘భరత్ అనే నేను’ ‘గీత గోవిందం’ ‘హుషారు’ సినిమాల్లో మంచి మార్కులు వేయించుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్‌కు హాయ్ చెప్పడానికి రెడీ అయ్యారు. ‘సిల్క్ రోడ్’ అనే చిత్రం ద్వారా హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు రాహుల్. ‘‘ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రదీప్ తెలుగు వాడు కావడం విశేషం. -
ఫిబ్రవరి 22న ‘మిఠాయి’
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ కామెడీ చిత్రం ‘మిఠాయి’. ఈ సినిమాకు డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మాత. ఫిబ్రవరి 22 న విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ ‘ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో నడిచే చిత్రమిది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. సాయిగా రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. -
డైరెక్షన్ మాత్రం చేయను
‘‘ఉద్యోగం అంటే ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేసే సాఫ్ట్వేర్ ఉగ్యోగి పాత్రలో నటించాను. నాకూ ఈ సినిమాలో హీరోలకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది ‘హుషారు’ సినిమాలో చూడాలి’’ అన్నారు నటుడు రాహుల్ రామకృష్ణ. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించారు. తేజస్, అభినవ్, దక్ష, ప్రియా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘అర్జున్ రెడ్డి’ చిత్రం తర్వాత పూర్తిస్థాయి పాత్ర చేస్తున్నది ఈ చిత్రంలోనే. సెకండ్ హాఫ్ మొత్తం నా క్యారెక్టర్ కనిపిస్తుంది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలు తప్ప ఇంకేం ఉండవు అనే మెసేజ్‌ని దర్శకుడు చెప్పదలిచారు. నా పాత్ర కోసం నా సాఫ్ట్వేర్ స్నేహితులను స్ఫూర్తిగా తీసుకొని నటించా. ప్రస్తుతం వెబ్ సీరిస్‌ల కోసం కథలు రాస్తున్నాను. దర్శకత్వం మాత్రం చేసే ఆలోచన లేదు. అలాగే సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేను’లో విలన్‌గా నటిస్తున్నాను. రాజమౌళిగారి ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్ర, రాజశేఖర్ ‘కల్కీ’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నా’’ అన్నారు. -
ఈ సినిమాతో నేను అప్డేట్ అయ్యాను
తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమా ఇంగ్లే, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘హుషారు’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘బెక్కెం వేణుగోపాల్ అంటే అందరికీ ఇష్టం. ముఖ్యంగా కొత్తవాళ్లకు. మంచి కథను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. చిన్న సినిమా తీసి పెద్ద లెవల్లో రిలీజ్ చేయగలరు. ‘సినిమా చూపిస్త మావ’ అంత హిట్ కావాలి’’ అన్నారు. ‘‘నా 9 సినిమాలను ఒక్కో అనుభవంలానే భావిస్తా. సినిమా పరంగా నేను అప్డేట్ అయ్యాను. టీమ్ నన్ను సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎంజాయ్ చేశాను. కొత్తవాళ్లతో సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్.‘‘క్వాలిటీ సినిమా తీసే నిర్మాతల్లో వేణుగోపాల్‌గారు ఒకరు’’ అన్నారు మధుర శ్రీధర్. ‘‘వేణు గోపాల్ తపనున్న నిర్మాత. అందుకే ఈ సినిమా ఇంత అందంగా ఉంది’’ అన్నారు రాజ్‌తరుణ్. ‘‘వేణుగోపాల్‌గారు సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. పాటలు బావున్నాయి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘‘5 ఏళ్ల క్రితం గోపీగారితో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా చేశాను. ఆ తర్వాత నుంచి ఆయన సలహాలు తీసుకుంటున్నాను’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ‘‘అవకాశం ఇచ్చిన బెక్కెం వేణుగోపాల్గారికి థ్యాంక్స్. సినిమాలో ఓ మ్యాజిక్ ఉంది అది చూసి ఎంజాయ్ చేయాల్సిందే’’ అన్నారు దర్శకుడు శ్రీహర్ష. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు. -
ఓ ఇంటివాడవుతున్న యువ కమెడియన్..!
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో స్టార్ ఇమేజ్ అందుకున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ యువ నటుడు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని కూడా తనదైన స్టైల్లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు రాహుల్. తన సోషల్ మీడియా పేజ్‌లో బీచ్‌లో తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసిన రాహుల్ ‘జనవరి 15న నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎవరికీ చెప్పకండి’ అంటూ కామెంట్ చేశాడు. రాహుల్ కు శుభాకాంక్షలు వెళ్లువెత్తాయి. హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, సుశాంత్, కమెడియన్ వెన్నెల కిశోర్, విద్యుల్లేఖ రామన్ లు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. Psst.. I’m getting married on January 15th. Don’t tell anyone. Seriously. pic.twitter.com/fx4mVulayv — Rahul Ramakrishna (@eyrahul) 22 October 2018