Jathi Ratnalu Movie Trailer: జాతి రత్నాలు ట్రైలర్‌ చూసి సరదాగా నవ్వుకోండి - Sakshi
Sakshi News home page

జాతి రత్నాలు ట్రైలర్‌ చూసి సరదాగా నవ్వుకోండి

Published Thu, Mar 4 2021 5:50 PM | Last Updated on Fri, Mar 5 2021 11:29 AM

Jathi Ratnalu Trailer: Fantastic Fun Guarantee - Sakshi

అకార్డింగ్‌ టు ఇండియన్‌ కాన్‌స్టిపేషన్‌.. అంటూ రాని ఇంగ్లీష్‌ను మాట్లాడే ప్రయత్నం చేసి తప్పులో కాలేశాడు. దీంతో షాకైన నరేశ్‌ అది కాన్‌స్టిట్యూషన్‌రా..

పర్సంటేజ్‌ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్‌ అలియాస్‌ నవీన్‌ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్‌ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో. గురువారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్‌ రిలీజ్‌ చేశాడు. ఇందులో బీటెక్‌ విద్యార్థి నవీన్‌ పొలిశెట్టి ఓ లేడీస్‌ ఎంపోరియం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని బయట చెప్పుకోవడానికి మాత్రం తెగ సిగ్గుపడుతున్నాడు. 

ఇక ఓ సన్నివేశంలో అకార్డింగ్‌ టు ఇండియన్‌ కాన్‌స్టిపేషన్‌.. అంటూ రాని ఇంగ్లీష్‌ను మాట్లాడే ప్రయత్నం చేసి తప్పులో కాలేశాడు. దీంతో షాకైన నరేశ్‌ అది కాన్‌స్టిట్యూషన్‌రా అని తప్పును సవరించాడు. శత్రువుకు శత్రువు ఏమవుతారంటే అజాత శత్రువు అని చెప్పడం వంటి కొన్ని డైలాగులు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. మా కేసును మేమే వాదించుకుంటాం అని కేసులో ఇరుక్కున్న నవీన్‌, ప్రియదర్శి న్యాయవాది బ్రహ్మానందానికి తెగేసి చెప్పారు. అప్పుడు బ్రహ్మానందం అయితే తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి అని కోర్టు హాలును వదిలి వెళ్లడం నవ్వు తెప్పిస్తోంది. మొత్తానికి అన్‌లిమిటెడ్‌ ఫన్‌ ప్యాక్‌డ్‌గా కనిపిస్తోన్నఈ ట్రైలర్‌ జనాలను విశేషంగా ఆకర్షిస్తోంది. 

నవీన్‌ పోలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది.

చదవండి: జాతిరత్నాలు ప్రేక్షకుల్ని నవ్విస్తారు

ప్రభాస్‌ నా చిన్ననాటి ఫ్రెండంటూ హీరో పోజులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement