Rahul Ramakrishna Supports Vishwak Sen And Fires On Tv Channel, Tweets Viral On Social Media - Sakshi
Sakshi News home page

Rahul Ramakrishna : 'న్యూస్‌ తప్పా అన్నీ కవర్‌ చేస్తారు..పెద్ద ఎత్తున ఫండ్స్‌ వస్తాయ్‌'

Published Thu, May 5 2022 9:25 AM | Last Updated on Thu, May 5 2022 10:46 AM

Rahul Ramakrishna Supports Vishwak Sen And Fires On Tv Channel - Sakshi

హీరో విశ్వక్‌ సేన్‌- ఓ టీవీ యాంకర్‌ మధ్య జరిగిన వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో కొందరు ఆ యాంకర్‌కు సపోర్ట్‌ చేస్తుండగా, మరికొందరు విశ్వక్‌సేన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ సైతం విశ్వక్‌సేన్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ సదరు టీవీ ఛానెల్‌ను వరుస ట్వీట్స్‌తో ఏకిపారేశాడు.

ఆయన ఏం అన్నారంటే.. 'ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కస్‌ ఫీట్‌లో నేను కూడా భాగమవుదామనుకుంటున్నా.విశ్వక్‌సేన్‌ను అవమానించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జర్నలిస్టుల ముసుగులో వీళ్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఛానెల్‌ కేవలం డబ్బుల కోసమే న్యూస్‌ కవర్‌ చేస్తుంది. నీచమైన రూపంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తుంది..

ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమైనా చేస్తుంది. సదరు ఛానెల్‌ న్యూస్‌ తప్పా మిగతావన్నీ కవర్‌ చేస్తారని, వాళ్లకి పెద్ద ఎత్తున ఫండ్స్‌ వస్తాయంటూ సంచలన కామెంట్స్‌ చేశాడు. అంతేకాకుండా ఈ మొత్తం ఇష్యూపై సదరు ఛానెల్‌ వాళ్లు పిలిస్తే లైవ్‌ డిబెట్‌లో పాల్గొంటా' అంటూ కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం రాహుల్‌ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement