
‘లైఫ్ అండ్ డెత్’ పరిస్థితిలో కూడా ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ నవ్వులు పూయిస్తున్నారు. వారు ముఖ్యపాత్రలుగా ‘జాతి రత్నాలు’ అనే సినిమా తెరకెక్కుతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఖైదీల వేషంలో నవీన్, ప్రియదర్శి, రాహుల్ కనిపించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నవీన్ పోలిశెట్టికి జోడీగా నటిస్తోంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 11వ తేదీన ‘జాతి రత్నాలు’ థియేటర్‌లలో విడుదల కానుంది.
మురళీ శర్మ రూ.500 కోట్ల ప్రాజెక్టుతో ఈ ముగ్గురు హీరోలకు ఉన్న సంబంధమే చిత్ర కథగా టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. అదే ఈ ముగ్గురి జీవితంలో ‘లైఫ్ అండ్ డెత్’ పరిస్థితి ఏర్పడటానికి కారణంగా కనిపిస్తోంది. ఆసక్తికరంగా, నవ్వులు పంచుతూ సాగిన ఈ టీజర్‌ను చూడండి. సినిమాటోగ్రఫీ సిద్దం మనోహర్, సంగీతం రాధన్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో వీకే నరేశ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment