
నవీన్ పొలిశెట్టి
‘‘నేను చేసే ప్రతి సినిమాలో కొత్త పాయింట్ ఉందో లేదో చూసుకుంటాను. అన్ని రకాల పాత్రలు, డిఫరెంట్ జానర్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అని నవీన్ పొలిశెట్టి అన్నారు. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. నవీన్ మాట్లాడుతూ – ‘‘‘జాతిరత్నాలు’ కథ విన్నప్పుడు ఎంజాయ్ చేశాను.
సాధారణంగా గొప్పవారిని జాతిరత్నాలు అంటారు. కానీ మా ‘జాతిరత్నాలు’ సెటైరికల్ మూవీ. మా సినిమా చూసి ప్రేక్షకులు నవ్వుకుంటూ థియేటర్ల నుంచి వస్తే నాకు అంతకు మించిన పేమెంట్ లేదు. నేను ముంబైలో ఉన్నప్పుడు నా వీడియోలు నాగీకి పంపేవాడిని. మాలాంటి కొత్తవారికి ఇలాంటి నిర్మాతలు అవకాశాలు ఇస్తే ప్రతి ఇంట్లో ఓ నవీన్ ఉంటాడు. నాకు యాక్సిడెంట్ అయ్యింది. లేకపోతే ‘జాతిరత్నాలు’ను థియేటర్‌లో పదిసార్లు చూసేవాడిని’ అని ఓ ప్రేక్షకుడు ట్వీట్ చేశాడు. అతనికి సినిమా చూపిస్తే, హిలేరియస్‌గా ఉందని చెప్పాడు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment