షార్ట్ ఫిల్మ్స్‌తో తన జర్నీ ప్రారంభించిన రాహుల్ రామకృష్ణ.. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. అయితే తాజాగా రాహుల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. తను చిన్నతనంలో అత్యాచారానికి గురైనట్టు తెలిపారు. ఆ బాధను ఎవరితో పంచుకోవాలో కూడా తెలియడం లేదన్న ఆయన.. ట్విటర్‌లో షేర్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోవడంతో ద్వారా.. తనేంటో తెలుసుకోగలనని పేర్కొన్నారు. అన్ని చాలా బాధగానే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
రాహుల్ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తెలుసుకున్న నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. రాహుల్‌కి ధైర్యం చెప్తూ పోస్టులు చేస్తున్నారు. తెరపై నవ్వులు పంచే ఓ నటుడి వెనక ఇంతా విషాద గాథ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. నటుడు ప్రియదర్శి కూడా రాహుల్‌కు ధైర్యం చెబుతూ ట్వీట్ చేశారు. ‘నేను ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు అనుభవించిన బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేను. అలాగే నేను ఏమీ చేయలేను కూడా. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలని మాత్రం చెప్పగలను. నువ్వు ప్రతి చెడు అంశం నుంచి బయటకు రావాలి.. వాటిని నీ సామర్థానికి తగ్గట్టుగా ధీటుగా ఎదుర్కొవాలి. నువ్వు ఒక ఫైటర్‌వి. లవ్ యూ బ్రదర్’ అని ప్రియదర్శి పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో తనకు మద్దుతుగా నిలిచినవారికి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ‘అన్నింటికంటే మీ మాటలు నాకు ఎంతో సాయం చేశాయి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. వారి ప్రవర్తనలో కలిగే మార్పులను నిశితంగా గమనించాలి. వారు ఎదుర్కొంటున్న భయానక సంఘటనలు గురించి బయటకు చెప్పే అంతా ధైర్యం, నైపుణ్యత వారికి ఉండకపోవచ్చు’అని వెల్లడించారు. కాగా, గతంలో కూడా పలువురు బాలీవుడ్ ప్రముఖులు తము బాల్యంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే.
I was raped during childhood.
— Rahul Ramakrishna (@eyrahul) January 20, 2020
I don’t know what else to say about my grief, except for this, because this is what I seek to know about myself.
Comments
Please login to add a commentAdd a comment