
అదంతా వట్టి జోక్, ఫూల్స్.. మంచి పారితోషికం, లగ్జరీ లైఫ్ వంటి ఎన్నో లాభాలున్న జీవితాన్ని నేనెందుకు వదిలేసుకుంటాను. నేను నిజంగానే రిటైర్మెంట్ తీసుకున్నాననుకుని నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెపుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది' అ
కమెడియన్ రాహుల్ రామకృష్ణ సినిమాల్లో మంచి కామెడీ పండిస్తాడు. జాతిరత్నాలు చిత్రంతో అతడి క్రేజ్ ఆకాశాన్నంటగా ఆ తర్వాత విడుదలైన పలు సినిమాల్లో ఈయన తళుక్కుమని మెరిశాడు. టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఫాంలోకి వచ్చిన రాహుల్ మొన్న(ఫిబ్రవరి 4) అర్ధరాత్రి సినిమాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో చాలామంది ఇది జోకా? సీరియసా? ఏదైనా వెబ్ సిరీస్ స్టంటా? అని రకరకాలుగా కామెంట్లు చేశారు. మరికొందరైతే అప్పుడే ఎందుకు సినిమాలు వదిలేస్తున్నావు రాహుల్ అంటూ విచారం వ్యక్తం చేశారు. అలా తన మాటలను నమ్మినవాళ్లను పిచ్చోళ్లను చేశాడు రాహుల్. శనివారం సాయంత్రం అదంతా అబద్ధమని వెల్లడిస్తూ మరో ట్వీట్ చేశాడు.
(చదవండి: ఇక మీదట సినిమాలు చేయను: 'జాతిరత్నాలు' ఫేం రాహుల్ రామకృష్ణ)
'అదంతా వట్టి జోక్, ఫూల్స్.. నేనెందుకు మంచి పారితోషికం, లగ్జరీ లైఫ్ వంటి ఎన్నో లాభాలున్న జీవితాన్ని వదిలేసుకుంటాను. నేను నిజంగానే రిటైర్మెంట్ తీసుకున్నాననుకుని నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెపుతుండటం ఆశ్చర్యాన్ని కలిగించింది' అని చెప్పుకొచ్చాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. 'ఆ ట్వీట్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు జోక్ ఎందుకు అనాలి?', 'ఎవరూ ఫూల్స్ కాదు.. నువ్వంత నమ్మదగినవాడివి కాదని నీ ట్వీట్ల ద్వారా నువ్వే ప్రూవ్ చేశావ్', 'కామెడీ సినిమాల్లో చేసుకో ఇక్కడ కాదు', 'ఇప్పుడిదో జోకు అంటారు.. నవ్వమంటారా అయితే!' అంటూ వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు.
It’s a joke you fools
— Rahul Ramakrishna (@eyrahul) February 5, 2022
Why would I throw away a high paying, luxury life so full of benefits? I can’t believe my friends are calling me up to congratulate me on my retirement 😆