
ప్రముఖ కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ తండ్రి అయ్యాడు. సంక్రాంతి పండుగ రోజున తన భార్య హరిత పండండి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా కొడుకు ఫొటోను షేర్ చేస్తూ ‘మగబిడ్డ.. సంక్రాంతి రిలీజ్’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ దంపతులకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గతంలో గర్ల్‌ఫ్రెండ్‌కు లిప్ కిస్ ఇస్తున్న ఫొటోను షేర్ చేస్తూ రాహుల్ పెళ్లి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి
అయితే పెళ్లి తేదీ కానీ, పెళ్లికి సంబంధించిన ముచ్చట్లను కానీ ఆ తర్వాత రాహుల్ వెల్లడించలేదు. కానీ గతేడాది నవంబర్‌లో తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పి అందరికి షాకిచ్చాడు. కాగా కమెడియన్‌గా పరిశ్రమలో రాహుల్ రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేసి ఫేమస్ అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాతో తెచ్చుకున్న గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు.
Boy.
— Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023
Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1