Rahul Ramakrishna Announced His Wife Pregnancy, Shared Tweet And Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Rahul Ramakrishna Wife Pregnant: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్‌, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’

Published Mon, Nov 7 2022 12:09 PM | Last Updated on Mon, Nov 7 2022 12:46 PM

Rahul Ramakrishna Announced He Going Father Son Shares His Wife Pregnant Pic - Sakshi

ప్రముఖ టాలీవుడ్‌ యంగ్‌ కమెడియన్‌  రాహుల్‌ రామకృష్ణ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. దీంతో నెటిజన్లు, అతడి ఫాలోవర్స్‌ షాకవుతున్నారు. అంతేకాదు అసలు పెళ్లెప్పుడు జరింగింది బ్రో? అని నటుడిని ప్రశ్నిస్తున్నారు. కాగా రీసెంట్‌గా తన కాబోయే భార్యకు లిప్‌లాక్‌ ఇస్తూ రాహుల్‌ పెళ్లి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తేదీ కానీ, పెళ్లి సంబంధించిన ముచ్చట్లను కానీ ఇప్పటి వరకు రాహుల్‌ వెల్లడించలేదు. కానీ సడెన్‌ తన భార్య ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని తాజాగా షేర్‌ చేశాడు. దీంతో ఈ విషయం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఏంటీ బ్రో పెళ్లి చేసుకున్న విషయం చెప్పనే లేదు, అసలు మీ పెళ్లి ఎప్పుడు జరిగింది’ అంటూ రాహుల్‌ పోస్ట్‌లో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత

అయితే గత నెలలో మాత్రం ‘సె హాయ్‌ టూ మై వైఫ్‌’ అంటూ భార్యతో ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. సె హాలో టూ మై లిటిల్‌ ఫ్రెండ్‌’ అంటూ తనదైన శైలిలో పోస్ట్‌ షేర్‌ చేశాడు. కాగా కమెడియన్‌గా పరిశ్రమలో రాహుల్‌ రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్‌ పాత్రలు చేస్తూ ఫేమస్‌ అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాతో తెచ్చుకున్న గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు.

చదవండి: ఉత్తరాది, దక్షిణాది చిత్రాల ఆదరణపై రకుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement