AHA Original Intinti Ramayanam Streaming Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Intinti Ramayanam: ఆహాలో ఇంటింటి రామాయణం, అప్పటినుంచే ప్రసారం

Published Mon, Nov 21 2022 7:58 PM | Last Updated on Mon, Nov 21 2022 8:22 PM

AHA Original Intinti Ramayanam Streaming From This Date - Sakshi

షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలతో తెలుగువారిని ఆకట్టుకుంటోంది ఆహా. ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఇంటింటి రామాయణం అనే చిత్రం రాబోతోంది. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్‌ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశించనున్నారు. ఈ సినిమా టీజర్‌ నవంబర్‌ 25న విడుదల చేయనున్నారు.

మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్‌) కుటుంబం ఓ సమస్యలో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. ఈ కుటుంబ కథా చిత్రం డిసెంబర్‌ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీ ఎంట్రీపై సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులున్నారు. ఎంతో గొప్ప టీం పని చేసింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా రావాలని కష్టపడ్డారు. ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించాం. అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది” అన్నారు.

చదవండి: ఆస్పత్రిలో ప్రేమదేశం హీరో అబ్బాస్‌
నీ నుంచి కంటెంటే రాదు, ఇంకా కోపం కూడానా.. యాంకర్‌ వెకిలి చేష్టలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement