
రాహుల్ రామకృష్ణ
‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ దోస్త్‌గా కనిపించి హీరో బెస్ట్ ఫ్రెండ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత ‘భరత్ అనే నేను’ ‘గీత గోవిందం’ ‘హుషారు’ సినిమాల్లో మంచి మార్కులు వేయించుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’లో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్‌కు హాయ్ చెప్పడానికి రెడీ అయ్యారు. ‘సిల్క్ రోడ్’ అనే చిత్రం ద్వారా హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు రాహుల్. ‘‘ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రదీప్ తెలుగు వాడు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment