Samuthirakani speech at Vimanam movie success meet - Sakshi
Sakshi News home page

మంచి సినిమాకి ఆదరణ ఉంటుంది

Published Sun, Jun 11 2023 6:29 AM | Last Updated on Sun, Jun 11 2023 10:44 AM

Samuthirakani talks about Vimanam Movie Success Meet - Sakshi

‘‘డైరెక్టర్‌ శివ ప్రసాద్‌గారు తొలి సినిమా ‘విమానం’తో మంచి హిట్‌ అందుకున్నందుకు అభినందనలు. మంచి సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుందనే  విషయాన్ని ‘విమానం’ మరోసారి నిరూపించింది’’ అని నటుడు, దర్శకుడు సముద్ర ఖని అన్నారు. శివప్రసాద్‌ యానాల దర్శకత్వంలో సముద్ర ఖని, మాస్టర్‌ ధ్రువన్, అనసూయ, రాహుల్‌ రామకృష్ణ, ధనరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్‌ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.

ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో కిరణ్‌ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘విమానం’ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే కొత్త దర్శకులకు ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది’’ అన్నారు. ‘‘విమానం’ చిత్రం చూశాక  ‘మా నాన్న గుర్తుకొచ్చాడు’ అంటూ మా నాన్న, అమ్మ చెప్పడంతో చాలా ఆనందం వేసింది’’ అన్నారు శివప్రసాద్‌ యానాల. నటుడు ధనరాజ్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్, రైటర్‌ హను, సినిమాటోగ్రాఫర్‌ వివేక్, అనసూయ భరద్వాజ్, మాస్టర్‌ ధ్రువన్‌ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement