అర్జున్‌ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్‌ చాయిస్‌ నేను కాదు, ఆ కమెడియన్‌: రాహుల్‌ రామ్‌కృష్ణ | Actor Rahul Ramakrishna Said He Is Not First Choice For Arjun Reddy Movie | Sakshi
Sakshi News home page

Rahul Ramakrishna: అర్జున్‌ రెడ్డిలో శివ పాత్రకు ఫస్ట్‌ చాయిస్‌ నేను కాదు, ఆ కమెడియన్‌: రాహుల్‌ రామ్‌కృష్ణ

Published Mon, Nov 21 2022 4:49 PM | Last Updated on Mon, Nov 21 2022 5:03 PM

Actor Rahul Ramakrishna Said He Is Not First Choice For Arjun Reddy Movie - Sakshi

రాహుల్‌ రామకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్‌ పాత్రలు చేస్తూ ఫేమస్‌ అయ్యాడు. అర్జున్‌రెడ్డి, జాతిరత్నాలు చిత్రాలతో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు రాహుల్‌.

చదవండి: జబర్దస్త్‌ ‘పంచ్‌’ ప్రసాద్‌ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారంటే?

ఈ గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ టాక్‌లో షో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ మేరకు రాహుల్ రామక్రష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టిపెరిగిందంతా హిమాయత్ నగర్‌లోనే. మా ఫ్యామిలీలో ఎవరికీ సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. నేను, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అందరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం. పెళ్లి చూపులు సినిమాకి ముందు మేమంత  సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాం.

చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్‌మెంట్స్‌ చూస్తే షాకవ్వాల్సిందే

అదే సమయంలో తరుణ్ భాస్కర్ ‘పెళ్లి చూపులు’ చేసే అవకాశం వచ్చింది. అందులో విజయ్‌ హీరోగా ముందు అనుకున్నాడు. ఇక అతడి ఫ్రెండ్‌ రోల్‌కు అప్పటికే తరుణ్‌ ప్రియదర్శికి ఛాన్స్ ఇచ్చాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనుకున్నాడు. ఆయనకి నన్ను పరిచయం చేసింది విజయ్ దేవరకొండనే. అలా ఆ సినిమాలో ‘శివ’ పాత్ర చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అర్జున్‌ రెడ్డిలో నా పాత్రకి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఒక విషయం తెలిసింది. మొదట ఈ సినిమాలో నా పాత్రకు ఫస్ట్‌ చాయిస్‌ నేను కాదని, ప్రియదర్శిని అనుకున్నారని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement