Actor Sriram Superb Speech At Y Movie Trailer Launch, Watch Video - Sakshi
Sakshi News home page

ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. ఏమేమో జరిగిపోయింది

Published Thu, Apr 1 2021 7:23 PM | Last Updated on Thu, Apr 1 2021 8:09 PM

Actor Sriram At Y Movie Trailer Launch  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రోజూపూలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో శ్రీరామ్‌. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆయన చాలా కాలం తర్వాత నటిస్తున్న చిత్రం ‘వై’. ఏప్రిల్‌2 ఈ సినిమా ఓటీటీలో రిలీజ్‌ కానుంది. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్‌ మాట్లాడుతూ..‘నేను రోజా పూలు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాను. దాదాపు 20 ఏళ్లు కావొస్తుంది. మళ్లీ ఇన్ని రోజుల తరువాత ఇలాంటి వేదిక దొరికింది.

నా జీవితంలోనే అతి తక్కువ సమయంలో చేసిన సినిమా ఇదే. రాహుల్ రామకృష్ణతో చేసిన ఆ సీన్‌లో ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. ఏమేమో జరిగిపోయింది. పీకలదాక విస్కీ తాగించి మా డైరెక్టర్ ఏదేదో చేయించాడు. ఆయన ఓ టాస్క్‌ మాస్టర్‌. ఏమాత్రం హద్దు దాటకుండా చాలా నీట్‌గా తీసిన చిత్రమిది. ఇలాంటి సినిమాలో పనిచేయడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు. బాలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ రామకృష్ణ  ప్రధానపాత్ర పోషించారు. 

చదవండి : రష్మిక..కొంచెం ఓవరాక్షన్‌ తగ్గించుకుంటే మంచిది'
సారంగదరియా.. స్పీడు మామూలుగా లేదయా..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement