hero sriram
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హారర్ మూవీ
ఆ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా భయపెట్టిన చిత్రం మసూద. ఇటీవలి కాలంలో అదే స్థాయిలో భయపెడుతూ ఓ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అదే పిండం. సినిమా పేరుకు తగ్గట్లే కథ కూడా విభిన్నంగా ఉంటుంది. హీరో శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. నెలన్నర రోజులకు ఓటీటీలో ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరి రావు, రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించగా యశ్వంత్ దగ్గుమాటి నిర్మించాడు. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో పిండం అందుబాటులోకి వచ్చేసింది. సడన్‌గా స్ట్రీమింగ్ ముందస్తు సమాచారం లేకుండానే ప్రైమ్ వీడియోలో గురువారం (ఫిబ్రవరి 1) అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది రిలీజైన వాటిలో బెస్ట్ హారర్ ఫిలిం ఇదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రకథ జరుగుతుంది. మరి ఈ హారర్ చిత్రం ఎలా ఉందో తెలియాలంటే ప్రైమ్‌లో చూసేయండి.. It's ShowTime #Pindam @PrimeVideoIN pic.twitter.com/riDgCpASEU — Arbaz Hashmi Review (@mad4movie_yt) February 2, 2024 చదవండి: అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఇప్పుడు వయసు దాటిపోయింది -
తెలుగులో భయంకరమైన హారర్ సినిమా అదే: హీరో శ్రీరామ్
‘‘హారర్ సినిమాల విషయంలో నాకు ఓ భయం ఉంటుంది. పేరుకి హారర్ సినిమా అంటారు కానీ అందులో అనవసరమైన కామెడీ, రొమాన్స్, సాంగ్స్‌ను ఇరికిస్తుంటారు. హారర్ అంటే థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి. సాయికిరణ్ దైదా ‘పిండం’ మూవీ కథ చెప్పినప్పుడు ప్రేక్షకులు ఉలిక్కి పడతారనిపించింది’’ అని హీరో శ్రీరామ్ అన్నారు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పిండం’. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరామ్ చెప్పిన విశేషాలు. ► నేను నటించిన తొలి తెలుగు చిత్రం ‘ఒకరికి ఒకరు’ రిలీజై 20 ఏళ్లయింది. ఇన్నేళ్లయినా అలాగే ఉన్నారు. ఆరోగ్య రహస్యం ఏంటి? అని అడుగుతుంటారు. ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా ఇంటి భోజనం తింటాను. బయటకు వెళ్లినా ఎక్కువగా పప్పు, సాంబారు వంటి ఆహారమే తీసుకుంటాను. ఉన్న దాంతో సంతృప్తి చెంది ఆనందంగా ఉంటాను. ► సాయి కిరణ్ దైదా తీసిన ‘స్మోక్’ అనే షార్ట్ ఫిలిం చూసి తన ప్రతిభపై నమ్మకం కలిగింది. చెప్పిన బడ్జెట్ ప్రకారం టైమ్‌కి ‘పిండం’ పూర్తి చేశారు. యశ్వంత్ ఈ కథను నమ్మి సినిమా నిర్మించారు. ఇది థియేటర్లో చూసి అనుభూతి చెందాల్సిన హారర్ సినిమా. 1930, 1990, ప్రస్తుతం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రకథ జరుగుతుంది. ► నా దృష్టిలో ఇప్పటిదాకా తెలుగులో భయంకరమైన హారర్ సినిమా అంటే రామ్‌గోపాల్ వర్మగారు తీసిన ‘రాత్రి’. ఆ మూవీని చాలాసార్లు చూశాను. ‘పిండం’ అనేది కేవలం హారర్ సినిమా కాదు... ఇందులోని బలమైన కథ, భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ► నేను చేసిన ‘రెక్కీ’ వెబ్ సిరీస్ సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం ఓటీటీ కోసం ‘నెట్ వర్క్, హరికథ’ అనే ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. నేను, జీవీ ప్రకాశ్ తమిళ్లో ‘బ్లాక్ మెయిల్’ అనే మూవీ చేస్తున్నాం. అలాగే ‘సంభవం’ చిత్రం చేస్తున్నా. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాను. చదవండి: హీరోలనే ఎక్కువ మోస్తున్నారు.. హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలి? -
భూమికను చంపేయాలన్నంత కోపం వచ్చింది: హీరో శ్రీరామ్
శ్రీరామ్.. ఈయన అసలు పేరు శ్రీకాంత్. కానీ తెలుగులో ఈ పేరుతో ఇదివరకే ఓ నటుడు ఉండటంతో శ్రీరామ్‌గా వెండితెరపై అడుగుపెట్టాడు. తండ్రి బ్యాంకు ఉద్యోగి. తల్లి కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తండ్రి మొదట్లో నాటకాలు వేసి కళాకారుడిగా గుర్తింపు పొందాడు. అలా చిన్నతనంలోనే శ్రీరామ్‌కు నటన మీద ఆసక్తి ఏర్పడింది. మొదట్లో నాటకాలు వేసిన ఇతడికి కెరీర్ ప్రారంభంలో సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. హీరోగా ఛాన్సులిస్తామన్నవాళ్లు చివర్లో ఇతడిని తీసేసి వేరేవాళ్లతో షూటింగ్ మొదలుపెట్టేవాళ్లు. తెలుగులో ఎంట్రీ అలా వరుస షాకుల అనంతరం రోజా కూటం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఒకరికి ఒకరు మూవీతో తెలుగు వారికీ దగ్గరయ్యాడు. తమిళంలో హీరోగా కొనసాగిన ఇతడు తెలుగులో మాత్రం సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ పరిస్థితిలో లేను.. అందుకే! 'నేను ఒకరికి ఒకరు, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి.. రెండు సినిమాలకు ఒకేసారి సంతకం చేశాను. రెండు సినిమాలు ప్రకటించారు. అయితే అప్పుడు నేను ఆస్పత్రిపాలై ఉన్నాను. ఫైట్స్ చేసే పరిస్థితిలో లేను. నా కోసం పోరాట సన్నివేశాలను తగ్గించడం అస్సలు కరెక్ట్ కాదు. అలా నేను నటించి సినిమాకు న్యాయం చేయలేను అనే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాను. పారిపోయింది.. అందుకే హీరోయిన్ భూమికతో గొడవలు కూడా జరిగాయి. సగం పాట అయిపోయాక సెట్ నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఓ రోజు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినప్పుడు షూటింగ్ ఎలా జరిగింది? అని అడిగింది. కత్తి తీసుకుని అక్కడే పొడిచేయాలనిపించింది. ఈ మధ్యే మేమిద్దరం మాట్లాడుకున్నాం.. అప్పటి సంఘటన తలుచుకుని నవ్వుకున్నాం. ఇప్పుడంటే నవ్వుకుంటున్నాం కానీ ఆ రోజు మాత్రం చాలా కోపమొచ్చింది' అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్. చదవండి: లగ్జరీ లైఫ్ వదిలి ఇండియాకు.. హీరోగా సూపర్ సక్సెస్.. కానీ.. -
సైకాలాజికల్ థ్రిల్లర్‌గా హీరో శ్రీరామ్ కొత్త సినిమా
హీరో శ్రీరామ్ కొత్త సినిమా ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ రవికిరణ్ గాడలే దర్శకత్వంలో ప్రోడక్షన్ నెం.1గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయ్, డాక్టర్ శ్రీధర్‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ సుధీర్ వర్మ క్లాప్ కొట్టగా.. జార్జీరెడ్డి హీరో సందీప్ మాధవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. అనంతరం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. చిత్ర దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గాడలె మాట్లాడుతూ... ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. పోస్ట్ ట్రూమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనే కాన్సెప్ట్‌తో సైకాలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోంది. వచ్చే ఏడాది జనవరి 2, 2023 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతందని నమ్ముతున్నాను. డైరెక్టర్ డా. రవికిరణ్ తీసిన ఇండిపెండెంట్ చిత్రం ‘థ రాంగ్ స్వైప్’ చాలా బాగుంది. అలాగే ఈ చిత్ర కథ విని వెంటనే చెన్నయ్ పిలిచి కథను ఒకే చేశాను. యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని చెప్పాడు. -
షూటింగ్లో ప్రమాదం.. శరీరమంతా కాలిపోయింది : హీరో శ్రీరామ్
Hero Sriram Shares His Fire Accident In Shooting: రోజాపూలు సినిమాతో కెరీర్ ప్రారంభించిన హీరో శ్రీరామ్ తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మాత్రం ఆశించినంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. దీంతో సరైన హిట్స్ లేక సైడ్ క్యారెక్టర్లు సైతం చేశాడు. ఆ క్రమంలోనే ఆయన నటించిన ఆడవారు మాటలకు అర్థాలే వేరులో, స్నేహితుడు సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ఓ షోకి హాజరైన శ్రీరామ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఓ సినిమా షూటింగ్ టైంలో ఆర్ట్ అసిస్టెంట్‌కి తెలియకుండా ఎక్కువ రబ్బర్ పోసేసాడు. దీని వల్ల పెద్ద ఫైర్ జరిగింది. ఈ ప్రమాదంలో షర్ట్‌తో సహా శరీరం ఊడిపోయి వచ్చింది చెవులు, జుట్టు ఉండేది కాదు. అలా కాలిపోయి హాస్పిటల్లో కదల్లేని స్థితిలో ఉండేవాడిని అంటూ ఎమోషనల్ అయ్యాడు. -
'పీకలదాక విస్కీ తాగించి మా డైరెక్టర్ ఏదేదో చేయించాడు'
సాక్షి, హైదరాబాద్ : రోజూపూలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో శ్రీరామ్. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆయన చాలా కాలం తర్వాత నటిస్తున్న చిత్రం ‘వై’. ఏప్రిల్2 ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ..‘నేను రోజా పూలు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాను. దాదాపు 20 ఏళ్లు కావొస్తుంది. మళ్లీ ఇన్ని రోజుల తరువాత ఇలాంటి వేదిక దొరికింది. నా జీవితంలోనే అతి తక్కువ సమయంలో చేసిన సినిమా ఇదే. రాహుల్ రామకృష్ణతో చేసిన ఆ సీన్లో ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది. ఏమేమో జరిగిపోయింది. పీకలదాక విస్కీ తాగించి మా డైరెక్టర్ ఏదేదో చేయించాడు. ఆయన ఓ టాస్క్ మాస్టర్. ఏమాత్రం హద్దు దాటకుండా చాలా నీట్‌గా తీసిన చిత్రమిది. ఇలాంటి సినిమాలో పనిచేయడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు. బాలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ ప్రధానపాత్ర పోషించారు. చదవండి : రష్మిక..కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది' సారంగదరియా.. స్పీడు మామూలుగా లేదయా.. -
శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
తిరుమల: తిరుమల వెంకటేశ్వరస్వామిని సోమవారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో శ్రీరామ్ తన కుటుంబ సభ్యులతో కలసి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సినీయర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: ఏడుకొండల వాడి దివ్య దర్శనానికి సోమవారం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వైఎస్సీర్సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు, టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామాహేశ్వర్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి వారు స్వామిని దర్శించుకున్నారు. ఒకరికి ఒకరు సినిమా ఫేం హీరో శ్రీరామ్ దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.