సైకాలాజికల్ థ్రిల్లర్‌గా హీరో శ్రీరామ్‌ కొత్త సిని​మా | Hero Sriram New Movie Production No 1 Launched in Hyderabad | Sakshi
Sakshi News home page

Hero Sriram: సైకాలాజికల్ థ్రిల్లర్‌ హీరో శ్రీరామ్‌ కొత్త సిని​మా

Published Sun, Dec 18 2022 6:11 PM | Last Updated on Sun, Dec 18 2022 6:49 PM

Hero Sriram New Movie Production No 1 Launched in Hyderabad - Sakshi

హీరో శ్రీరామ్‌ కొత్త సినిమా ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్‌ రవికిరణ్‌ గాడలే దర్శకత్వంలో ప్రోడక్షన్‌ నెం.1గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డాక్టర్‌ ఉదయ్‌ కె. రెడ్డి పాల్వాయ్‌, డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హ్రితిక శ్రీనివాస్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి  డైరెక్టర్ సుధీర్ వర్మ  క్లాప్ కొట్టగా.. జార్జీరెడ్డి హీరో సందీప్ మాధవ్  కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. అనంతరం మూవీ యూనిట్‌ మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

చిత్ర  దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గాడలె మాట్లాడుతూ... ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. పోస్ట్ ట్రూమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనే కాన్సెప్ట్‌తో సైకాలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోంది. వచ్చే ఏడాది జనవరి 2, 2023 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతందని నమ్ముతున్నాను. డైరెక్టర్ డా. రవికిరణ్ తీసిన ఇండిపెండెంట్ చిత్రం ‘థ రాంగ్ స్వైప్’ చాలా బాగుంది. అలాగే ఈ చిత్ర కథ విని వెంటనే చెన్నయ్ పిలిచి కథను ఒకే చేశాను. యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement