Ramanaidu Studios
-
హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కూతురు పెళ్లికి రెడీ అయింది. గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ శుభకార్యానికి వేదిక కానుంది. గతంలో ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా జరిగినట్లే.. ఇప్పుడు పెళ్లిని కూడా దగ్గుబాటి ఫ్యామిలీ.. అలానే ఆర్భాటాలు లేకుండా చేయబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: శ్రీకాంత్ మేనకోడలితో గోపీచంద్ పెళ్లి.. ఎవరు సెట్ చేశారో తెలుసా?) వెంకటేశ్-నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకకు మెగాహీరో రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు. వెంకటేశ్ రెండో అమ్మాయి పేరు హయవాహినికి.. గతేడాది అక్టోబరులో విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. చాలా సింపుల్‌గా జరిగిన ఈ వేడుకకు మహేశ్, చిరంజీవి హాజరయ్యారు. ఇప్పుడు వెంకటేశ్ రెండో కూతురు హయవాహిని పెళ్లికి టైమ్, డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 15న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో.. ఈ వివాహానికి వేదిక కానుంది. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఫొటోలు వచ్చే దానిబట్టి.. మనకు ఈ విషయమై క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: ఆ నటితో నాకు సంతోషం లేదు.. అందుకే రెండో పెళ్లి!) -
రామానాయుడు స్టూడియోలో కార్ రేసింగ్.. సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
-
సైకాలాజికల్ థ్రిల్లర్‌గా హీరో శ్రీరామ్ కొత్త సినిమా
హీరో శ్రీరామ్ కొత్త సినిమా ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ రవికిరణ్ గాడలే దర్శకత్వంలో ప్రోడక్షన్ నెం.1గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయ్, డాక్టర్ శ్రీధర్‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ హైదరాబాద్‌లో రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ సుధీర్ వర్మ క్లాప్ కొట్టగా.. జార్జీరెడ్డి హీరో సందీప్ మాధవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. అనంతరం మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. చిత్ర దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గాడలె మాట్లాడుతూ... ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. పోస్ట్ ట్రూమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అనే కాన్సెప్ట్‌తో సైకాలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతోంది. వచ్చే ఏడాది జనవరి 2, 2023 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతందని నమ్ముతున్నాను. డైరెక్టర్ డా. రవికిరణ్ తీసిన ఇండిపెండెంట్ చిత్రం ‘థ రాంగ్ స్వైప్’ చాలా బాగుంది. అలాగే ఈ చిత్ర కథ విని వెంటనే చెన్నయ్ పిలిచి కథను ఒకే చేశాను. యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని చెప్పాడు. -
ఒకే చోట ఉన్నా ఒకరినొకరు చూసుకోని చై సామ్?!
నాగచైతన్య-సమంత.. టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ జంటగా వెలుగొందారు. ఈ ఇద్దరూ బయటకు వచ్చారంటే కెమెరాలన్నీ వారినే ఫోకస్ చేసేవి. సోషల్ మీడియాలోనూ వారి ఫొటోలు వైరల్‌గా మారేవి. కానీ అనూహ్యంగా ఈ దంపతులిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అభిమానులతో పాటు సినీతారలు సైతం షాకయ్యారు. ఇకపోతే ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో పనిచేసేవారే కాబట్టి ఎప్పుడో ఒకసారి ఎదురుపడక తప్పదు. అలాంటప్పుడు స్నేహితులుగా మాట్లాడుకుంటారా? లేదా ముఖం తిప్పుకుని వెళ్లిపోతారా? అన్నది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. అన్నట్లుగానే ఇటీవల వీరిద్దరూ ఒకేచోట దర్శనమిచ్చారు. నాగచైతన్య 'బంగార్రాజు' ఆఖరి షెడ్యూల్, సమంత 'యశోద' చివరి షెడ్యూల్.. రెండూ రామానాయుడు స్టూడియోలో ఒకేరోజు జరిగాయి. దీంతో చై సామ్.. ఇద్దరం ఒకరికొకరు ఎదురుపడకుండా జాగ్రత్తపడాలని సిబ్బందికి తెలియజేశారట. వారి ఆదేశంతో సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించడంతో చై, సామ్ ఇద్దరూ షూటింగ్ పూర్తి చేసుకుని ఒకరికొకరు తారసపడకుండానే స్టూడియో నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం 'బంగార్రాజు', 'థాంక్యూ' సినిమాలు చేస్తున్నాడు. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ఓటీటీ వెబ్‌సిరీస్‌లో నటించనున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌తో చైతూ డిజిటల్లో అడుగుపెట్టబోతున్నాడు. మరోవైపు సమంత చేతిలో 'శాకుంతలం', 'యశోద', 'కాతువాకుల రెండు కాదల్', 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' ప్రాజెక్టులు ఉన్నాయి. వరుణ్ ధావన్‌తో ఓ వెబ్ సిరీస్ కూడా చేయనుందని టాక్ వినిపిస్తోంది. -
వెంకటేశ్ కోసం అభిమాని 140 కి.మీ పాదయాత్ర
ఆ మధ్య మెగా హీరో వరుణ్ తేజ్ కోసం ఓ అభిమాని తన స్వస్థలమైన బిక్కనూర్ నుంచి హైదరాబాద్‌కు నడుచుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అతడి గురించి తెలుసుకున్న వరుణ్ తన బిజీ షెడ్యూల్‌కు కాసేపు విరామం చెప్పి అభిమానిని దగ్గరకు తీసుకున్నాడు. అతడితో కబుర్లు చెప్పి ఫొటోలు సైతం దిగాడు. ఈ ఘటన మరువకముందే తాజాగా మరో అభిమాని దగ్గుబాటి హీరో వెంకటేశ్‌ను కలిసేందుకు పాద యాత్ర చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూర్లోని బుద్ధారాం గ్రామానికి చెందిన శ్రీనివాస్ హీరో వెంకీకి వీరాభిమాని. ఆయనన్నా, ఆయన సినిమాలన్నా ఎంతో పిచ్చి. ఎలాగైనా ఆయనను కలవాలన్న తపనతో 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రామానాయుడు స్టూడియోకు చేరుకున్నాడు. కానీ ఆయన నారప్ప కోసం వేరే లొకేషన్లో ఉండటంతో కలవలేకపోయాడు. వెంకటేశ్ అభిమాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. "ఏడేళ్ల వయసులో జనం మనదేరా సినిమా చూశాను. అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిగా మారిపోయా. ఆ సినిమాను 30 సార్లు చూశాను. ప్రతి ఏడాది వెంకటేశ్ పుట్టిన రోజును కూడా గ్రాండ్‌గా చేస్తాను. ఇప్పటికే రెండు, మూడు సార్లు వచ్చాను, కానీ కలవలేకపోయాను. అందుకే ఈసారి పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను. కానీ ఆయన నారప్ప షూటింగ్లో ఉండటంతో కలవలేకపోయాను. కాకపోతే ఆయన తిరిగొచ్చాక ఫోన్ చేసి చెప్తామని, అప్పుడు కలవొచ్చని చెప్పారు అని పేర్కొన్నాడు. వారి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటానంటున్నాడు శ్రీనివాస్. (చదవండి: బాక్సాఫీస్ వార్: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ) కాగా ఈ దగ్గుబాటి హీరో ప్రస్తుతం ప్రియమణితో కలిసి నారప్పలో కనిపించనున్న విషయం తెలిసిందే. అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 14న విడుదల కానుంది. కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. (చదవండి: ఆమె డీఎన్ఏలోనే విషం ఉండొచ్చు: తాప్సీ) -
ముహూర్తం ఎప్పుడు?
‘బ్యాచిలర్ లైఫ్‌కి టాటా. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను’ అని ఇటీవలే ప్రకటించారు రానా. మోడల్ మిహికా బజాజ్‌తో ప్రేమలో ఉన్నారు రానా. పెళ్లికి మిహికా ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రానా. తాజాగా ఇరు కుటుంబాలు బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నాయని సమాచారం. నిశ్చితార్థం ముహూర్తం, పెళ్లి ముహూర్తం గురించి చర్చించుకున్నట్టు్ట తెలిసింది. రానా, మిహికాల వివాహం డిసెంబర్లో ఉంటుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
రవితేజా హీరోగా సినిమా షూటింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ గురువారం రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. రవితేజ నటిస్తున్న ఈ సినిమాలోని సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు క్లాప్ కొట్టారు. సినీ సంభాషణల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేశారు. అలాగే తొలిషాట్‌కు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కాళహస్తి చిత్రం ద్వారా గంటా రవితేజ తెరంగేట్రం చేస్తున్నారు. -
రామానాయుడు స్టూడియోలో భారీ చోరీ
హైదరాబాద్: హైదరాబాద్ ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోలో ఖరీదైన సెట్టింగ్ లైట్లు చోరీకి గురయ్యాయి. స్టూడియోలో సినిమా షూటింగ్ కోసం వినియోగించే ఈ లైట్లు కొద్ది రోజులుగా కనబడటం లేదు. నిర్వాహకులు ఆరా తీయగా చోరీకి గురైనట్లు తెలిసింది. దీంతో వారు స్టూడియో మేనేజర్ శ్రీనుతో పాటు మరో పదిమందిపై అనుమానం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనుతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చోరీ అయిన లైట్ల విలువ భారీగా ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిర్వాహకులు తెలిపారు. -
నగర చిత్రపటంపై చెరగని ముద్ర
ప్రముఖ నిర్మాత డి.రామానాయుడికీ, హైదరాబాద్ నగరానికీ బలమైన అనుబంధం ఉంది. సినిమా కెరీర్ ప్రథమార్ధమంతా మద్రాసులో, ద్వితీయార్ధమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. తెలుగు సినిమా రంగం మద్రాసు నుంచి హైదరాబాద్‌కు పూర్తిగా మారాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మార్పును వేగవంతం చేసిన వారిలో రామానాయుడు ఒకరు. జూబ్లీహిల్స్‌లో ఆయన నిర్మించిన రామానాయుడు స్టూడియో ఇవాళ తెలుగు చిత్ర నిర్మాణానికి ఒక ల్యాండ్‌మార్క్. ఆ తరువాత హైదరాబాద్ శివార్లలో నానక్‌రామ్‌గూడ దగ్గర ‘రామానాయుడు సినీ విలేజ్’తో స్టూడియోను విస్తరించారు. ..:: రెంటాల జయదేవ జూబ్లీహిల్స్‌లో స్టూడియో నిర్మాణానికి ఆయన నడుంకట్టిన తొలిరోజుల్లో జూబ్లీహిల్స్‌లోని ఆ స్థలం కొండలు, గుట్టలతో జనావాసాలకు దూరంగా ఉండేది. ఆ సంగతులను ఆయనే ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ.. ‘భవనం వెంట్రామిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు స్టూడియోల నిర్మాణానికి పద్మాలయా వారికీ (హీరో కృష్ణ), నాకూ స్థలం కేటాయించారు. రెండు పెద్ద రాళ్ళ గుట్టలు ఇచ్చేసి, స్టూడియో కట్టమంటారేమిటని నవ్వుకున్నారు అందరూ’ అని రామానాయుడు అనేవారు. అయితే, మట్టిని బంగారంగా మార్చిన హైదరాబాద్‌లోని స్టూడియో అంటేనే రామానాయుడుకు ప్రత్యేక అభిమానం. భవిష్యత్‌ను ఊహించి... ఇవాళ సినిమా వాళ్ళందరికీ చిరునామాగా మారిన ఫిల్మ్‌నగర్ కూడా రామానాయుడు హస్తవాసితో అభివృద్ధి అయ్యిందే. హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ పెట్టి, ఇళ్ళస్థలాలు ఇచ్చినా 1980లలో బతిమలాడినా ఎవరూ సభ్యత్వం తీసుకొనేవారు కాదు. ఆ సమయంలో సీనియర్ నిర్మాత డి.వి.ఎస్. రాజు సలహా మేరకు రామానాయుడు తన పేరుపై, తన పిల్లలు సురేష్‌బాబు, వెంకటేశ్ పేర్లపై మూడు సభ్యత్వాలు తీసుకున్నారు. అప్పట్లో అక్కడ ‘ప్రతాప్ ఆర్ట్స్’ రాఘవలాంటి ఒకరిద్దరి ఇళ్ళే ఉండేవి. తరువాత అక్కడ ఇల్లు కట్టింది రామానాయుడే. అక్కడే సురేష్‌బాబు స్థలంలో ‘సురేష్ గెస్ట్‌హౌస్’ నిర్మించారు. హైదరాబాద్‌లో తాను నిర్మిస్తున్న తెలుగు, హిందీ సినిమాలకు మద్రాసు, బొంబాయి నుంచి వచ్చే నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆ గెస్ట్‌హౌస్‌లోనే విడిది అని షరతు పెట్టారు. లక్షల రూపాయల స్టార్‌హోటళ్ళ ఖర్చును ఆదా చేసి, నిర్మాణ వ్యయాన్ని నియంత్రణలో ఉంచి, సిసలైన నిర్మాత అనిపించుకున్నారు. అనిల్‌కపూర్, రేఖ, మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్, టబు, దివ్యభారతి లాంటి అప్పటి టాప్ స్టార్లంతా ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో బిజీ కూడలిగా మారిన ఆ గెస్ట్‌హౌస్‌లో ఉన్నవారే! రాళ్లల్లో.. గుట్టల్లో... రామానాయుడు స్టూడియో నిర్మాణం కాక ముందే అక్కడ చిత్ర నిర్మాణం మొదలైంది. వెంకటేశ్ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించిన ‘బ్రహ్మపుత్రుడు’ (1988) చిత్రాన్ని నిర్మిస్తూ, జూబ్లీహిల్స్‌లోని స్టూడియో స్థలంలో రాళ్ళగుట్ట మీద పెద్ద కాలనీ సెట్ వేయించారు రామానాయుడు. ఆ స్టూడియో స్థలంలో జరిగిన తొలి షూటింగ్ అదే. ఆ సినిమా తెచ్చిన లాభాలు, ఆ తరువాత వచ్చిన హిట్లే ఆ రాళ్ళ గుట్టలో సుందరమైన స్టూడియో వెలిసేందుకు దోహదపడ్డాయని రామానాయుడు చెబుతుండేవారు. 1990ల దశకంలో సూపర్హిట్ల ద్వారా సంపాదించిన సొమ్మంతా స్టూడియో నిర్మాణానికే వెచ్చించారాయన. ల్యాబ్, రికార్డింగ్ థియేటర్, డబ్బింగ్, ప్రివ్యూ థియేటర్ల లాంటి సమస్త సదుపాయాలతో తన కలల సౌధం నిర్మించారు. మునుపటి రాళ్ళగుట్టతో ఆ స్టూడియోను పోల్చి చూసినప్పుడల్లా తన మనసు సంతోషంతో నిండిపోతుందని రామానాయుడు ఎప్పుడూ చెబుతుండేవారు. స్టూడియో మీద, ఆ పరిసరాల మీద ఆయనకు ఎంత ప్రేమంటే... ప్రతిరోజూ ఆయన స్టూడియోకు వెళ్లి ఆ పరిసరాలను కళ్ళారా చూడాల్సిందే, స్టూడియో వ్యవహారాలు కనుక్కోవాల్సిందే! చివరకు క్యాన్సర్‌తో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నా సాయంత్రం కాసేపు స్టూడియోకు వచ్చి వెళ్ళేవారంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు పూర్తిగా షిఫ్టయ్యే సమయానికి రామానాయుడు స్టూడియో, నానక్‌రామ్ గూడ సినీ విలేజ్‌లతో నగర చిత్రపటంపై సినిమా రంగ ప్రాథమిక వసతులను స్థిరీకరించిన దార్శనికుడిగా రామానాయుడు నిలిచిపోతారు. -
పాత్ర కోసం ఎనిమిదిన్నర కేజీలు తగ్గిన బాలయ్య
బాలకృష్ణ లాంటి అనూహ్యమైన మాస్ ఇమేజ్ ఉన్న కథానాయకునితో తెలుగునేలపై అవుడ్డోర్ షూటింగ్ అంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. పైగా... వైజాగ్ లాంటి మహానగరంలో వేలాది జనాల సాక్షిగా అంటే... ఇక చెప్పేదేముంది? అలాంటి సాహసానికే పూనుకున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకునిగా రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ను 45 రోజుల పాటు వైజాగ్‌లో జరుపనున్నారాయన. అక్కడ పది రోజుల పాటు విశాఖ నగర ప్రధాన వీధుల్లో బాలకృష్ణపై పోరాట సన్నివేశాలు, కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు బోయపాటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోటి రూపాయల భారీ సెట్లో బాలకృష్ణ, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ ముగియనుంది. తదనంతరం ఈ నెల 23 నుంచి వైజాగ్ షెడ్యూల్ మొదలవుతుంది. ఇదిలావుంటే... ఈ సినిమాలో బాలకృష్ణ రెండు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఓ గెటప్ కోసం తయారు చేసిన విగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. పైగా ఈ గెటప్ కోసం బాలయ్య ఎనిమిదిన్నర కేజీలు బరువు తగ్గినట్లు తెలిసింది. ఫిఫ్టీ ప్లస్‌లో బరువు తగ్గడం అంటే... నిజంగా సాహసమే. ‘సింహా’ని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుందని, శక్తిమంతమైన కథాంశంతో బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని యూనిట్ వర్గాల భోగట్టా. అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులందరినీ అలరించే రీతిలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న ఈ చిత్రంలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు.