
నాగచైతన్య-సమంత.. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ జంటగా వెలుగొందారు. ఈ ఇద్దరూ బయటకు వచ్చారంటే కెమెరాలన్నీ వారినే ఫోకస్ చేసేవి. సోషల్ మీడియాలోనూ వారి ఫొటోలు వైరల్‌గా మారేవి. కానీ అనూహ్యంగా ఈ దంపతులిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అభిమానులతో పాటు సినీతారలు సైతం షాకయ్యారు. ఇకపోతే ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో పనిచేసేవారే కాబట్టి ఎప్పుడో ఒకసారి ఎదురుపడక తప్పదు. అలాంటప్పుడు స్నేహితులుగా మాట్లాడుకుంటారా? లేదా ముఖం తిప్పుకుని వెళ్లిపోతారా? అన్నది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. అన్నట్లుగానే ఇటీవల వీరిద్దరూ ఒకేచోట దర్శనమిచ్చారు.
నాగచైతన్య 'బంగార్రాజు' ఆఖరి షెడ్యూల్, సమంత 'యశోద' చివరి షెడ్యూల్.. రెండూ రామానాయుడు స్టూడియోలో ఒకేరోజు జరిగాయి. దీంతో చై సామ్.. ఇద్దరం ఒకరికొకరు ఎదురుపడకుండా జాగ్రత్తపడాలని సిబ్బందికి తెలియజేశారట. వారి ఆదేశంతో సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించడంతో చై, సామ్ ఇద్దరూ షూటింగ్ పూర్తి చేసుకుని ఒకరికొకరు తారసపడకుండానే స్టూడియో నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం 'బంగార్రాజు', 'థాంక్యూ' సినిమాలు చేస్తున్నాడు. త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోని ఓటీటీ వెబ్‌సిరీస్‌లో నటించనున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌తో చైతూ డిజిటల్‌లో అడుగుపెట్టబోతున్నాడు. మరోవైపు సమంత చేతిలో 'శాకుంతలం', 'యశోద', 'కాతువాకుల రెండు కాదల్', 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' ప్రాజెక్టులు ఉన్నాయి. వరుణ్ ధావన్‌తో ఓ వెబ్ సిరీస్ కూడా చేయనుందని టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment