
‘బ్యాచిలర్ లైఫ్‌కి టాటా. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను’ అని ఇటీవలే ప్రకటించారు రానా. మోడల్ మిహికా బజాజ్‌తో ప్రేమలో ఉన్నారు రానా. పెళ్లికి మిహికా ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రానా. తాజాగా ఇరు కుటుంబాలు బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నాయని సమాచారం. నిశ్చితార్థం ముహూర్తం, పెళ్లి ముహూర్తం గురించి చర్చించుకున్నట్టు్ట తెలిసింది. రానా, మిహికాల వివాహం డిసెంబర్‌లో ఉంటుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment