పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్ | Nivetha Thomas Wedding Rumours 35 Chinna Kadha Kaadhu Movie Update | Sakshi
Sakshi News home page

Nivetha Thomas: పెళ్లి రూమర్స్.. అసలు సంగతి ఇది

Jun 25 2024 2:45 PM | Updated on Jun 25 2024 3:09 PM

Nivetha Thomas Wedding Rumours 35 Chinna Kadha Kaadhu Movie Update

హీరోయిన్ నివేతా థామస్ పెళ్లి చేసుకోబోతుందా? సోషల్ మీడియా అంతా ఒకటే గోల. జస్ట్ ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టిందో లేదో రూమర్స్ తెగ వచ్చాయి. వచ్చే వారం నిశ్చితార్థం అని కొందరు, ఇప్పటికే పెళ్లి అయిపోయిందని మరికొందరు మాట్లాడుకున్నారు. కానీ పలువురు ఊహించినట్లే అది పెళ్లి గురించి కాదు. అందుకు సంబంధించి నివేతా క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్‌ హీరో భార్యకు అలాంటి అనుభవం!)

జెంటిల్‌మేన్, నిన్ను కోరి, బ్రోచెవారెవరురా, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో తెలుగు హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నివేతా పేతురాజ్.. తెలుగులో చివరగా 'శాకినీ డాకినీ' మూవీ చేసింది. ఇది రిలీజై రెండేళ్లకు పైనే అయిపోయింది. గతేడాది ఓ మలయాళ మూవీ చేసింది. ఆ తర్వాత పెద్దగా బయటకు కనిపించలేదు. దీంతో నివేతా ఏం చేస్తుందా అని అందరూ అనుకున్నారు. కొంపదీసి పెళ్లి ఏమైనా చేసేసుకుందా అని మాట్లాడుకున్నారు.

సోమవారం సాయంత్రం 'ఫైనల్లీ' అని చెప్పి లవ్ సింబల్ ఏమోజీని ఇన్ స్టా స్టోరీలో పెట్టడంతో గుడ్ న్యూస్ ఏమైనా చెబుతుందేమో అనుకున్నారు. కానీ అది తను లీడ్ రోల్ చేస్తున్న '35 చిన్న కథ కాదు' మూవీ కోసమని చెప్పి క్లారిటీ ఇచ్చింది. హీరో రానా నిర్మిస్తున్న ఈ మూవీలో నివేతాతో పాటు ప్రియదర్శి, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. 'పుష్ప 2' కోసం అనుకున్న ఆగస్టు 15న దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement