మిహికా బజాజ్, రానా దగ్గుబాటి
హీరో రానా దగ్గుబాటి – మిహికా బజాజ్ పెళ్లి ఈ నెల 8న జరగనుంది. ఈ సందర్భంగా ఇద్దరి ఇంట్లో పెళ్లికి సంబంధించిన వేడుకలు ఆరంభమయ్యాయి. గురువారం మిహికా ఇంట్లో ‘హల్దీ ఫంక్షన్’ నిర్వహించారు. పసుపు రంగు డిజైనర్ లెహంగా, సముద్రపు గవ్వల జ్యువెలరీలో మిహికా మెరిశారు. కాబోయే భర్త రానాతో కలిసి ఫొటో దిగి, మురిసిపోయారు. కాగా కరోనా నేపథ్యంలో రానా – మిహికా పెళ్లిని సింపుల్‌గా జరపనున్నారు.
ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యమైన అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. వివాహానికి హాజరయ్యే వారు తప్పని సరిగా కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోవాలని ఇరు కుటుంబ సభ్యులు పేర్కొన్నారట. పెళ్లి వేదిక, పరిసర ప్రాంతాల్ని శానిటైజ్ చేయించడంతో పాటు అందరూ భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. పెళ్లికి తయారు చేయించే వంటకాల విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. వంటలు చేసేవాళ్లకు కోవిడ్ టెస్ట్ చేయించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment