కథ వినగానే మా అమ్మ గుర్తొచ్చింది- రానా | Rana Daggubati Talks About '35 Chinna Katha Kaadu' Movie | Sakshi
Sakshi News home page

కథ వినగానే మా అమ్మ గుర్తొచ్చింది- రానా

Published Thu, Jul 4 2024 10:55 AM | Last Updated on Thu, Jul 4 2024 11:09 AM

Rana Daggubati Talks About '35 Chinna Katha Kaadu' Movie

‘‘పాఠశాలలో చదువుతున్నప్పుడు 35 నంబర్‌ నాకు పెద్ద పర్వతంలాంటిది (నవ్వుతూ). నందు ‘35–చిన్న కథ కాదు’ చెప్పినప్పుడు నాకు నేను గుర్తొచ్చాను, మా అమ్మ గుర్తొచ్చింది. ఈ కథని మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. ఈ కథని అందరూ రిలేట్‌ చేసుకుంటారు’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. 

నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్‌ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం 

టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ– ‘‘వాణిజ్య సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ ఇలాంటి ప్యూర్‌ హార్ట్‌ వార్మింగ్‌ స్టోరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్‌ ప్రొడక్షన్‌లో చేయాలనేది మా ఉద్దేశం. థియేటర్స్‌లో ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి’’ అన్నారు.

 ‘‘35–చిన్న కథ కాదు’లో తల్లి పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో చాలా డిఫరెంట్‌ క్యారెక్టర్‌ని ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నివేదా థామస్‌. ‘‘35–చిన్న కథ కాదు’ చాలా పెద్ద సినిమా’’ అన్నారు నంద కిశోర్‌. ‘‘ఈ సినిమా గొప్ప అనుభూతినిస్తుంది. మాకు మైలురాయిగా నిలిచి΄ోతుంది’’ అన్నారు సృజన్‌ యరబోలు. ఈ కార్యక్రమంలో నటుడు విశ్వదేవ్‌ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement