Priyadarshini
-
ప్రియదర్శి డార్లింగ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
-
ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ
-
కథ వినగానే మా అమ్మ గుర్తొచ్చింది- రానా
‘‘పాఠశాలలో చదువుతున్నప్పుడు 35 నంబర్ నాకు పెద్ద పర్వతంలాంటిది (నవ్వుతూ). నందు ‘35–చిన్న కథ కాదు’ చెప్పినప్పుడు నాకు నేను గుర్తొచ్చాను, మా అమ్మ గుర్తొచ్చింది. ఈ కథని మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. ఈ కథని అందరూ రిలేట్ చేసుకుంటారు’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ– ‘‘వాణిజ్య సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ ఇలాంటి ప్యూర్ హార్ట్ వార్మింగ్ స్టోరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్ ప్రొడక్షన్లో చేయాలనేది మా ఉద్దేశం. థియేటర్స్‌లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘35–చిన్న కథ కాదు’లో తల్లి పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ని ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నివేదా థామస్. ‘‘35–చిన్న కథ కాదు’ చాలా పెద్ద సినిమా’’ అన్నారు నంద కిశోర్. ‘‘ఈ సినిమా గొప్ప అనుభూతినిస్తుంది. మాకు మైలురాయిగా నిలిచి΄ోతుంది’’ అన్నారు సృజన్ యరబోలు. ఈ కార్యక్రమంలో నటుడు విశ్వదేవ్ మాట్లాడారు. -
భార్యకు స్పెషల్‌గా విష్ చెప్పిన టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం హరోం హర. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ జంటగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మే 31న రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. వచ్చేనెల జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు సుధీర్‌బాబు ప్రకటించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే సుధీర్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శినిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29,0 2006లో ఘనంగా జరిగింది. తాజాగా వివాహా వార్షికోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు సుధీర్. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫోటో అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు హీరో జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. Happy Anniversary my love 'Priya' 💐 You complete me 😘🤗…. First pic of hers I have with me. Pellichoopulu photo 😄 pic.twitter.com/005YWnBIzZ— Sudheer Babu (@isudheerbabu) May 29, 2024 -
మాస్క్ తో చేసే సీన్స్ లో నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే!
-
ఈ సినిమాలో నన్ను ఎవరైనా చూస్తారా లేదా అని భయమేసింది
-
గణనాథుని సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
యాదమరి (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని సోమవారం దర్శించుకున్నారు. ఉదయం ఆమె కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనార్థం కాణిపాకం విచ్చేయగా ఆలయ ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్స్పెక్టర్ బాబు పాల్గొన్నారు. -
Priyadarshini Karve: పొగరహిత కుక్కర్ తో.. పొగకు పొగ పెట్టవచ్చు!
శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయట! మనం చేయాల్సిందల్లా... ఆ పరిష్కారాల గురించి ఆలోచించడం. చిన్నప్పుడు తనకు ఎదురైన సమస్యను దృష్టిలో పెట్టుకొని దానికి శాస్త్రీయ పరిష్కారాన్ని అన్వేషించింది ప్రియదర్శిని కర్వే. ‘సముచిత ఎన్విరో టెక్’తో పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటోంది... చిన్నప్పుడు స్కూల్‌కు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు దారిలో తీయగా పలకరించే చెరుకుతోటలను చూసేది ప్రియదర్శిని. ఈ తీపిపలకరింపుల మాట ఎలా ఉన్నా తోటల్లో పంటవ్యర్థాలను దహనం చేసినప్పుడు నల్లటిపొగ చుట్టుముట్టేది. తోట నుంచి ఊళ్లోకి వచ్చి అక్కడ అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేది. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా!’ అనే ఆలోచన ఆమెతో పాటు పెరిగి పెద్దదైంది. పుణెకు సమీపంలోని పల్తాన్ అనే చిన్నపట్టణానికి చెందిన ప్రియదర్శిని కర్వే సైంటిస్ట్ కావాలనుకోవడానికి, సైంటిస్ట్‌గా మంచిపేరు తెచ్చుకోవడానికి తన అనుభవంలో ఉన్న వాయుకాలుష్యానికి సంబంధించిన సమస్యలే కారణం. కేంద్రప్రభుత్వం ‘యంగ్ సైంటిస్ట్’ స్కీమ్‌లో భాగంగా వ్యవసాయవ్యర్థాలకు అర్థం కల్పించే ప్రాజెక్ట్‌లో పనిచేసింది ప్రియదర్శిని. ఇది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. 2004లో స్కాట్లాండ్లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్’లో బయోచార్ రిసెర్చ్ సెంటర్లో చేరింది. బయోమాస్ సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రిసెర్చ్ సెంటర్ ఉపయోగపడింది. ఎంతోమంది ప్రముఖులతో మాట్లాడి, ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకునే అరుదైన అవకాశం దీని ద్వారా లభించింది. ‘సముచిత ఎన్విరో టెక్’ అనే కంపెనీ స్థాపించి పర్యావరణ అనుకూల వస్తువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది ప్రియదర్శిని. తోటలోని చెట్ల వ్యర్థాలను తొలగించడం అనేది పెద్ద పని. చాలామంది ఆ వ్యర్థాలను ఒక దగ్గర చేర్చి మంట పెట్టి ఇబ్బందులకు గురవుతుంటారు. చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘సముచిత ట్రాన్స్ఫ్లాషన్ క్లీన్’తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియదర్శిని. ఇది రివల్యూషనరీ డిజైన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ బాక్స్ బట్టీలో తోట వ్యర్థాలను వేసి, మంటపెట్టి మూత పెడతారు. అవి బయోచార్ ఇంధనంగా మారుతాయి. ప్రియదర్శిని మరో ఆవిష్కరణ పొగరహిత కుక్కర్. ‘వంటగది కిల్లర్’ అనే మాట పుట్టడానికి కారణం అక్కడ నుంచి వెలువడే పొగతో మహిళలు రకరకాల ఆరోగ్యసమస్యలకు గురికావడం. కట్టెలు, బొగ్గు మండించి వంట చేయడం తప్ప వేరే పరిష్కారం కనిపించని పేదలకు ఈ పొగరహిత కుక్కర్ సరిౖయెన పరిష్కారంగా కనిపించింది. కొద్ది మొత్తంలో బయోచార్‌ని ఉపయోగించి దీనితో వంట చేసుకోవచ్చు. పొగకు పొగ పెట్టవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పట్టణ ప్రాంత ప్రజల కోసం ‘కార్బన్ ఫుట్‌ప్రింట్ క్యాలిక్యులెటర్’ను తయారుచేసిన ప్రియదర్శిని కర్వే కొత్త కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడమే కాదు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అవగహన సదస్సులు నిర్వహిస్తోంది. వీటివల్ల తనకు తెలిసిన విషయాలను స్థానికులతో పంచుకోవడమే కాదు తనకు తెలియని సమస్యల గురించి కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ఆలోచన చేస్తోంది ప్రియదర్శిని కర్వే. -
బుల్లితెర నటుడి భార్య మృతి, డైట్ మార్పులే కారణమా?
తమిళ నటుడు భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని (43) కన్నుమూశారు. గత కొన్నివారాలుగా కోమాలో ఉన్న ఆమె సోమవారం ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి డైట్ మార్పులే కారణమని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్ స్టార్ట్ చేశారు. సడన్‌గా ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో ఆమె రక్తంలో షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగిపోయాయట. మూడు నెలల క్రితం పరిస్థితి సీరియస్ కావడంతో ఆమెను చెన్నైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమె కోమాలోకి వెళ్లగా తాజాగా మరణించారు. కాగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా పేరు తెచ్చుకున్న కల్యాణ్ కుమార్ తనయుడే భరత్ కల్యాణ్. మొదట్లో సినిమాలు చేసిన ఆయన తర్వాత బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. అపూర్వ రంగల్, వంశం, జమిలా వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు భరత్ కల్యాణ్. చదవండి: ప్రముఖ బుల్లితెర నటి మృతి ఇనయను ఆడుకున్న హౌస్మేట్స్, శ్రీహాన్ లాస్ట్ పంచ్ అదిరింది -
రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో ఇతడే
Shilpa Choudhary Cheating Case: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ పలువురు సెలబ్రెటీ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి చీటింగ్ కేసులో రోజురోజుకు కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఆమె చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిట్టి పార్టీల పేరుతో శిల్ప తన దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని ఈ క్రమంలో శిల్ప చేతిలో మోసపోయానంటూ మరో టాలీవుడ్ సెలబ్రెటీ బయటకు వచ్చాడు. యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి శిల్ప మాయమాటలు నమ్మి నట్టేట మునిగాడు. కిట్టి పార్టీ పేరుతో మాయ మాటలు చెప్పి శిల్ప తన దగ్గర రూ. 3 కోట్లు వసూలు చేసిందట. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తొందంటూ ఈ యంగ్ హీరో పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కాగా ‘సెహరి’ సినిమాతో హర్ష్ కనుమల్లి హీరోగా పరిచయమయ్యాడు. వీరితో పాటు మరో స్టార్ హీరో కూడా శిల్ప బాధితుల్లో ఉన్నట్లు సమాచారం. కాగా కిట్టి పార్టిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో శిల్పా చౌదరి సెలబ్రెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖుల వద్ద దాదాపు రూ. 200 కోట్లు రూపాయలు వసూలు చేశారు. చదవండి: అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన ఆమె మాయమాటలకు ప్రముఖ టాలీవుడ్ హీరో కుటుంబం కూడా రూ. 12 కోట్లు మోసపోయినట్లు సమాచారం. వారు టాలీవుడ్ అగ్రహీరోకు అత్యంత ఆప్తులుగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం ఒక్కొక్కరి వద్ద రూ. 6 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మరో సీనియర్ నటుడు కూడా రూ. 2.4 కోట్లు మోసపోయినట్లు సమాచారం. శిల్పా చౌదరి బాగోతాలు వెలుగులోకి రావడంతో బాధితులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర పోలీస్ స్టేషన్ల్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! కాగా యంగ్ హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని దగ్గర 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ష్యూరిటీ కింద ఇచ్చినట్టు బయట పడింది. చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంక్‌కు వెళ్లిన ప్రియదర్శిని.. మోసపోయినట్టు తెలుసుకుని అవాక్కయింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిల్పా చౌదరికి చెందిన 6 బ్యాంక్ అకౌంట్స్‌పై నార్సింగ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. -
పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని
Young Hero Sudheer Babu Wife Priyadarshini Files Complaint Over Rs 2.9 Crore Cheating Case: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ ముగ్గురు టాలీవుడ్ హీరోలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం సంచలనం రేపుతోంది. రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మేర శిల్ప పలువురికి కుచ్చు టోపి పెట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో అంత ఈ జీగా మోసపోయింది పేరున్న వ్యక్తులు, సెలబ్రెటీలు అని తెలిసి అందరూ షాకవుతున్నారు. చదవండి: ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్‌ల భారీ విరాళాలు దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శిల్ప ఆమె భర్తను శనివారం (నవంబర్ 27) ఉదయం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇక వారి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. రియల్ ఎస్టెట్ వ్యాపారం పేరుతో శిల్ప మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన 5 రోజుల తర్వాత ఓ అగ్ర హీరో సోదరి, యంగ్ హీరో భార్య మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. చదవండి: Cheating Case: సినీ సెలబ్రిటీలను రూ. 200 కోట్లు మోసం, రిమాండ్‌లో కీలక విషయాలు వెల్లడి ఆమె ఎవరో కాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని. శిల్ప తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ బుధవారం(డిసెంబర్ 1) ప్రియదర్శని పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకుని శిల్ప మోసం చేసినట్లు ఆమె మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసమే ఆమె ప్రతి వీకెండ్లో కిట్టి పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని డబ్బులు ఎక్కడికి తరలించారనే దానిపై విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
మహేశ్‌బాబు చెల్లెలు, సుధీర్ బాబు భార్య బర్త్‌డే సెలబ్రేషన్స్
Mahesh Babu Sister Sudheer Babu Wife Priya Darshini Birthday Celebrations: సూపర్‌స్టార్ మహేశ్ బాబు చెల్లెలు, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంట్లోనే కుటుంబసభ్యుల మధ్య బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణతో, మంజుల సహా పలువురు కుటుంబ సభ్యుల మధ్య ప్రియదర్శిని కేక్ కట్ చేసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: సమంత ఇన్‌స్టా పోస్ట్.. పర్సనల్ లైఫ్ గురించేనా? సుధీర్‌బాబు సైతం భార్యకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టును షేర్చేశారు. 'హ్యాపీ బర్త్‌డే ప్రియ..నీతో ప్రతీ సంవత్సరం మునుపటి ఏడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజూ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ప్రేమను పంచుతున్నందుకు ధన్యవాదాలు' అంటూ శ్రీమతికి ప్రేమగా బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. చదవండి: హీరోయిన్ కాజల్ ముఖ్యమైన ప్రకటన..ఇన్‌స్టాలో పోస్ట్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) -
క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన యువతి: మరో షాకింగ్ వీడియో వైరల్
లక్నో: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్ డ్రైవర్ తనను ఢీకొన్నాడని.. అతడిని తీవ్రంగా కొట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో ఫుటేజ్ పరిశీలించగా ఆ యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదని తేలింది. దీంతో ఆ యువతిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ యువతికి సంబంధించిన మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. (చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్) లక్నోలో ప్రియదర్శిని నారాయణ యాదవ్‌కు సంబంధించిన వీడియో ఆమె ప్రవర్తనా తీరును స్పష్టంగా చెబుతోంది. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో ఒకరు తమ ఇంటి గేటుకు నలుపు రంగు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నలుపు రంగు ఎందుకు వేశారంటూ ఆ ఇంటివారితో గొడవకు దిగింది. వెంటనే రంగు మార్చాలని గట్టిగా అరుస్తూ ఉంది. మీ వలన కాలనీ అంతా ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. డ్రోన్స్ ద్వారా దాడి జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేసింది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తుండడంతో కాలనీలో కొంత గందరగోళం ఏర్పడింది. రాత్రిపూట వచ్చి ప్రియదర్శిని గొడవ చేయడంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడారు. పోలీసులతోనూ ఆమె గేటుకు ఉన్న నలుపు రంగు గురించే మాట్లాడింది. ఆమెకు నచ్చచెప్పేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రెండేళ్ల కిందటి వీడియో అయినా ఇప్పుడు వైరలవుతోంది. క్యాబ్ డ్రైవర్‌పై దాడి నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ప్రియదర్శిని మానసిక పరిస్థితి బాగా లేదేమో అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఇలాగే ఉందని చెబుతున్నారు. గేటుకు నల్లరంగు ఉంటే ఏమిటి? నీ ఒంటిపై కూడా నలుపు రంగు దుస్తులు ఉన్నాయి కదా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. This is the 2 Year Old Video Of #PriyadarshiniYadav Arguing with Neighbours over the Black Colour of their Main Gate. Credits: ig@be_harami#ArrestLucknowGirl #PriyadarshiniNarayan pic.twitter.com/KMB5eR6IW0 — Fackt Checker (@FacktChecker) August 5, 2021 -
Priyadarshini Nahar: విజయానికి ప్రధాన కారణం అదే...
‘మేం అంగవికలురం కాదు, దివ్యాంగులం’ అంటారు ప్రియదర్శినీ నహర్. అందరు పిల్లల్లాగానే ఆరోగ్యంగా పుట్టారు ప్రియా. చక్కగా ఆటపాటలతో బాల్యం అందంగా, ఆనందంగానే గడుస్తోంది. ఇంతలోనే విధి చిన్న చూపు చూసింది. ప్రియదర్శినికి ఆరు సంవత్సరాల వయసులో, పోలియో కాటు వేసింది. రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. శరీరం పనిచేయలేదు. ప్రియా నహర్ తన అచేతన స్థితికి కుంగిపోలేదు. తల్లిదండ్రుల సహకారంతో, ప్రోత్సాహంతో చదువుకోవటం ప్రారంభించింది. కామర్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు ప్రియదర్శినీ నహర్. అక్కడితో ఆగిపోలేదు. తనలాంటి ఎంతోమందికి చదువు చెప్పాలనుకున్నారు. అందుకోసం టెక్నాలజీని వాడుకోవాలనుకున్నారు ప్రియదర్శిని. ఆన్లైన్ క్లాసుల ద్వారా దివ్యాంగులకు పోటీ పరీక్షలకు కావలసిన శిక్షణ ఇవ్వాలనుకున్నారు. తనకు ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టారు. ఇందుకోసం పెద్ద ఆఫీసు తీసుకోలేదు. ఒక చిన్న గదిలో కూర్చుని, ముగ్గురు విద్యార్థులకు ఆన్లైన్లో ట్యూషన్ చెప్పటం ప్రారంభించారు. ఒకరి నుంచి ఒకరికి ఈ విషయం తెలిసి, ఉత్సాహవంతులైన చాలామంది దివ్యాంగులు ఆన్లైన్ క్లాసులకు కూర్చోవటం మొదలుపెట్టారు. క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో, పుణేలోని లా కాలేజ్ రోడ్డులో ‘యాష్ క్లాసెస్’ ప్రారంభించే స్థాయికి ఎదిగారు. ‘ది ఆసరా’ సంస్థ ప్రియా నహర్కి ఎంతగానో సహకరించింది. మార్కెటింగ్ ప్లాన్ చెప్పి, మరింతమంది విద్యార్థులు ఇందులో చేరేలా ఈ సంస్థ ప్రోత్సహించింది. ఇప్పుడు ‘యాష్ క్లాసెస్’ అంటే మంచి శిక్షణ సంస్థగా పేరు సంపాదించుకుంది. వందమందికి పైగా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు విద్యార్థులకు లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు, కంప్యూటర్స్, ఎకనమిక్స్, కామర్స్ అంశాలలో మంచి శిక్షణ ఇస్తున్నారు ప్రియదర్శిని. తన దగ్గరే టీచర్లను వేసుకుని వారికి జీతాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు ప్రియా నహర్. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా రెండువేల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు, ‘ఓపెల్ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్’ అనే సంస్థను కూడా స్థాపించి, దివ్యాంగులకు రకరకాల వృత్తులలో శిక్షణ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలుగా ఈ సంస్థను ప్రియదర్శిని విజయవంతంగా నడుపుతున్నారు. తన గురించి చెబుతూ... ‘‘మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. నాకు ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. చెల్లికి వివాహమైంది. పుణేలో ఉంటోంది. మా తమ్ముడు మంచి వస్త్ర వ్యాపారవేత్త అయ్యాడు. మా తల్లిదండ్రుల కృషి, పట్టుదలతో ఇప్పుడు నేను కొద్దికొద్దిగా నడవగలుగుతున్నాను. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా నాకు మంచి చదువు చెప్పించారు అమ్మవాళ్లు. నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. బయటకు వెళ్లలేని పరిస్థితి నాది. అందువల్ల ఇంటి నుంచే ఏదో ఒక పని చేయాలనుకున్నాను. చదువుకునే రోజుల్లో నేను బ్రైట్ స్టూడెంట్‌ని కావటం వల్ల, చదువుకు సంబంధించిన వాటిమీదే నా దృష్టి పెట్టాను. అలా ప్రారంభమైంది యాష్ కోచింగ్ సెంటర్’’ అంటున్న ప్రియదర్శిని.. విద్యార్థులకు చదువుతో పాటు, బిహేవియరల్ అనలిస్టులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌లో కూడా శిక్షణ ఇస్తున్నారు. కొంతమంది యోగా గురువులతో దివ్యాంగుల కోసం జిమ్ కూడా ప్రారంభించారు. ‘‘నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. పిల్లలకు పాఠాలు చెప్పటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. ముందు నేను శ్రద్ధగా చదువుకుని, ఆ తరవాత పిల్లలకు చెబుతాను. చాలామంది విద్యార్థులు మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటూ, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. వాళ్లని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను పెళ్లి చేసుకోకపోయినా, నాలాంటి చాలామంది పిల్లలకు తల్లిని. ‘నాణ్యమైన పని విజయానికి ప్రధాన కారణం’ అని నేను నమ్ముతాను’’ అంటారు ప్రియదర్శిని నహర్. Fortune World's 50 Greatest Leaders List: ఫార్చూన్ ఉమెన్ -
ఘనంగా సీనియర్ నటి శరణ్య కూతురి ఎంగేజ్మెంట్..
-
ప్రియరాగం
గ్రామీ అవార్డ్‌ల నామినీల జాబితాలో ‘బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్’ విభాగంలో స్థానాన్ని దక్కించుకొని అంతర్జాతీయ గుర్తింపు పొందింది ప్రియదర్శిని. ప్రియదర్శిని గురించి మాట్లాడుకోవాలంటే యూత్‌ను ఊపేస్తున్న ‘పెరిఫెరీ’ ఆల్బమ్ గురించి మాత్రమే కాదు... ఆమె బహుముఖప్రజ్ఞ, సేవాతత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. చిన్నాచితకా పనులు చేస్తూనే ‘అబ్బా! టైమ్ సరిపోవడం లేదు’ అని గొణుక్కుంటాం. పెద్ద పెద్ద పనులు చేస్తున్నవారి గురించి ఆలోచిస్తూ ‘ఒక్కరే ఇన్నిన్ని పనులు ఎలా చేస్తారు!’ అని కూడా ఆశ్చర్యపోతుంటాం. ‘టైమ్ మన చేతిలో ఉంటే అదృష్టం కూడా మన చేతిలో ఉంటుంది’ అని చెప్పడానికి నిలువెత్తు ఉదాహరణ... ప్రియదర్శిని. సింగర్ సాంగ్ రైటర్ స్విమ్మర్ ఎంటర్ప్రెన్యూర్ సోషల్ యాక్టివిస్ట్ ఆల్ట్రా–మారథానర్... ప్రియదర్శిని అనే పేరుకు ముందు ఇన్ని విశేషణాలు ఉన్నాయి. ‘నా పేరు నిలపాలి సుమా!’ అని పెద్దలు అంటుంటారు. నిలపడమేమిటి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. ప్రియదర్శిని బామ్మ పేరు ప్రియదర్శిని. సేమ్ పేరు అన్నమాట! అమ్మమ్మ ఒడిలోనే సంప్రదాయ కర్నాటక సంగీతాన్ని నేర్చుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన ప్రియదర్శిని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్–మేకింగ్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్లు, సంగీతకారులతో కలిసి పనిచేసింది. మదర్ థెరెసా జీవితం ఆధారంగా తీసిన హాలివుడ్ సినిమా ‘ది లెటర్స్’లో సుభాషిణి దాస్ పాత్రలో ఒదిగిపోయింది. ప్యార్ క్యోం కియా, డి–కంపెనీ... మొదలైన బాలీవుడ్ సినిమాలలో పాటలు పాడి తన గాత్రంతో శ్రోతలను ఆకట్టుకుంది. వందకు పైగా రేడియో, టీవి కమర్షియల్స్‌కు తన గాత్రాన్ని అందించింది. నే పాడితే లోకమే ఆడదా... 2017లో ‘ఇట్ కాన్ట్ హ్యాపెన్ హియర్’ నాటకంలో నటించి రంగస్థలంపై కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ‘పెరిఫెరీ’ ఆల్బమ్ ఒక ఎత్తు. ఆమె తొలి ఆల్బమ్ యూత్‌ను తెగ ఆకట్టుకుంది. సంప్రదాయ కర్నాటక సంగీతం, అమెరికన్ పాప్ మ్యూజిక్ కలయికగా వచ్చిన ఈ ఆల్బమ్ న్యూ ఏజ్ మ్యూజిక్‌లో తనదైన స్టాంప్ వేసింది. ‘నా చిన్నప్పటి కల నిజమైంది. ముంబైలోని గోరెగావ్‌లో పెరిగిన నాలాంటి తమిళ పొన్నుకు ఇలాంటి నిజాలు జీర్ణం చేసుకోవడం కాస్త కష్టమే’ అంటోంది ప్రియదర్శిని. ఆమె తన గురించి ఏమనుకుంటుంది సరే, మరి ఇతరులు? ఫైవ్ టైమ్ గ్రామీ విన్నర్ రాయ్ వుటెన్ ఇలా అంటారు... ‘ఆమె ఎంతోమందికి స్ఫూర్తి’ గానం, సాహిత్యంలోనే కాదు సాహసంలోనూ తనదైన ప్రత్యేకత చాటుకుంది ప్రియదర్శిని. అత్యంత ప్రతికూల వాతావరణంలో ఆల్ట్రా మారథాన్ రన్నర్‌గా 100–మైల్ హిమాలయన్ స్టేజ్ రేస్ పూర్తి చేసి రికార్డ్ సృష్టించింది. ఆ సమయంలో పోర్టర్లు, గైడ్లుగా బతుకుతున్న షేర్పాల జీవితాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వాళ్లు దోపిడికి గురవుతున్నారనే వాస్తవం బోధ పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్ట్రా మారథాన్లను నిర్వహించడానికి ‘ది విండ్ ఛేజర్స్’ అనే కంపెనీ లాంచ్ చేసింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని షేర్పాల కుటుంబ సంక్షేమానికి కేటాయిస్తున్నారు. హోమ్ మ్యూజిక్ వీడియోలో ఒక దృశ్యం నమీబియా ఎడారిలో 250 కిలోమీటర్ల హార్డ్ కోర్ రేస్ మరో సాహసం ప్రియదర్శిని దృష్టిలో గానం, పరుగు రెండు వేరు విషయాలు కాదు. ఒకదానికొకటి అనుసంధానమైవి. ‘సృజనాత్మకత మరింత పదును తేలడానికి ఇది ఉపకరిస్తుంది’ అంటోంది ప్రియదర్శిని. సాహనం మాత్రమే కాదు సహాయం కూడా ఆమెకు ఇష్టమైన మాట. క్యాన్సర్ చికిత్స కోసం ముంబై మహానగరానికి వచ్చి ఆశ్రయం దొరకక ఇబ్బందిపడే పేదలకు ప్రియదర్శిని తల్లి తన వన్–బెడ్రూమ్ ఫ్లాట్‌లో ఆశ్రయం కల్పించేది. తల్లి నుంచి ఇలాంటి మంచి గుణాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియదర్శిని ‘జనరక్షిత’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ‘జనరక్షిత’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు సమకూరుస్తుంది. బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించడానికి కృషి చేస్తుంది. కళ,సేవ,వ్యాపారరంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రియదర్శిని. నామినీ జాబితాలో చోటు సంపాదించుకున్న మన కళాకారులు అనుష్క శంకర్, నేహా మహాజన్, శిల్పారావులకు అభినందనలు తెలియజేద్దాం. -
ఎవరి కథ వారిదే
మన సినిమాల్లో ఆడవాళ్లను గయ్యాళి వారిగా పరిచయం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన సీన్లుంటాయి. వీధి కుళాయి దగ్గర పెద్ద నోరేసుకుని అరుస్తూ మిగిలిన అందరినీ హడలుగొడుతూ నీళ్లు పట్టుకునే సన్నివేశం కూడా ఆ కోవకు చెందినదే. అయితే అవన్నీ సమాజంలో ఉన్నవే. కానీ పైకి కనిపించే సంఘటనల వెనుక ఉన్న కారణాల జోలికి వెళ్లదు సినిమా. ఎందుకంటే ఆ చిత్రంలో ఆ పాత్ర పరిచయానికి అంతకంటే లోతుగా అధ్యయనం చేయాల్సిన పని ఉండదు. అలాగని మహిళను గయ్యాళిగా చూసే అభిప్రాయాన్ని సమాజం మెదడు నుంచి తుడిచేయకపోతే ఎలా? ఇదే పని చేస్తున్నారు ప్రియదర్శిని పళని. జీవిత రచన చెన్నైలో బ్లూ క్లబ్ పేరుతో ఒక మీడియా సంస్థ శ్రామిక వర్గ మహిళల కోసం పని చేస్తోంది. ప్రియదర్శిని ఆ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు. ఆమె చెన్నైలోని పెరుబాక్కమ్, తెదీర్ నగర్ వంటి ప్రదేశాలను సందర్శించి అనేక యదార్థ గాథలను డాక్యుమెంట్ చేస్తోంది. ఐదేళ్ల కిందట మొదలైన ఈ క్లబ్ ఇప్పటివరకు రెండు వందలకు పైగా మహిళల జీవితాలను వాళ్ల చేతనే గ్రంథస్థం చేయించింది. నిజానికి ఆ మహిళల్లో ఎవరూ కథ, కథనాల మధ్య తేడా తెలిసిన వాళ్లు కూడా కాదు. అయితే జీవితం నేర్పించినన్ని పాఠాలు మరే యూనివర్సిటీ కూడా నేర్పించలేదు. జీవితం ఇచ్చే శిక్షణ ముందు మిగిలిన శిక్షణలన్నీ దిగతుడుపే. ఇదే మాట చెబుతారు ప్రియదర్శిని. ఆమె అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీలలో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. వాళ్లంతా ఏదో బడికి వెళ్లి చదవడం, రాయడం మాత్రమే నేర్చుకుని ఆ తర్వాత బతుకు పోరాటంలో భాగంగా పనుల్లో పడిపోయిన వాళ్లే. ఒక్కో మహిళను ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రోజులో చేసే పనులను చెప్పమన్నప్పుడు అందరూ చెప్పడం మొదలు పెట్టారు. పైకి దాదాపుగా అందరి జీవితం ఒకటే మూసలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే ఎవరి అగాధం వారిదే. ఆ అగాధాన్ని దాటి రావడానికి వాళ్లు పడే శ్రమ కూడా దేనికదే ప్రత్యేకం. వాళ్ల జీవితాలను రిపోర్టు చేయడానికి వచ్చిన ఏ రిపోర్టర్ అయినా మహా అయితే... వీధి చివర్లో నీళ్ల కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునే మహిళల దుస్థితిని దయనీయంగా కళ్లకు కట్టగలుగుతారేమో. నిజానికి ఆ బిందెడు నీళ్లు తీసుకెళ్లకపోతే ఇంట్లో ఆగిపోయే పనుల గురించి ఏకరువు పెట్టగలిగింది ఆ బాధను అనుభవిస్తున్న మహిళలే. నీళ్లు లేకుండా ఇంటికి వెళ్తే ఒక మహిళ ఇంట్లో భర్త చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది. మరో ఇంట్లో ఆ మహిళ బిడ్డకు స్నానం చేయించకుండా చెంబుడు నీటిలో వస్త్రాన్ని తడిపి ఒంటిని తుడిచి సరిపెట్టాల్సి వస్తుంది. మరో ఇంట్లో ముసలి వాళ్లు ఉంటారు. నీళ్లు లేకపోతే ఎలాగా అనే బెంగతో అదే విషయాన్ని పలుమార్లు తలుచుకుంటూ కోడలిని సతాయిస్తుంటారు. ఇంకో ఇంట్లో బిందెడు నీళ్లు లేని కారణంగా స్కూలుకెళ్లాల్సిన పిల్లలకు అన్నం వండి బాక్సు పెట్టడానికి కుదరదు. అవసరానికి పనికొస్తాయని దుస్తుల అడుగున దాచుకున్న చిల్లర డబ్బులను పిల్లలకిచ్చి ఏదైనా కొనుక్కుని తినమని స్కూలుకు పంపిస్తుందా తల్లి. నీటి కుళాయి తగవులాట వెనుక, ఆటోవాలాకిచ్చే చిల్లర దగ్గర గొడవ పడడం వెనుక ఇంతటి విషాదాలుంటాయి. ఆ కష్టాలను యథాతథంగా పేపర్ మీద రాయమంటుంది ప్రియదర్శిని. తమ రోజువారీ కార్యక్రమాలను చెప్పడం మొదలైనప్పటి నుంచే వారిలో ఆలోచన విస్తరిస్తోంది. ఇక రాయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ల దృష్టి కోణం మరింతగా విస్తరిస్తోందని చెబుతున్నారు ప్రియదర్శిని. శ్రామిక వర్గ మహిళలు తాము జీవిస్తున్న జీవితాన్ని విశ్లేషించడంతోపాటు అందుకు దారి తీసిన మూల కారణాలను కూడా అన్వేషించగలుగుతున్నారు. కొందరి విషయంలో అవి కుటుంబ పరమైన కారణలయి ఉంటున్నాయి. మరికొందరికి ఆ కారణాలు సామాజికపరమైనవి అయి ఉంటున్నాయి. ‘శ్రామిక వర్గ మహిళల కష్టాలను నేను చూసి రాయడంకంటే వాళ్ల చేత రాయించగలిగితే అసలు కారణాలు బయటకు వస్తాయనుకున్నాను. అది నిజమని నా ప్రయత్నంలో నిర్ధారణ అయింది’ అంటున్నారు ప్రియదర్శిని. -
అందుకే ఐరన్ లేడీ చేస్తున్నా!
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్ నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ఒకటి. జయలలిత జీవితంతో మూడు నాలుగు సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో మీరు నటిస్తున్న ‘ఐరన్ లేడీ’ ప్రత్యేకత ఏంటి? ఒకే వ్యక్తి గురించి ఇన్ని సినిమాలు వస్తున్నా మీరు నటించడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నలు నిత్యా మీనన్ ముందుంచితే – ‘‘నిజమే... జయలలితగారి జీవితంపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తున్నాయని నాకు లె లుసు. అందుకే మనం ఎందుకు చేయాలి? అనే అనుమానం నాకూ వచ్చింది. నా సందేహాన్ని ‘ఐరన్ లేడీ’ దర్శకురాలు ప్రియదర్శిని ముందుంచాను. దానికి ఆమె చెప్పిన సమాధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ‘జయలలితగారిపై ఎవరెన్ని సినిమాలు తీసినా తీయనివ్వండి. కానీ, మనం తీసే సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేదే పాయింట్. నేను జయలలితగారిని వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను. ఆమెను దగ్గరినుంచి గమనించాను, చాలా విషయాలు మాట్లాడాను’ అన్నారు ప్రియదర్శిని. ఆమె మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. మనం మంచి సినిమా చేస్తున్నాం అనే నమ్మకం కలిగింది. అందుకే ధైర్యంగా ‘ఐరన్ లేడీ’లో నటిస్తున్నాను’’ అన్నారు. -
ప్రియదర్శినికి కాంస్యం
కోల్‌కతా: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ వెయిట్‌లిఫ్టర్ ప్రియదర్శిని కాంస్య పతకం సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో ప్రియదర్శిని మొత్తం 168 కేజీల (స్నాచ్‌లో 70+క్లీన్ అండ్ జెర్క్‌లో 98) బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. మీరాబాయి జాతీయ రికార్డు: 49 కేజీల విభాగంలోనే భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపూర్‌కు చెందిన 25 ఏళ్ల మీరాబాయి మొత్తం 203 (స్నాచ్‌లో 88+ క్లీన్ అండ్ జెర్క్‌లో 115) కేజీలు బరువెత్తి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 201 కేజీలతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. రైల్వేస్‌కే చెందిన మరో వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను మొత్తం 185 కేజీలు (స్నాచ్‌లో 80+క్లీన్ అండ్ జెర్క్‌లో 105) బరువెత్తి రజత పతకాన్ని దక్కించుకుంది. -
అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి
సినిమా: అమ్మ లక్షణాలు సహజంగానే ఆమెలో ఉన్నాయి అని మహిళా దర్శకురాలు ప్రియదర్శిని అన్నారు. ఈమె ఎవరి గురించి చెబుతున్నారో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవును దర్శకురాలు ప్రియదర్శిని చెబుతున్నది నటి నిత్యామీనన్ గురించే. నవ దర్శకురాలైన ప్రియదర్శిని దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత నటీమణి జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రకు నటి నిత్యామీనన్‌ను ఎంపిక చేసుకున్న సంగతి విదితమే. దీనికి ది ఐరన్ లేడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఇదంతా జరిగి చాలా రోజులైంది. దీంతో ఈ చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో దర్శకురాలు ప్రియదర్శిని స్పందిస్తూ శనివారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ది ఐరన్‌లేడీ చిత్రం గురించి పలువురు పలు విధాలుగా ప్రశ్నిస్తున్నారు. వారందరికి వాస్తవాలను తెలియజేయాలని భావించాను. ఈ చిత్రం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పరిపూర్ణ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. నిజ జీవిత అంశాలను పూర్తిగా చర్చించిన తరువాతనే జయలలిత పాత్రలో నటి నిత్యామీనన్ సరిగ్గా నప్పుతారని ఆమెను ఆ పాత్రకు ఎంపిక చేశాం, జయలలితలోని సహజమైన లక్షణాలన్నీ నిత్యామీనన్‌లో ఉన్నాయి. పురట్చి తలైవి అమ్మ మాదిరిగానే నిత్యామీనన్ ఆరు భాషల్లో సరళంగా మాట్లాడగలరు. తను చిన్నతనంలోనే భరతనాట్యం, క్రీడలు పరిచయం కలిగి ఉన్నారు. అంతే కాదు సంగీతంలోనూ ప్రతిభ కలిగిన నటి. జీవిత చరిత్రను తెరకెక్కించడం సవాలే. అదేవిధంగా బయోపిక్‌లతో పలు సమస్యలు, చర్చలు, విమర్శలు ఉన్నా, అమ్మ జీవిత చరిత్రను యథార్థంగా ఎలాంటి మార్పులు చేయకుండా తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ కథను తెరకెక్కించడంలో దర్శకురాలిగా సవాళ్లు అధికమే. ప్రజలు అంగీకరించేలా, అలరించేలా ఒక మంచి చిత్రాన్ని రూపొందించే బాధ్యతను తీసుకున్నాం. సర్ రిచర్డ్ ఆటంబరో గాంధీ బయోపిక్‌ను తెరకెక్కించడానికి 18 ఏళ్ల సమయాన్ని ఖర్చు చేశారు. ఒక ఉన్నతమైన చిత్రాన్ని రూపొందించడానికి అంత సమయం అవసరం అవుతుందన్న విషయంలో మేమూ దృఢంగా ఉన్నాం. ఈ చిత్రంలో సగం విజయం సరైన కథాపాత్రలను ఎంపిక చేయడంలోనే ఉంది. ఈ విషయంలో రాజీకి చోటు ఉండదు. అలా కాంప్రమైజ్ అయితే మీరు కచ్చితంగా అంగీకరించరన్నది మాకు తెలుసు.అందుకే యథార్థం మీరకుండా పూర్తి స్వేచ్ఛతో ఈ చిత్రాన్ని మీ ముందుంచాలని భావించాం, చిత్రంలో మూడు ప్రధాన పాత్రలు పోషించనున్న నటీనటుల కాల్షీట్స్ కోసం వేచి ఉన్నాం. ఈ విషయాన్ని మీ ముందుంచడం సంతోషంగా ఉంది. ఈ ఆదరణతో అసాధ్యాన్ని సాధ్యం చేస్తాం. అని ది ఐరన్ లేడీ చిత్ర రూపకల్పనకు పూనుకున్న నవ దర్శకురాలు ప్రియదర్శిని పేర్కొన్నారు. -
భర్తకు ప్రేమతో.. గెలుపు బాధ్యత
భోపాల్: ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనేది ఎంత వరకు నిజమో తెలీదు కానీ.. ప్రతి భర్త విజయం వెనుక భార్య శ్రమ ఉంటుందని రుజువు చేస్తున్నారు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాదిత్య సింథియా భార్య.. ప్రియదర్శినీ రాజే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలో పార్టీ విజయానికి ప్రియదర్శిని ఎంతో కష్టపడుతున్నారు. భర్త జ్యోతిరాదిత్య జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్‌సభ నియోజకవర్గ గెలుపు బాధ్యతను ఆమె మోస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన రెండు స్థానాల్లో గుణ ఒకటి. గత ఏడాది హోరాహోరీగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక జ్యోతిరాదిత్యా కృషి అందరికీ తెలిసిందే. సీనియర్ నేత కమల్‌నాథ్‌ను పక్కన పెట్టి సీఎంగా కుర్చి కూడా అయననే వరిస్తుందని ఓ వర్గం నేతలు ఎంతో ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాల అనంతరం లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కమల్‌నాథ్‌కు సీఎం పీఠం అప్పగించి.. జ్యోతిరాదిత్యకు ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఆ తరువాత దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో పార్టీ పుర్వవైభవం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. సింథియా, ప్రియాంక గాంధీను యూపీ బాధ్యులుగా నియమించారు. యూపీలో విజయం కోసం ప్రియాంకతో పాటు సింథియా విశ్వప్రయత్నలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గమైన గుణ ప్రచారానికి దూరమైయారు జ్యోతిరాదిత్య. గుణలో సింథియా కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. 1967 నుంచి వరసగా వారి కుటింబికులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి గెలుపు బాధ్యతను ఆయన భార్య ప్రియదర్శినీ రాజేపే మోపారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి గుణ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో విస్రృతంగా పర్యటిస్తూ.. ప్రజల అవసరాల గురించి ఆరాతీస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజే.. ప్రత్యర్థి అభ్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే జ్యోతిరాదిత్య ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుణ స్థానంలో ఆయన భార్యను నిలపాలనే అనుకున్నారు. చివరి వరకూ ఇదే ప్రచారం జరిగినా.. కీలక ఎన్నికలు కావడంతో సింథియానే బరిలో నిలిపింది కాంగ్రెస్ అధిష్టానం. 2002లో తండ్రి మరణంతో ఈ స్థానం ఖాళీ కావడంతో తొలిసారి ఉప ఎన్నికల్లో గుణ ఎంపీగా గెలుపొందారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు సింథియా విజయం సాధించారు. గత ఎన్నికల్లో లక్షన్నర ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు. మరోసారి తన భార్యపై ఉన్న నమ్మకంతో విజయంపై ధీమాగా ఉన్నారు. కాగా మరాఠా గైక్వాడ్ రాజవంశానికి చెందిన ప్రియదర్శినీ రాజేను 1994లో జ్యోతిరాదిత్యా సింథియా వివాహమాడిన విషయం తెలిసిందే. -
మిఠాయి బాగుంది
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజు, శ్వేతవర్మ, అర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిఠాయి’. ప్రశాంత్‌కుమార్ దర్శకత్వంలో డా. ప్రభాత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలకానుంది. ఈ చిత్రం థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అందరినీ ఆహ్లాదపరిచే చక్కటి వినోదాత్మక చిత్రమిది. డార్క్ కామెడీతో విభిన్న పాత్రల మధ్య సాగే కథ, కథనాలు ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేస్తాయి. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల అభినయం సినిమాకే హైలైట్. నవరసాలను మేళవించి దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో బాగా తీశాడు. వివేక్ సాగర్ సంగీతం వీనుల విందుగా ఉంటుంది. ప్రేక్షకులకు ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది’’ అన్నారు. భూషణ్ కల్యాణ్, రవివర్మ, గాయత్రి గుప్త, అదితీ మైఖేల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్ నీలమేఘం. -
కామెడీ మిఠాయి
‘మిఠాయి’ తియ్యగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ మా ‘మిఠాయి’ తినేది కాదు చూసేది’’ అంటున్నారు నిర్మాత డా. ప్రభాత్‌కుమార్. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజ్, శ్వేతావర్మ, ఆర్ష ముఖ్య తారలుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. ‘‘చిత్రరంగంలో విశేష అనుభవం సంపాదించుకున్న నిర్మాత మామిడాల శ్రీనివాస్ ఫ్యాన్సీ ధరకు ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు’’ అని నిర్మాత తెలిపారు. రాజేశ్వరి ఫిలింస్, మూవీ మ్యాక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాయి. మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ డార్క్ కామెడీతో విభిన్నమైన పాత్రల మధ్య సాగే చిత్రమిది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పాత్రలు పోటీపడి హాస్యాన్ని పంచుతాయి. అలాగే చిత్రంలో నవరసాలను దర్శకుడు ప్రశాంత్ చక్కగా తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మంచి బాణీలను అందించారు. సంగీతంతో పాటు కెమెరా, కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి పాటలు: కిట్టు విస్సాప్రగడ, మాటలు: బి.నరేశ్ రెడ్డి. -
ది ఐరన్ లేడి
మాజీ నటి, రాజకీయ నాయకురాలు, తమిళ ప్రజల ‘పురిట్చి తలైవి’ (విప్లవ నాయకురాలు) జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో నాలుగు బయోపిక్స్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందులో దర్శకురాలు ప్రియదర్శిని తెరకెక్కించబోయే ‘ఐరన్ లేడీ’ ఒకటి. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను నిత్యా మీనన్ పోషించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ– ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకురాలు ప్రియదర్శని పంచుకున్నారు. ‘‘జయలలితగారి పాత్ర పోషించడానికి చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించాం. ఫైనల్‌గా నిత్యా మీనన్ అయితే బావుంటుందని భావించాం. నిత్యా కూడా క్యారెక్టర్‌కు బాగా సూట్ అవుతున్నారు. జయలలితగారి ఆప్త మిత్రురాలు శశికళ పాత్రకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని అనుకుంటున్నాం. మిగతా నటీనటుల పేర్లను చిత్రం ప్రారంభోత్సవం రోజు చెబుతాం’’ అన్నారు. సినిమా కథ గురించి చెబుతూ – ‘‘జయలలితగారి జీవితం మొత్తం మా సినిమాలో చూపించదలిచాం. ఆమె పుట్టినప్పటి నుంచి చివరి వరకూ (1948 నుంచి 2016 వరకూ) చిత్రకథ ఉంటుంది. సినిమాలకు, రాజకీయాలకు సమానమైన ప్రాముఖ్యతని ఇచ్చాం. ఏ ఘట్టాన్నీ పక్కన పెట్టుకోదలచుకోలేదు. జయలలితగారి అంత్యక్రియల సన్నివేశాలను కూడా చూపించనున్నాం. కానీ ఆసుపత్రిలో ఉన్న భాగాన్ని మాత్రం చూపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆ విషయం మీద కోర్ట్‌లో కేసు నడుస్తోంది. ఇన్వెస్టిగేషన్ జరిగే సమయంలో ఏది కరెక్టో సరిగ్గా చెప్పలేం. అందుకే దాన్ని చూపించదలచుకోలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత జన్మదినం రోజున ఈ చిత్రం ప్రారంభిస్తాం’’ అని ప్రియదర్శిని చెప్పుకొచ్చారు. దర్శకుడు భారతీరాజా, ఏయల్ విజయ్, లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్స్ అనౌన్స్ చేశారు. -
ఐరన్ లేడీ!
ఆ మధ్య జయలలిత మీద వరుసగా బయోపిక్స్ అనౌన్స్ చేసింది తమిళ ఇండస్ట్రీ. ఏయల్ విజయ్, ప్రియదర్శిని, భారతీరాజా దర్శకులు అనే వార్త వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురిలో దర్శకురాలు ప్రియదర్శిని ఒక అడుగు ముందుకువేసి ‘ఐరన్‌లేడీ’ అంటూ టైటిల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ బయోపిక్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ టైటిల్ రోల్ చేస్తారని సమాచారం. వచ్చే నెలలో ఓ గ్రాండ్ ఓపెనింగ్ ఫంక్షన్ నిర్వహించి, ఆ కార్యక్రమంలో నటీనటులను అనౌన్స్ చేయాలనుకుంటున్నారట. ‘‘ఎప్పటికీ తమిళుల గుండెల్లో ఉండిపోయేటువంటి జీవితాన్ని గడిపారు జయలలితగారు. ఈ సినిమా కచ్చితంగా ఆవిడకు మంచి నివాళిలా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని ప్రియదర్శిని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న జయలలిత పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నారు.