సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు ‘తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన-2015’ నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ప్రియదర్శిని, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావులు వెల్లడించారు.
మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. జొన్న, రాగి, సజ్జ, కొర్ర, వరిగ, సామ తదితర చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని ఇందులో వివరిస్తారని చెప్పారు.