ఐపీఎస్ అధికారిపై ప్రియురాలు ఫిర్యాదు | Girlfriend case against IPS Officer Varun kumar | Sakshi
Sakshi News home page

ఐపీఎస్ అధికారిపై ప్రియురాలు ఫిర్యాదు

Published Wed, Sep 24 2014 11:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

ఐపీఎస్ అధికారిపై ప్రియురాలు ఫిర్యాదు

ఐపీఎస్ అధికారిపై ప్రియురాలు ఫిర్యాదు

తిరుత్తియూరు: తిరుచ్చికి చెందిన ఐపీఎస్ అధికారి వరుణ్‌కుమార్‌పై అతని ప్రియురాలు తిరిగి పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తిరుచ్చికి చెందిన వరుణ్‌కుమార్ ఐపీఎస్ అధికారి. ఇతను చెన్నైకు చెందిన విశ్రాంత సహాయ కమిషనర్ కుమార్తె ప్రియదర్శినిని ప్రేమించాడు.  కొంతకాలానికి వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో వరుణ్‌కుమార్‌పై చెన్నై పోలీసు కమిషనర్‌కు ప్రియదర్శిని ఒక ఫిర్యాదు చేసింది. అందులో వరుణ్‌కుమార్ తనను ప్రేమించి మోసం చేశాడని, వివాహం చేసుకోవాలంటే ఖరీదైన కారు, ఎక్కువ  నగలు, నగదు కోరినట్టు పేర్కొంది.
 
 తన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అతని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పరిశీలించిన హైకోర్టు దీనిపై పరిశీలనకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు వరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం బెరుుల్‌పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలో ప్రియదర్శిని తిరిగి మంగళవారం ఫిర్యాదు చేశారు. అందులో తన ఫిర్యాదుపై వున్న కేసులో ఇంతవరకు వరుణ్‌కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని త్వరలో అతనిపై కేసు నమోదు చేయాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement