ప్రేమించి...కాదన్న 'ఐపీఎస్' | IPS officer R.V. Varun Kumar surrenders, remanded to custody | Sakshi
Sakshi News home page

ప్రేమించి...కాదన్న 'ఐపీఎస్'

Published Tue, Apr 29 2014 10:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

ప్రేమించి...కాదన్న 'ఐపీఎస్'

ప్రేమించి...కాదన్న 'ఐపీఎస్'

వరకట్నం కేసులో ఐపీఎస్ అధికారి వరుణ్‌కుమార్‌కు మే 12వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై వలసరవాక్కానికి చెందిన ప్రియదర్శిని (25) వరుణ్‌కుమార్ ప్రేమలో పడ్డారు. ఇరుకుటుంబాల అంగీకారం తో 2011లో వీరికి వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలో వధువు తరపు నుంచి నగలు, నగదు ఇవ్వడానికి నిర్ణయించారు. ఆ తర్వాత వరుణ్‌కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
 
 అనంతరం ప్రియదర్శినిని వివాహం చేసుకునేందుకు వరుణ్‌కుమార్ నిరాకరించారు. దీనిపై ప్రియదర్శిని చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో తనను వివాహం చేసుకుంటానని తెలిపి, నిశ్చ యం చేసుకున్న వరుణ్‌కుమార్ ఐపీఎస్ అధికారి కాగానే మోసగించారని తెలిపారు. అంతేకాకుండా తమ వద్ద 50 లక్షల రూపాయల నగదు, రెండు కిలోల బంగారం వరకట్నంగా కోరిన ట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు వరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుణ్ మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిలుకు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిం ది.
 
 ఇలా ఉండగా సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో చెన్నై సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో వరుణ్ సోమవారం లొంగిపోయారు. తర్వాత బెయిలు కోరుతూ అపీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచార ణ జరిపిన న్యాయమూర్తి శాంతి ఆయ న పిటిషన్‌ను తోసిపుచ్చారు. అంతేకాకుండా వరుణ్‌ను మే 12వ తేదీ వరకు కోర్టు కస్టడీలో ఉంచాల్సిందిగా ఉత్తర్వులిచ్చారు. వరుణ్ తల్లి ఒక అపీలు పిటిషన్ దాఖలు చేసి, ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా విచారణ జరపాలంటూ కోరారు. ఈ అపీల్ పిటిషన్‌పై ఈ నెల 30వ తేదీ విచారణ జరుగుతుంద ని మేనిస్ట్రేట్ ప్రకటించారు. వరుణ్ కుమార్‌ను జైలుకి తీసుకువెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement