ప్రియురాలికి బెదిరింపులు : ఐపీఎస్ పై కేసు | delhi police case filed against ips varun kumar | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి బెదిరింపులు : ఐపీఎస్ పై కేసు

Published Thu, Feb 11 2016 4:01 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

ప్రియురాలికి బెదిరింపులు : ఐపీఎస్ పై కేసు

ప్రియురాలికి బెదిరింపులు : ఐపీఎస్ పై కేసు

తిరువొత్తియూరు : మాజీ ప్రియురాలిని చంపేస్తానంటూ బెదిరించిన ఐపీఎస్ అధికారిపై ఢిల్లీ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. చెన్నైకు చెందిన ఐపీఎస్ అధికారి వరుణ్‌కుమార్, ప్రియదర్శిని చాలా కాలంగా ప్రేమించికున్నారు. అయితే పెళ్లి చేసుకునేందుకు ప్రియురాలిని వరుణ్ కుమార్ భారీగా కట్నం డిమాండ్ చేశాడు.  ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకుని విడిపోయారు. ప్రియదర్శని పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది.

దీంతో వరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని మద్రాసు హైకోర్టులో ప్రియదర్శిని పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వరుణ్ కుమార్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్న వరుణ్‌కుమార్ సస్పెండ్ అయ్యాడు. తరువాత వరుణ్‌కుమార్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అలాగే ప్రియదర్శిని కూడా ఓ  న్యాయవాదిని వివాహం చేసుకుంది.

కాగా ప్రియదర్శిని ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటోంది. ఇటీవల ప్రియదర్శిని ఇంటి సమీపంలో నడచి వెళుతుండగా ఆటోలో వచ్చిన ఓ కొంత మంది వ్యక్తులు వరుణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోవాలని బిహార్ భాషలో ఆమెను బెదిరించారు. దీంతో తీవ్ర అందోళన చెందిన ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. వారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంతో సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వరుణ్‌కుమార్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement