Varun Kumar
-
టీమిండియా ఆటగాడిపై పోక్సో కేసు
భారత జాతీయ జట్టు హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని 22 ఏళ్ల అమ్మాయి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వరుణ్‌పై కేసు నమోదు చేశారు. 2018లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వరుణ్.. అప్పటినుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను మైనర్‌నని (17 ఏళ్లు).. వరుణ్ స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణలో ఉన్నాడని యువతి ఫిర్యాదులో ప్రస్తావించింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వరుణ్ కోసం గాలిస్తున్నారు. వరుణ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు కాకముందు వరకు వరుణ్ భువనేశ్వర్‌లోని జాతీయ శిక్షణా శిబిరంలో ఉన్నట్లు తెలుస్తుంది. 28 ఏళ్ల వరుణ్ కుమార్ భారత జాతీయ జట్టు తరఫున డిఫెండర్ స్థానంలో ఆడతాడు. 2017 నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో స్టాండ్‌బై సభ్యుడిగా ఉన్నాడు. జూనియర్ స్థాయి నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న వరుణ్.. హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. టీమిండియా తరఫున 142 మ్యాచ్‌లు ఆడిన వరుణ్ మొత్తం 40 గోల్స్ చేశాడు. -
వద్దంటున్నా పెళ్లి సంబంధాలు.. సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, అనకాపల్లి: దేవరాపల్లికి చెందిన సచివాలయ ఉద్యోగి గొర్లె వరుణ్‌కుమార్(31) ఆత్మహత్య చేసుకున్నాడు. తాను వద్దని వారించినా కుటుంబీకులు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపంతో వరుణ్‌కుమార్ దేవరాపల్లిలోని తన ఇంట్లో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలివి. దేవరాపల్లికి చెందిన గొర్లె వరుణ్‌కుమార్ (31) ఇదే మండలంలోని వేచలం గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మేన్‌గా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన కుమారుడికి వివాహం చేయాలన్న ఆలోచనతో తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు కరువునాయుడు, బంధువులు వరుణ్‌కుమార్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే కొంతకాలం పెళ్లి సంబంధాలు చూడొద్దని వరుణ్‌కుమార్ నిరాకరించాడు. అయినా కుటుంబసభ్యులు తనకు సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం స్నానం చేసి వస్తానని చెప్పి ఇంటి రెండో అంతస్తులో గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. వరుణ్‌కుమార్ ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. అయితే అతను ఫోన్ ఎంతకీ తీయకపోవడంతో గది తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి శ్లాబ్ హుక్కుకి తాడుతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. చదవండి: (Bhimavaram: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్) ఊపిరి ఉందేమోనన్న ఆశతో తాడు తొలగించి కిందికి దించారు. అప్పటికే వరుణ్‌కుమార్ మృతి చెందాడని నిర్ధారించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది. మృతుడి తల్లి పైడితల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ తాతారావు, ఎ.కోడూరు ఎస్ఐ లోకేశ్వరరావు మృతుడి ఇంటికి చేరుకొని విచారణ చేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతితో తల్లితో పాటు కుటుంబ సభ్యులు పుట్టెడు దుఖంలో మునిగిపోయారు. తోటి సచివాలయ ఉద్యోగులతో పాటు గ్రామస్తులు వరుణ్‌కుమార్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పరామర్శ వరుణ్ కుమార్ మృతి చెందాడన్న విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లికి చేరుకొని మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడి తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు నాయుడు తదితర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మృతదేహానికి అనకాపల్లిలో పోస్టుమార్టం నిర్వహించి త్వరగా పంపించాలని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్లో డిప్యూటీ సీఎం ఆదేశించారు. -
వరుణ్ మృతికి హోంమంత్రే బాధ్యత వహించాలి
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురంలో పెంపుడు కుక్క తరమడం వల్ల భయంతో కాలువలో పడి మృతి చెందిన నెల్లి వరుణ్‌కుమార్ మృతికి రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పే బాధ్యత వహించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అంతే కాకుండా అందుకు కారణమైన చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు భార్యపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు అమలాపురంలో ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం ఉదయం ముట్టడించాయి. వరుణ్ మృతిపై న్యాయ పోరాట వేదిక పేరుతో ఆ ఆందోళన జరిగింది. దళిత, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా కూడా నిర్వహించారు. ఈ ఘటనపై హోం మంత్రి రాజప్ప ఎంత మాత్రం స్పందించకుండా కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి అన్నారు. వరుణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వరుణ్ మృతికి కారణమైన పెంపుడు కుక్కను స్వాధీనం చేసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.తిరుపతిరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యేను నిలదీసిన ఆందోళనకారులు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా జరుగుతున్న సమయంలో ఆ కార్యాలయానికి ఓ పని మీద వచ్చిన స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ ఘటనపై తనకు ఎవరూ వినతి పత్రం ఇవ్వలేదని ఎమ్మెల్యే అనడంతో ఆందోళనకారులు అభ్యంతరం చెప్పారు. అదేమిటి సార్... మీ ఇంటికి సమీపంలోనే...మీ కాలనీలో ఈ ఘోరం జరిగినా మీరు స్పందించే తీరు ఇదా...? అంటూ నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే ఆందోళనకారుల డిమాండ్లను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నా, ముట్టడి కార్యక్రమాల్లో జిల్లా సీపీఎం కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అమలదాసు బాబూరావు, ఐద్వా నాయకురాలు కుడుపూడి రాఘవమ్మ, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా నాగయ్య, పీడీఎం జిల్లా కన్వీనర్ దీపాటి శివప్రసాద్, సీఎస్సీ జిల్లా అధ్యక్షుడు జిల్లెళ్ల మనోహరం పాల్గొన్నారు. -
టీమిండియా గోల్స్ వర్షం!
లండన్: భారత హాకీ జూనియర్ టీమ్ ఆతిథ్య ఇంగ్లండ్ పై అద్భుత విజయాన్ని సాధించింది. మార్లోలోని బిషమ్ అబ్బే స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అజయ్ యాదవ్, వరుణ్ కుమార్ చెరో రెండు గోల్స్ తో విజృంభించడంతో 7-1 తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిచింది. భారత ఆటగాళ్లు మైదానంలో చురుకుగా కదలడంతో ఇంగ్లండ్ నుంచి సమాధానమే లేకుండా పోయింది. భారత ఆటగాళ్లలో అజయ్ యాదవ్ రెండు గోల్స్ ( 27, 43వ నిమిషాలలో), వరుణ్ కుమార్ రెండు గోల్స్ (32, 35వ నిమిషాలలో) చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగా, మన్ ప్రీత్, గుర్జంత్ సింత్, సిమ్రన్ జీత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. మన్ ప్రీత్ గోల్ తో భారత్ ఖాతా తెరవగా, అక్కడి నుంచి భారత్ గోల్స్ వర్షంతో ఇంగ్లండ్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఇంగ్లండ్ తరఫున ఎడ్ హోలర్ మాత్రమే గోల్ చేశాడు. తొలి అర్ధభాగం వరకు 4-1 ఆధిక్యంలో ఉన్న భారత ఆటగాళ్లు రెండో అర్ధభాగంలోనూ గోల్ పోస్టులపై పదే పదే దాడులు చేస్తూ ఆధిపత్యాన్ని మరింత పెంచుకున్నారు. -
ప్రియురాలికి బెదిరింపులు : ఐపీఎస్ పై కేసు
తిరువొత్తియూరు : మాజీ ప్రియురాలిని చంపేస్తానంటూ బెదిరించిన ఐపీఎస్ అధికారిపై ఢిల్లీ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. చెన్నైకు చెందిన ఐపీఎస్ అధికారి వరుణ్‌కుమార్, ప్రియదర్శిని చాలా కాలంగా ప్రేమించికున్నారు. అయితే పెళ్లి చేసుకునేందుకు ప్రియురాలిని వరుణ్ కుమార్ భారీగా కట్నం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకుని విడిపోయారు. ప్రియదర్శని పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని మద్రాసు హైకోర్టులో ప్రియదర్శిని పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వరుణ్ కుమార్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్న వరుణ్‌కుమార్ సస్పెండ్ అయ్యాడు. తరువాత వరుణ్‌కుమార్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అలాగే ప్రియదర్శిని కూడా ఓ న్యాయవాదిని వివాహం చేసుకుంది. కాగా ప్రియదర్శిని ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటోంది. ఇటీవల ప్రియదర్శిని ఇంటి సమీపంలో నడచి వెళుతుండగా ఆటోలో వచ్చిన ఓ కొంత మంది వ్యక్తులు వరుణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకోవాలని బిహార్ భాషలో ఆమెను బెదిరించారు. దీంతో తీవ్ర అందోళన చెందిన ఆమె ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. వారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంతో సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వరుణ్‌కుమార్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఐపీఎస్ అధికారిపై ప్రియురాలు ఫిర్యాదు
తిరుత్తియూరు: తిరుచ్చికి చెందిన ఐపీఎస్ అధికారి వరుణ్‌కుమార్‌పై అతని ప్రియురాలు తిరిగి పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తిరుచ్చికి చెందిన వరుణ్‌కుమార్ ఐపీఎస్ అధికారి. ఇతను చెన్నైకు చెందిన విశ్రాంత సహాయ కమిషనర్ కుమార్తె ప్రియదర్శినిని ప్రేమించాడు. కొంతకాలానికి వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలో వరుణ్‌కుమార్‌పై చెన్నై పోలీసు కమిషనర్‌కు ప్రియదర్శిని ఒక ఫిర్యాదు చేసింది. అందులో వరుణ్‌కుమార్ తనను ప్రేమించి మోసం చేశాడని, వివాహం చేసుకోవాలంటే ఖరీదైన కారు, ఎక్కువ నగలు, నగదు కోరినట్టు పేర్కొంది. తన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అతని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పరిశీలించిన హైకోర్టు దీనిపై పరిశీలనకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు వరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం బెరుుల్‌పై విడుదల అయ్యాడు. ఈ క్రమంలో ప్రియదర్శిని తిరిగి మంగళవారం ఫిర్యాదు చేశారు. అందులో తన ఫిర్యాదుపై వున్న కేసులో ఇంతవరకు వరుణ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని త్వరలో అతనిపై కేసు నమోదు చేయాలని పేర్కొంది. -
ప్రేమించి...కాదన్న 'ఐపీఎస్'
వరకట్నం కేసులో ఐపీఎస్ అధికారి వరుణ్‌కుమార్‌కు మే 12వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై వలసరవాక్కానికి చెందిన ప్రియదర్శిని (25) వరుణ్‌కుమార్ ప్రేమలో పడ్డారు. ఇరుకుటుంబాల అంగీకారం తో 2011లో వీరికి వివాహం నిశ్చయమైంది. ఆ సమయంలో వధువు తరపు నుంచి నగలు, నగదు ఇవ్వడానికి నిర్ణయించారు. ఆ తర్వాత వరుణ్‌కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అనంతరం ప్రియదర్శినిని వివాహం చేసుకునేందుకు వరుణ్‌కుమార్ నిరాకరించారు. దీనిపై ప్రియదర్శిని చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో తనను వివాహం చేసుకుంటానని తెలిపి, నిశ్చ యం చేసుకున్న వరుణ్‌కుమార్ ఐపీఎస్ అధికారి కాగానే మోసగించారని తెలిపారు. అంతేకాకుండా తమ వద్ద 50 లక్షల రూపాయల నగదు, రెండు కిలోల బంగారం వరకట్నంగా కోరిన ట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు వరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరుణ్ మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిలుకు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిం ది. ఇలా ఉండగా సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో చెన్నై సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో వరుణ్ సోమవారం లొంగిపోయారు. తర్వాత బెయిలు కోరుతూ అపీలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచార ణ జరిపిన న్యాయమూర్తి శాంతి ఆయ న పిటిషన్‌ను తోసిపుచ్చారు. అంతేకాకుండా వరుణ్‌ను మే 12వ తేదీ వరకు కోర్టు కస్టడీలో ఉంచాల్సిందిగా ఉత్తర్వులిచ్చారు. వరుణ్ తల్లి ఒక అపీలు పిటిషన్ దాఖలు చేసి, ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా విచారణ జరపాలంటూ కోరారు. ఈ అపీల్ పిటిషన్‌పై ఈ నెల 30వ తేదీ విచారణ జరుగుతుంద ని మేనిస్ట్రేట్ ప్రకటించారు. వరుణ్ కుమార్‌ను జైలుకి తీసుకువెళ్లారు.