టీమిండియా గోల్స్ వర్షం! | India junior men's hockey team beat England 7-1 | Sakshi
Sakshi News home page

టీమిండియా గోల్స్ వర్షం!

Published Fri, Jul 29 2016 12:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

టీమిండియా గోల్స్ వర్షం!

టీమిండియా గోల్స్ వర్షం!

లండన్: భారత హాకీ జూనియర్ టీమ్ ఆతిథ్య ఇంగ్లండ్ పై అద్భుత విజయాన్ని సాధించింది. మార్లోలోని బిషమ్ అబ్బే స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అజయ్ యాదవ్, వరుణ్ కుమార్ చెరో రెండు గోల్స్ తో విజృంభించడంతో 7-1 తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిచింది. భారత ఆటగాళ్లు మైదానంలో చురుకుగా కదలడంతో ఇంగ్లండ్ నుంచి సమాధానమే లేకుండా పోయింది.

భారత ఆటగాళ్లలో అజయ్ యాదవ్ రెండు గోల్స్ ( 27, 43వ నిమిషాలలో), వరుణ్ కుమార్ రెండు గోల్స్ (32, 35వ నిమిషాలలో) చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగా, మన్ ప్రీత్, గుర్జంత్ సింత్, సిమ్రన్ జీత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. మన్ ప్రీత్ గోల్ తో భారత్ ఖాతా తెరవగా, అక్కడి నుంచి భారత్ గోల్స్ వర్షంతో ఇంగ్లండ్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఇంగ్లండ్ తరఫున ఎడ్ హోలర్ మాత్రమే గోల్ చేశాడు. తొలి అర్ధభాగం వరకు 4-1 ఆధిక్యంలో ఉన్న భారత ఆటగాళ్లు రెండో అర్ధభాగంలోనూ గోల్ పోస్టులపై పదే పదే దాడులు చేస్తూ ఆధిపత్యాన్ని మరింత పెంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement