junior hockey
-
ఫైనల్లో టీమిండియా సంచలన విజయం.. టైటిల్ సొంతం
జపాన్‌లో జరిగిన మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్లో సంచలనం నమోదైంది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఫోర్ టైమ్ ఛాంపియన్స్ దక్షిణ కొరియాకు షాకిచ్చారు. తుది పోరులో టీమిండియా.. 2-1 గోల్స్ తేడాతో సౌత్ కొరియాను ఖంగుతినిపించి, తొలిసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. The winning moments ✨️ Here a glimpse of the winning moments after the victory in the Final of Women's Junior Asia Cup 2023.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/ZJSwVI80iH — Hockey India (@TheHockeyIndia) June 11, 2023 అన్నూ 22వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా.. ఆతర్వాత సౌత్ కొరియా తరఫున 25వ నిమిషంలో పార్క్ సియో ఇయోన్ గోల్ చేసి స్కోర్‌ను సమం చేసింది. అనంతరం రెండో అర్ధభాగం 41వ నిమిషంలో నీలమ్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేసి మరోసారి భారత్‌కు ఆధిక్యం అందించింది. దీని తర్వాత సౌత్ కొరియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, భారత అమ్మాయిలు అద్భుతమైన డిఫెన్స్‌తో వారిని అడ్డుకున్నారు. 🇮🇳 2-1 🇰🇷 Our girls create HISTORY💥 India defeats 4-time champions South Korea in an intriguing final to lift its first-ever Women's Junior Hockey Asia Cup title!#Hockey 🏑| #AsiaCup2023 pic.twitter.com/bSpdo2VB5N — The Bridge (@the_bridge_in) June 11, 2023 రెండో అర్ధభాగం చివరి నిమిషం వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయినా సౌత్ కొరియా అమ్మాయిలకు ఫలితం దక్కలేదు. దీంతో జూనియర్ విభాగంలో భారత్ అమ్మాయిలు తొలిసారి ఆసియా ఛాంపియన్లుగా అవతరించారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంతో దిగాలుగా ఉన్న అభిమానులకు ఈ విజయం ఊరటనిచ్చింది. భారత మహిళల జూనియర్ హాకీ టీమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
Junior Asia Cup 2023: ఫైనల్లో భారత్
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 9–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ధామి బాబీ సింగ్ (31వ, 39, 55వ ని.లో) మూడో గోల్స్ సాధించగా... సునీల్ లాక్రా (13వ ని.లో), అరైజీత్ సింగ్ (19వ ని.లో), అంగద్‌బీర్ సింగ్ (34వ ని.లో), ఉత్తమ్ సింగ్ (38వ ని.లో), విష్ణుకాంత్ సింగ్ (51వ ని.లో), శ్రద్ధానంద్ తివారీ (57వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. కొరియా తరఫున కియోన్యోల్ వాంగ్ (46వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. పాకిస్తాన్, మలేసియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేత జట్టుతో నేడు జరిగే ఫైనల్లో భారత్ తలపడతుంది. -
Asia Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
Men's Junior Asia Cup Hockey 2023 సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య శనివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్ తరఫున శ్రద్ధానంద్ తివారి (24వ ని.లో), పాకిస్తాన్ తరఫున అలీ బషారత్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్, పాకిస్తాన్ జట్లకు ఇదే తొలి ‘డ్రా’ కావడం గమనార్హం. మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారత్, పాక్ జట్లు 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌తో భారత్; జపాన్‌తో పాకిస్తాన్ తలపడతాయి. నేడు భారత్, పాక్ తమ మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
Junior Asia Cup: చైనీస్ తైపీని 18-0 తేడాతో చిత్తు చేసిన భారత్
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ భారీ విజయంతో బోణీ కొట్టింది. చైనీస్ తైపీతో బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా గోల్స్ వర్షం కురిపించి 18–0తో గెలుపొందింది. భారత ఆటగాళ్ల ధాటికి చైనీస్ తైపీ ఆటగాళ్లు చేతులెత్తేశారు. భారత్ తరఫున అరైజీత్ సింగ్ హుండల్ (19వ, 19వ, 30వ, 59వ ని.లో) నాలుగు గోల్స్... అమన్‌దీప్ (38వ, 39వ, 41వ ని.లో) మూడు గోల్స్ సాధించారు. బాబీ సింగ్ ధామి (10వ, 46వ ని.లో), ఆదిత్య అర్జున్ లలాగే (37వ, 37వ ని.లో), కెప్టెన్ ఉత్తమ్ సింగ్ (10వ, 59వ ని.లో) రెండు గోల్స్ చొప్పున చేశారు. శ్రద్ధానంద్ తివారి (11వ ని.లో), అంగద్‌బీర్ సింగ్ (37వ ని.లో), అమీర్ అలీ (51వ ని.లో), బాబీ పూవణ్ణ చంద్ర (54వ ని.లో), యోగాంబర్ (60వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. ఈ టోర్నీ విజేత జూనియర్ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. -
ఫైనల్లో ఆసీస్‌పై విజయం.. మూడోసారి విజేతగా నిలిచిన భారత్
కౌలాలంపూర్: సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో భారత జట్టు మూడో సారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 5–4తో ఆ్రస్టేలియాపై నెగ్గి 2014 తర్వాత ఈ టోర్నీలో మళ్లీ టైటిల్ సొంతం చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలువడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. భారత్ తరఫున సుదీప్ చిర్మాకో (14వ నిమిషం) గోల్ చేయగా.. ఆసీస్ తరఫున జాక్ హాలండ్ 29వ నిమిషంలో గోల్ చేశాడు. టైటిల్ నెగ్గిన భారత జట్టులోని సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. భారత్.. 2013, 2014ల్లో ఈ ట్రోఫీ నెగ్గింది. -
భారత్ శుభారంభం
జొహర్ బారు (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 3–2తో జపాన్ను ఓడించింది. భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (11వ, 53వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుఖ్జీత్ సింగ్ (41వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. జపాన్ జట్టుకు క్యోహి ఒగవా (23వ, 31వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. సోమవారం జరిగే తమ రెండో లీగ్ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
ఇదేం నజరానా?
ప్రపంచ కప్ గెలిపించిన కోచ్‌కు రూ.25 వేలా! న్యూఢిల్లీ: ప్రపంచకప్ గెలిపించిన చీఫ్ కోచ్‌కు రూ. 25 వేలు, ఆటగాడికి రూ. 10 వేలు... ఇదేం నజరానానో అంతుచిక్కడం లేదు. కానీ ఎయిరిండియా మాత్రం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు... అన్న చందంగా ఘనంగా ప్రకటించింది. భారత్ ఆతిథ్యమిచ్చిన జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగులైన చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్‌కు రూ.25 వేలు, స్ట్రయికర్ అర్మాన్ ఖురేషీకి రూ. 10 ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు ఎయిరిండియా చైర్మన్ అశ్వని లోహని ప్రకటించారు. ఇంత తక్కువ మొత్తాన్ని అదో గొప్ప విషయమన్నట్టు ఆయన చెప్పుకోవడం విస్మయానికి గురిచేసింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన యువ క్రికెటర్ జయంత్ యాదవ్‌ను గురువారం జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. ఇతని తండ్రి ఎయిరిండియా ఉద్యోగి కావడంతో సన్మానించారు. -
జూనియర్ భారత్ హాకీ జట్టుకు అసలు పరీక్ష
-
25న హాకీ బాలికల జూనియర్స్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హాకీ జూనియర్స్ స్థాయి బాలికల ఎంపిక పోటీలను ఈనెల 25వ తేదీన హన్మకొండలోని ఎన్‌యూసీ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలికలు తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు నల్లగొండలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే వారు జనవరి 1, 1998 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన వారు 25న ఉదయం 8 గంటలకు పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రాలను తీసుకుని హాకీ క్లబ్లో హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 90002–82185 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
టీమిండియా గోల్స్ వర్షం!
లండన్: భారత హాకీ జూనియర్ టీమ్ ఆతిథ్య ఇంగ్లండ్ పై అద్భుత విజయాన్ని సాధించింది. మార్లోలోని బిషమ్ అబ్బే స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అజయ్ యాదవ్, వరుణ్ కుమార్ చెరో రెండు గోల్స్ తో విజృంభించడంతో 7-1 తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిచింది. భారత ఆటగాళ్లు మైదానంలో చురుకుగా కదలడంతో ఇంగ్లండ్ నుంచి సమాధానమే లేకుండా పోయింది. భారత ఆటగాళ్లలో అజయ్ యాదవ్ రెండు గోల్స్ ( 27, 43వ నిమిషాలలో), వరుణ్ కుమార్ రెండు గోల్స్ (32, 35వ నిమిషాలలో) చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగా, మన్ ప్రీత్, గుర్జంత్ సింత్, సిమ్రన్ జీత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. మన్ ప్రీత్ గోల్ తో భారత్ ఖాతా తెరవగా, అక్కడి నుంచి భారత్ గోల్స్ వర్షంతో ఇంగ్లండ్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఇంగ్లండ్ తరఫున ఎడ్ హోలర్ మాత్రమే గోల్ చేశాడు. తొలి అర్ధభాగం వరకు 4-1 ఆధిక్యంలో ఉన్న భారత ఆటగాళ్లు రెండో అర్ధభాగంలోనూ గోల్ పోస్టులపై పదే పదే దాడులు చేస్తూ ఆధిపత్యాన్ని మరింత పెంచుకున్నారు.