
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 9–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత్ తరఫున ధామి బాబీ సింగ్ (31వ, 39, 55వ ని.లో) మూడో గోల్స్ సాధించగా... సునీల్ లాక్రా (13వ ని.లో), అరైజీత్ సింగ్ (19వ ని.లో), అంగద్‌బీర్ సింగ్ (34వ ని.లో), ఉత్తమ్ సింగ్ (38వ ని.లో), విష్ణుకాంత్ సింగ్ (51వ ని.లో), శ్రద్ధానంద్ తివారీ (57వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. కొరియా తరఫున కియోన్‌యోల్ వాంగ్ (46వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. పాకిస్తాన్, మలేసియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేత జట్టుతో నేడు జరిగే ఫైనల్లో భారత్ తలపడతుంది.
Comments
Please login to add a commentAdd a comment