asia cup hockey
-
హాకీ ఫైవ్స్ విజేత భారత్
సలాలా (ఒమన్): ఆసియా కప్ హాకీ ఫైవ్స్ టోర్నమెంట్లో భారత పురుషుల హాకీ జట్టు విజేతగా నిలిచింది. ఐదుగురు సభ్యులు ఆడే ఈ టోర్నీని ఈ ఏడాదే ప్రారంభించగా... శనివారం జరిగిన ఫైనల్లో భారత్ ‘షూటౌట్’లో 2–0తో పాకిస్తాన్‌పై గెలిచింది. చాంపియన్‌గా నిలిచిన భారత్ వచ్చే ఏడాది జరిగే హాకీ ఫైవ్స్ ప్రపంచకప్‌కు అర్హత సంపాదించింది. తుదిపోరులో నిర్ణీత సమయంలో రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. భారత జట్టులో మొహమ్మద్ రహీల్ (19వ, 26వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (7వ ని.లో), మణిందర్ సింగ్ (10వ ని.లో) గోల్స్ చేశారు. పాక్ తరఫున రెహా్మన్ (5వ ని.లో), అబ్దుల్ (13వ ని.లో), హయత్ (14వ ని.లో), అర్షద్ (19వ ని.లో) గోల్ చేశారు. విజేతగా నిలిచిన భారత జట్టులోని సభ్యులకు రూ. 2 లక్షలు చొప్పున, శిక్షణ సహాయక సిబ్బందికి రూ. ఒక లక్ష చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది. -
Asia Cup 2023: పాక్‌పై టీమిండియా గెలుపు
ఆసియా కప్ 5s హాకీ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 2) జరిగిన ఫైనల్లో భారత్ 6-4 గోల్స్ తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంలో భారత్, పాక్‌లు చెరి 4 గోల్స్ చేయడంతో పెనాల్టీ షూటౌట్స్ ద్వారా ఫలితం తేలింది. షూటౌట్స్‌లో భారత్ రెండు అటెంప్ట్స్‌ను గోల్స్‌గా మలిచి, ఛాంపియన్‌గా అవతరించింది. 5s ఫార్మాట్లో భారత్ పాక్‌ను ఓడించడం మూడు సందర్భాల్లో ఇదే మొదటిసారి. India beat Pakistan in Men's Hockey 5s Asia Cup Final. pic.twitter.com/VyKC6aG06S — Azhutozh ⚕ (@azhutozh) September 2, 2023 సెకెండాఫ్‌లో 2-4 గోల్స్ తేడాతో వెనుకంజలో ఉండిన భారత్.. అనూహ్యంగా పుంజుకుని, షూటౌట్స్ వరకు వెళ్లి విజేతగా నిలిచింది. షూటౌట్స్‌లో పాక్ రెండు ప్రయత్నాల్లో విఫలం కాగా.. గుర్జోత్ సింగ్, మణిందర్ సింగ్‌లు తలో గోల్ చేసి, భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అంతకుముందు భారత్ 2-4 గోల్స్‌తో వెనుకపడి ఉన్నప్పుడు మొహమ్మద్ రహీల్ 2 గోల్స్ చేసి, మ్యాచ్ డ్రా అయ్యేందుకు దోహదపడ్డాడు. Maninder Singh scores the second goal in shoot-out as India clinches Hockey 5s Asia Cup title defeating Pakistan. Both teams were 4-4 tied in normal time before India won the shootout 2-0.#Hockey5sAsiaCup #HockeyIndia pic.twitter.com/SWncUcVxnn — Pritish Raj (@befikramusafir) September 2, 2023 -
ఫైనల్లో టీమిండియా సంచలన విజయం.. టైటిల్ సొంతం
జపాన్‌లో జరిగిన మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్లో సంచలనం నమోదైంది. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఫోర్ టైమ్ ఛాంపియన్స్ దక్షిణ కొరియాకు షాకిచ్చారు. తుది పోరులో టీమిండియా.. 2-1 గోల్స్ తేడాతో సౌత్ కొరియాను ఖంగుతినిపించి, తొలిసారి ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. The winning moments ✨️ Here a glimpse of the winning moments after the victory in the Final of Women's Junior Asia Cup 2023.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/ZJSwVI80iH — Hockey India (@TheHockeyIndia) June 11, 2023 అన్నూ 22వ నిమిషంలో గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా.. ఆతర్వాత సౌత్ కొరియా తరఫున 25వ నిమిషంలో పార్క్ సియో ఇయోన్ గోల్ చేసి స్కోర్‌ను సమం చేసింది. అనంతరం రెండో అర్ధభాగం 41వ నిమిషంలో నీలమ్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేసి మరోసారి భారత్‌కు ఆధిక్యం అందించింది. దీని తర్వాత సౌత్ కొరియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, భారత అమ్మాయిలు అద్భుతమైన డిఫెన్స్‌తో వారిని అడ్డుకున్నారు. 🇮🇳 2-1 🇰🇷 Our girls create HISTORY💥 India defeats 4-time champions South Korea in an intriguing final to lift its first-ever Women's Junior Hockey Asia Cup title!#Hockey 🏑| #AsiaCup2023 pic.twitter.com/bSpdo2VB5N — The Bridge (@the_bridge_in) June 11, 2023 రెండో అర్ధభాగం చివరి నిమిషం వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయినా సౌత్ కొరియా అమ్మాయిలకు ఫలితం దక్కలేదు. దీంతో జూనియర్ విభాగంలో భారత్ అమ్మాయిలు తొలిసారి ఆసియా ఛాంపియన్లుగా అవతరించారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంతో దిగాలుగా ఉన్న అభిమానులకు ఈ విజయం ఊరటనిచ్చింది. భారత మహిళల జూనియర్ హాకీ టీమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
Junior Asia Cup 2023: ఫైనల్లో భారత్
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 9–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ధామి బాబీ సింగ్ (31వ, 39, 55వ ని.లో) మూడో గోల్స్ సాధించగా... సునీల్ లాక్రా (13వ ని.లో), అరైజీత్ సింగ్ (19వ ని.లో), అంగద్‌బీర్ సింగ్ (34వ ని.లో), ఉత్తమ్ సింగ్ (38వ ని.లో), విష్ణుకాంత్ సింగ్ (51వ ని.లో), శ్రద్ధానంద్ తివారీ (57వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. కొరియా తరఫున కియోన్యోల్ వాంగ్ (46వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. పాకిస్తాన్, మలేసియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేత జట్టుతో నేడు జరిగే ఫైనల్లో భారత్ తలపడతుంది. -
సెమీస్‌లో భారత్.. థాయ్‌లాండ్‌పై 17–0తో ఘన విజయం
సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్ జట్టుతో ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అంగద్‌బీర్ సింగ్ (13వ, 33వ, 47వ ని.లో) మూడు గోల్స్ చేయగా... అమన్‌దీప్ లాక్రా (26వ, 29వ ని.లో), ఉత్తమ్ సింగ్ (24వ, 31వ ని.లో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. శ్రద్ధానంద్ తివారి (46వ ని.లో), యోగంబర్ రావత్ (17వ ని.లో), అమన్‌దీప్ (47వ ని.లో), రోహిత్ (49వ ని.లో), అరైజీత్ సింగ్ హుండల్ (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు విజయాలు, ఒక ‘డ్రా’తో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పూల్ ‘ఎ’లో నేడు జపాన్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతకు మరో సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. మ్యాచ్ ‘డ్రా’ అయితే పాకిస్తాన్ ముందంజ వేస్తుంది. -
Asia Cup 2023: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
Men's Junior Asia Cup Hockey 2023 సలాలా (ఒమన్): ఆసియా కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య శనివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్ తరఫున శ్రద్ధానంద్ తివారి (24వ ని.లో), పాకిస్తాన్ తరఫున అలీ బషారత్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్, పాకిస్తాన్ జట్లకు ఇదే తొలి ‘డ్రా’ కావడం గమనార్హం. మూడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత భారత్, పాక్ జట్లు 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో థాయ్‌లాండ్‌తో భారత్; జపాన్‌తో పాకిస్తాన్ తలపడతాయి. నేడు భారత్, పాక్ తమ మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
ఉత్కంఠపోరులో జపాన్‌పై విజయం.. టీమిండియా హాకీ జట్టుకు కాంస్య పతకం
హాకీ ఆసియాకప్ 2022లో ఫైనల్ చేరడంలో విఫలమైన టీమిండియా పరుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక పోరులో భాగంగా బుధవారం జపాన్‌తో జరిగిన హై వోల్టేజీ మ్యాచ్‌లో 1-0తో భారత్ జయకేతనం ఎగురవేసింది. టీమిండియా తరపున ఆట ఏడో నిమిషంలో రాజ్‌కుమార్ పాల్ గోల్ చేశాడు. ఆ తర్వాత మూడు క్వార్టర్ల పాటు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. జపాన్ పలుమార్లు గోల్‌పోస్ట్ వైపు దాడులు చేసినప్పటికి టీమిండియా డిఫెన్స్ బలంగా ఉండడంతో నిర్ణీత సమయంలోగా జపాన్ గోల్ చేయడంలో చతికిలపడింది. దీంతో భారత్ ఖాతాలో విజయంతో పాటు కాంస్య పతకం వచ్చి చేరింది. ఇక మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 4-4తో డ్రా చేసుకోవడంతో ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక హాకీ ఆసియా కప్ విజేతగా దక్షిణ కొరియా నిలిచింది. మలేషియాతో జరిగిన ఫైనల్లో 2-1తో విజయం అందుకొని స్వర్ణ పతకం సాధించింది. చదవండి: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా Hockey Asia Cup 2022: టీమిండియా హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం Let us applaud the young Indian Team for their outstanding performance in the Hero Asia Cup 2022, Jakarta, Indonesia for winning a Bronze. 🥉 We are proud of this team 💙#IndiaKaGame #HockeyIndia #MatchDay #INDvsJPN @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/ptTFDJo7Y5 — Hockey India (@TheHockeyIndia) June 1, 2022 -
టీమిండియా హాకీ జట్టును వెంటాడిన దురదృష్టం..
మెన్స్ హాకీ ఆసియాకప్‌లో టీమిండియా పురుషుల హాకీ జట్టును దురదృష్టం వెంటాడింది. గోల్స్ తేడా కారణంగా టీమిండియా ఫైనల్ చేరకుండానే సూపర్-4లోనే నిష్క్రమించింది. సూపర్-4లో భాగంగా మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 4-4తో డ్రా చేసుకుంది. దీంతో భారత్, కొరియా ఖాతాలో చెరో ఐదు పాయింట్లు చేరాయి. అయితే జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మలేషియా విజయం సాధించడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. జపాన్‌పై విజయంతో మలేషియా ఖాతాలోనూ ఐదు పాయింట్లు చేరాయి. మూడు జట్లు ఐదు పాయింట్లతో సూపర్-4ను ముగించినప్పటికి మెరుగైన గోల్స్ ఉన్న కారణంగా మలేషియా, కొరియాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఇక మూడో స్థానం కోసం భారత్.. జపాన్‌తో జూన్ 1న తలపడనుంది. అదే రోజు మలేషియా, దక్షిణ కొరియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. A scintillating game ends in a DRAW!! 💙 IND 4:4 KOR #IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsKOR @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/eor7QdAZuB — Hockey India (@TheHockeyIndia) May 31, 2022 -
దక్షిణ కొరియాతో భారత్ పోరు.. ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...!
జకార్తా: మలేసియాతో గెలవాల్సిన మ్యాచ్‌ను ఆఖరి నిమిషాల్లో ‘డ్రా’ చేసుకున్న భారత్ ఆసియా కప్ హాకీ టోర్నీ సూపర్–4 రౌండ్ రాబిన్ లీగ్ చివరి మ్యాచ్‌లో నేడు దక్షిణ కొరియాతో తలపడనుంది. ఎలాంటి సమీకరణాలపై ఆధారపడకుండా దక్షిణ కొరియాపై విజయం సాధించి దర్జాగా ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. లీగ్ దశలోని రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య సూపర్–4 రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. సూపర్–4 రౌండ్ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ చేరుకుంటాయి. ప్రస్తుతం రెండు మ్యాచ్‌లు ముగిశాక కొరియా, భారత్ ఖాతాలో నాలుగు పాయింట్ల చొప్పున సమంగా ఉన్నాయి. మెరుగైన గోల్స్ సగటుతో కొరియా తొలి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. రెండు పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, పాయింట్లేమీ సాధించని జపాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఫైనల్ రేసు నుంచి జపాన్ నిష్క్రమించగా... నేడు జపాన్‌తో జరిగే మ్యాచ్‌లో మలేసియా గెలిస్తే ఆ జట్టు పాయింట్ల సంఖ్య ఐదుకు చేరుకుంటుంది. ఒకవేళ జపాన్‌తో మ్యాచ్‌ను మలేసియా ‘డ్రా’ చేసుకున్నా, లేదా ఓడిపోయినా... భారత్, కొరియా జట్లకు తమ మ్యాచ్‌కు ముందే ఫైనల్ బెర్త్‌లు ఖరారవుతాయి. చదవండి: ఐదేళ్ల స్నేహం! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు -
ఆసియా కప్ ఫైనల్ రేసులో భారత్...
జకార్తా: డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్లో ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. సూపర్–4 సెమీఫైనల్ లీగ్‌లో భాగంగా మలేసియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌ను భారత్ 3–3 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. ఒకదశలో భారత్ 0–2తో వెనుకబడి ఆ తర్వాత తేరుకొని 3–2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా టీమిండియా గోల్ సమర్పించుకొని విజయం సాధించాల్సిన చోట ‘డ్రా’తో సంతృప్తి పడింది. మలేసియా ప్లేయర్ రజీ రహీమ్ (12వ, 21వ, 56వ ని.లో) ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో తమ జట్టుకు ఓటమి తప్పించాడు. టీమిండియా తరఫున విష్ణుకాంత్ సింగ్ (32వ ని.లో), సునీల్ (53వ ని.లో), జెస్ నీలమ్ సంజీప్ (55వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 3–1తో జపాన్ను ఓడించింది. ప్రస్తుతం పట్టికలో కొరియా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండింటిలో ఓడిన జపాన్ ఫైనల్ రేసుకు దూరమైంది. మంగళవారం జరిగే చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో జపాన్‌తో మలేసియా; కొరియాతో భారత్ తలపడతాయి. ఆఖరి మ్యాచ్‌లో జపాన్‌పై మలేసియా గెలిస్తే... భారత్–కొరియా మ్యాచ్‌లో నెగ్గిన జట్టు మలేసియాతో కలిసి ఫైనల్ చేరుతుంది. ఒకవేళ భారత్–కొరియా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే... భారత్, కొరియా, మలేసియా జట్లలో మెరుగైన గోల్స్ సగటు ఉన్న రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి. -
Asia Cup hockey: లెక్క సరిచేసిన భారత్
జకార్తా: లీగ్ దశలో జపాన్ జట్టు చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంటూ ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీ సూపర్–4 సెమీఫైనల్ లీగ్‌లో భారత్ శుభారంభం చేసింది. 2018 ఆసియా క్రీడల చాంపియన్ జపాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో డిఫెడింగ్ చాంపియన్ భారత్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున మంజీత్ (8వ ని.లో), పవన్ రాజ్‌భర్ (35వ ని.లో) ఒక్కో గోల్ సాధించగా... జపాన్ జట్టుకు టకుమా నివా (18వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. నేడు జరిగే సూపర్–4 రెండో మ్యాచ్‌లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
జపాన్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. సూపర్ 4 లీగ్ మ్యాచ్‌లో విజయం
ఆసియా కప్ హాకీలో తొలి సూపర్ 4 లీగ్ మ్యాచ్‌లో జపాన్‌పై 2-1 తేడాతో భారత హాకీ పురుషుల జట్టు విజయం సాధించింది. పూల్ దశలో జపాన్‌పై ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత్ తరపున మంజీత్, పవన్ రాజ్‌భర్ చెరో గోల్ సాధించారు. ఇక మ్యాచ్ 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా జపాన్‌కు ఏకైక గోల్ వచ్చింది. జపాన్ మొదట దూకుడుగా ఆడింది. మ్యాచ్ ప్రారంభ నిమిషంలోనే జపాన్ పెనాల్టీ కార్నర్ సాధించింది. అయితే పెనాల్టీ కార్నర్లో జపాన్ ఎటువంటి గోల్ సాధించలేకపోయింది. అనంతరం భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించింది. ఇక భారత్ తన తదుపరి సూపర్ 4 దశ మ్యాచ్‌లో ఆదివారం మలేషియాతో తలపడనుంది. చదవండి: Carlos Alzaraz: ఫ్రెంచ్ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల కుర్రాడు .. జొకోవిచ్ తర్వాత -
16 గోల్స్‌తో టీమిండియా హాకీ జట్టు కొత్త చరిత్ర.. సూపర్ 4కు అర్హత
ఆసియా కప్ హాకీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత హాకీ పురుషుల జట్టు జూలు విదిల్చింది. పూల్-ఏలో భాగంగా ఇండోనేషియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఏకంగా 16-0 తో రెచ్చిపోయిన భారత పురుషుల జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. టీమిండియా తరపున డిస్పన్ టిర్కీ 4 గోల్స్ కొట్టగా.. సుదేవ్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. సెల్వం, పవన్, వెటరన్ ఆటగాడు ఎస్వీ సునీల్‌లు కీలక సమయాల్లో గోల్స్‌తో మెరిసి భారత్‌కు విజయం అందించారు. ఇక పురుషుల ఆసియా హాకీ కప్ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. కాగా ఇండోనేషియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఓపెనింగ్ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-5తో ఓడి సూపర్-4 అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఇండోనేషియాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో 15 గోల్స్ కొడితే గాని భారత్‌కు సూపర్-4కు అర్హత సాధించే అవకాశం ఉండేది. అదే సమయంలో జపాన్ చేతిలో పాకిస్తాన్ కూడా ఓటమి పాలవ్వాలి. ఇక్కడే మనకు అదృష్టం కలిసొచ్చింది. జపాన్ చేతిలో పాకిస్తాన్ ఓటమి చెందడం.. ఇండోనేషియాతో మ్యాచ్‌లో అనుకున్నదానికంటే ఒక గోల్ ఎక్కువే కొట్టిన టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకొని సూపర్-4లో అడుగుపెట్టింది. కాగా జపాన్ చేతిలో ఓటమితో 2023 హాకీ వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ అర్హత సాధించలేకపోయింది. అదే సమయంలో జపాన్, కొరియా మలేషియాలు 2023 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. మరోవైపు 2023 హాకీ వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో ఆతిథ్య హోదాలో భారత పురుషుల హాకీ జట్టు ఇప్పటికే అర్హత సాధించింది. చదవండి: Barbora Krejcikova: 'మోస్ట్ అన్‌లక్కీ'.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఔట్ Magnificent game for #MenInBlue as they mark a big win against Indonesia at the Hero Asia Cup 2022 to qualify for the Super 4s of the Hero Asia Cup 2022!😍#IndiaKaGame #HockeyIndia #HeroAsiaCup #MatchDay #INDvsINA @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI pic.twitter.com/TJOEixswSk — Hockey India (@TheHockeyIndia) May 26, 2022 -
ఆఖరి నిమిషంలో భారత్‌కు షాకిచ్చిన పాక్.. తొలి మ్యాచ్ డ్రా
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్ జట్టు చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా ముగించింది. జకార్తా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అఖరి నిమిషం వరకు భారత్ పాక్‌పై ఆదిపత్యం చెలాయించింది. ఫస్ట్ హాఫ్ 8వ నిమిషంలో కార్తీ సెల్వం తొలి గోల్ చేసి భారత్‌ను అధిక్యంలోకి తీసుకువెళ్లాడు. అయితే చివరి క్వార్టర్ అఖరి నిమిషంలో పాక్ ఆటగాడు అబ్దుల్ రానా గోల్ సాధించి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. మరోవైపు మలేషియా, దక్షిణ కొరియా తమ తొలి మ్యాచ్‌ల్లో ఒమన్, బంగ్లాదేశ్‌లపై విజమం సాధించాయి. మలేషియా 7-0తో ఒమన్‌ను ఓడించగా, కొరియా 6-1తో బంగ్లాదేశ్‌పై గెలిపొందింది. ఇక మంగళవారం(మే 24)న జపాన్‌తో భారత్ తలపడనుంది. చదవండి: Nikhat Zareen: ఇది ప్రారంభం మాత్రమే.. అదే నా లక్ష్యం -
ఆసియా కప్‌లో నేడు భారత్-పాకిస్తాన్ ‘ఢీ’
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జకార్తాలో నేడు జరిగే తొలి మ్యాచ్‌తో భారత హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్ వేటను ప్రారంభించనుంది. బీరేంద్ర లాక్రా కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగనుంది. సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టులో 10 మంది కొత్త ఆటగాళ్లకు తొలిసారి అవకాశం లభించింది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్లో, డిస్నీ–హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఆసియా కప్‌లో రూపిందర్ సారథ్యంలో బరిలోకి...
ఈనెల 23 నుంచి జకార్తాలో జరిగే ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు సీనియర్ డ్రాగ్‌ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ కెప్టెన్‌గా... డిఫెండర్ బీరేంద్ర లాక్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. భారత్‌తోపాటు ఈ టోర్నీలో జపాన్, పాకిస్తాన్, ఇండోనేసియా, మలేసియా, కొరియా, ఒమన్, బంగ్లాదేశ్ జట్లు బరిలో ఉన్నాయి. టాప్–3లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశం హోదాలో భారత్‌కు నేరుగా ప్రపంచకప్‌లో ఎంట్రీ లభించింది. -
ఆసియా కప్‌లో భారత్ శుభారంభం..
ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. మస్కట్‌లో శుక్రవారం జరిగిన పూల్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో భారత్ 9–0 గోల్స్ తేడాతో మలేసియాపై ఘనవిజయం సాధించింది. కెరీర్లో 250వ మ్యాచ్ ఆడిన వందన కటారియా రెండు గోల్స్ సాధించింది. నవనీత్ కౌర్, షర్మిలా దేవి కూడా రెండేసి గోల్స్ చేయగా... దీప్ గ్రేస్ ఎక్కా, మోనిక, లాల్రెమ్సియామి ఒక్కో గోల్ సాధించారు. చదవండి: పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు.. ఆస్ట్రేలియా పర్యటన ఇక..! -
వావ్.. మనోళ్లు.. చైనాను చిత్తుచేశారు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియా కప్ హాకీ ఫైనల్లో మన అమ్మాయిలు దుమ్మురేపారు. పెనాల్టీ షూటౌట్లో ప్రత్యర్థి చైనా జట్టును 5-4 గోల్స్ తేడాతో.. భారత మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. జపాన్‌లోని కకామిగహరాలో ఆదివారం జరిగిన ఆసియా కప్ మహిళల హాకీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-చైనా జట్లు తలపడ్డాయి. ఆట ముగిసే సమయానికి ఇరుజట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలువడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు 2018 ఎఫ్ఐహెచ్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. చివరిసారిగా 2004లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్లో జపాన్‌పై విజయం సాధించి ఆసియా కప్‌ను సాధించింది. అంతేకాకుండా తాజా ఫైనల్లో డ్రాగన్ కంటీని ఓడించడం ద్వారా మొదటిరౌండ్లో తనకు ఎదురైన పరాజయానికి మన అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకున్నట్టైంది. నవజ్యోత్ కౌర్ బోణీ.. భారత-చైనా మహిళా జట్లు హోరాహోరీగా తలపడటంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ ఫస్టాఫ్‌లో 25వ నిమిషం వద్ద నవజ్యోత్ కౌర్ గోల్ చేసి.. భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించారు. సెకండాఫ్ మ్యాచ్‌లో 47వ నిమిషం వద్ద టియాన్టియాన్ లౌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో ఇరుజట్ల స్కోరు 1-1తో సమం అయ్యాయి. అనంతరం ఇరుజట్లకు గోల్స్ సాధ్యపడకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్లో ఐదు అవకాశాలు ఉండగా.. ఇరుజట్లు 4-4 గోల్స్‌తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో నిర్ణాయకమైన సడెన్ డేత్ కేటగిరీలో రాణి గోల్ చేయగా.. చైనా మాత్రం విఫలమైంది. దీంతో భారత జట్టుకు అద్భుతమైన విజయం వరించింది. -
సెమీస్ లో భారత్
కకమిగహర(జపాన్): ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ లో భారత్ మహిళలు తమ జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. పూల్-ఎలో హ్యాట్రిక్ విజయాలతో క్వార్టర్స్ కు చేరిన భారత మహిళలు.. తాజాగా జరిగిన క్వార్టర్స్ పోరులో సైతం విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 7-1 తేడాతో కజికిస్థాన్ ఓడించి సెమీస్ లోకి ప్రవేశించింది. భారత్ తరపున గుర్జిత్ కౌర్ మూడు గోల్స్(4, 42,56 నిమిషాల్లో) తో ఆకట్టుకోగా, నవనీత్ కౌర్(22, 27 నిమిషాలు), దీప్ ఎక్కా(16, 41 నిమిషాలు) తలో రెండు గోల్స్ తో మెరిశారు. ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే కజికిస్థాన్ క్రీడాకారిణి దోమష్రెనివా గోల్ చేసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. అయితే నాల్గో నిమిషంలో గుర్జిత్ కౌర్ గోల్ చేసి స్కోరును సమం చేసింది. ఆ తరువాత 16, 22, 27 నిమిషాల్లో భారత్ గోల్స్ చేస్తూ తమ ఆధిక్యాన్ని మరింత ముందుకు తీసుకుపోయింది. అదే జోరును కడవరకూ కొనసాగించిన భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. -
జయం మనదే
ఢాకా: దాయాది పాకిస్తాన్‌పై భారత హాకీ జట్టు విజయయాత్ర కొనసాగుతోంది. అటు ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లోనూ హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టింది. ఆదివారం జరిగిన పూల్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత జట్టు 3–1తో పాక్‌ను ఓడించింది. దీంతో తొమ్మిది పాయింట్లతో టాప్‌లో నిలిచింది. పాక్‌తో పోరులో గట్టి పోటీ ఎదురవుతుందని భావించినా భారత ఆటగాళ్లు అద్భుత రీతిలో చెలరేగి తొలి మూడు క్వార్టర్లలో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ జట్టుపై భారత్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. భారత్ తరఫున చిన్‌గ్లెన్‌సనా (17వ నిమిషంలో), రమణ్‌దీప్ సింగ్ (44వ ని.లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (45వ ని.లో) గోల్స్ సాధించారు. పాకిస్తాన్ తరఫున ఏకైక గోల్ అలీ షాన్ (48వ ని.లో) చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందే రెండు వరుస విజయాలతో భారత జట్టు సూపర్–4 రౌండ్‌కు చేరింది. కొత్త ఫార్మాట్ ప్రకారం రెండు పూల్‌లో టాప్‌గా నిలిచిన జట్లు రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో మ్యాచ్‌లు ఆడతాయి. అటు ఈ మ్యాచ్ ఓడినప్పటికీ పాకిస్తాన్ కూడా నాలుగు పాయింట్లతో తదుపరి దశకు చేరింది. సూపర్–4లో భారత్, పాక్, కొరియా, మలేసియా జట్ల మధ్య పోరాటం ఉంటుంది. తొలి రెండు క్వార్టర్లలో ఆధిపత్యం.. మ్యాచ్ ప్రారంభంలోనే భారత ఆటగాళ్ల నుంచి దూకుడైన ఆట కనిపించింది. మిడ్ ఫీల్డ్ నుంచి బంతిని తమ అదుపులో ఉంచుకుంటూ పాక్ గోల్‌పోస్టుపై దాడి చేసినప్పటికీ భారత జట్టు వారి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. తొలి పది నిమిషాలు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గట్టి పోటీనే కనిపించింది. 11వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం వచ్చింది. ఆకాశ్‌దీప్ బంతిని తన స్వాధీనంలో ఉంచుకుంటూ ముందుకెళ్లినా పాక్ ఆటగాళ్లు అడ్డుకోగలిగారు. 16వ నిమిషంలో పాక్‌కు తొలి పెనాల్టీ కార్నర్ లభించినా భారత ఆటగాళ్లు వారికి గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే భారత్ ఖాతా తెరిచింది. 17వ నిమిషంలో చిన్‌గ్లెన్‌సనా గోల్‌తో భారత్ 1–0 ఆధిక్యం సాధించింది. మరో రెండు నిమిషాల్లో గోల్ చేసే అవకాశం వచ్చినా తృటిలో తప్పింది. అటు 26వ నిమిషంలో పాకిస్తాన్‌కు రెండో పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కింది. అయితే భారత గోల్ కీపర్ సూరజ్ కర్కెరా అద్భుతంగా అడ్డుకోవడంతో పాక్ ఆశలు ఆవిరయ్యాయి. ఇక 28వ నిమిషంలో గుర్జంత్ సింగ్ దాదాపుగా గోల్ చేసినట్టే అనిపించినా బంతి కొద్ది తేడాతో వైడ్‌గా వెళ్లింది. ఈ సమయంలో పాక్ తమ దాడులను ఉదృతం చేసింది. కానీ కీపర్ సూరజ్ మాత్రం అప్రమత్తంగా ఉండడంతో పాక్ ప్రయత్నాలు ఫలించలేదు. మూడో క్వార్టర్ ప్రారంభంలో రెండు నిమిషాల వ్యవధిలో పాక్ ఆటగాళ్లు రిజ్వాన్, అబు మహమూద్‌లకు రిఫరీ ఎల్లో కార్డు చూపించడంతో ఐదు నిమిషాలపాటు మైదానాన్ని వీడారు. దీంతో పాక్ కొద్దిసేపు తొమ్మిది మందితోనే ఆడాల్సి వచ్చింది. అటు పాక్ గోల్ ప్రయత్నాన్ని కీపర్ సూరజ్ మరోసారి వమ్ము చేశాడు. అయితే ఈ దశలో భారత్‌కు లభించిన పీసీ కూడా విఫలమైంది. వరుణ్ సంధించిన షాట్ గోల్‌పోస్టు పైనుంచి వెళ్లింది. పాక్ కూడా తన పీసీని వృథా చేసుకుంది. ఈ దశలో భారత ఆటగాళ్లు విజృంభించడంతో వెంటవెంటనే రెండు గోల్స్ నమోదయ్యాయి. 44వ నిమిషంలో రమణ్‌దీప్ సింగ్ గోల్ సాధించగా మరో నిమిషంలోనే తమకు లభించిన పీసీని హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలచడంతో భారత్ 3–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే పాకిస్తాన్ కూడా 49వ నిమిషంలో తమ ఖాతా తెరవగలిగింది. సర్దార్ సింగ్ పొరపాటును సొమ్ము చేసుకుంటూ అలీ షాన్ నేరుగా ఆడిన షాట్ భారత నెట్‌లోనికి వెళ్లింది. ఆ వెంటనే మరో గోల్ కోసం విశ్వప్రయత్నం చేసిన పాక్ పీసీ కోసం రివ్యూకెళ్లింది. భారత డిఫెండర్ తమ ఆటగాడి స్టిక్‌ను అడ్డుకున్నాడని పాక్ ఆరోపణ చేసినా రివ్యూ కోల్పోయింది. చివరి పది నిమిషాల్లోనూ పాక్ పదేపదే దాడులు చేసినా కూడా ఫలితం లేకపోవడంతో పరాజయం ఖాయమైంది. -
బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం: ఆసియా హాకీ
ఇపో (మలేసియా): ఆసియా హాకీలో భారత్ జయభేరి మోగించింది. బంగ్లాదేశ్‌పై 9-1 గోల్స్ తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే కచ్చితంగా ఆసియాకప్ టైటిల్ గెలవాల్సిన స్థితిలో భారత జట్టు స్ఫూర్తిదాయకంగా ఆడుతోంది. ఆసియా కప్ హాకీ విజేతకే వల్డ్ కప్ అర్హత నేరుగా లభిస్తుంది. దక్షిణ కొరియా ఇది వరకే వల్డ్ కప్ అర్హత సాధించింది. దక్షిణ కొరియాతో సోమవారం జరిగిన పూల్ బి మ్యాచ్‌లో 2-0తో భారత్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో హాకీ బేబీలైన ఒమన్ జట్టుపై 8-0తో గెలిచిన భారత్, కొరియాపై విజయంతో సెమీస్‌కు చేరింది. చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించింది. -
ఆసియా కప్ హాకీలో భారత్ బోణీ
ఇపో (మలేసియా): ఆసియా కప్ హాకీలో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లోనే హాకీ బేబీలైన ఒమాన్‌ను 8-0 గోల్స్‌తో ఇండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం ఇండియా ఆధిపత్యం చెలాయించింది. ప్రథమార్థంలోనే ఇండియా కీలకమైన 4-0 లీడ్‌కు దూసుకెళ్లింది. మన్‌దీప్‌సింగ్ రెండు గోల్స్ చేయగా, రమణ్‌దీప్‌సింగ్ రెండు గోల్స్ చేశాడు. రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్, మలక్ సింగ్, ఊతప్ప ఒక్కో గోల్ చేశారు. ఆసియా కప్ హాకీ విజేతకే వల్డ్ కప్ అర్హత నేరుగా లభిస్తుంది. సౌత్ కొరియా ఇది వరకే వల్డ్ కప్ అర్హత సాధించింది. దాంతో వల్డ్ కప్‌లో వున్న ఒక్కస్థానం కోసం ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్, మలేసియా పోరాడుతున్నాయి. కాగా ఈ టోర్నమెంట్ విజేత జట్టు మాత్రమే వచ్చే ఏడాది నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తుంది. 1971లో మొదలైన ప్రపంచ కప్‌లో ఇప్పటిదాకా ప్రతిసారీ భారత్ బరిలోకి దిగింది. ఒకవేళ ఈసారి ఆసియా కప్‌లో భారత్ విఫలమైతే మాత్రం తొలిసారి టీమిండియా లేకుండానే ప్రపంచ కప్ జరుగుతుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఒక్కో గ్రూప్‌లో నాలుగేసి జట్లకు చోటు కల్పించారు. గ్రూప్ ‘ఎ’లో పాకిస్థాన్, జపాన్, మలేసియా, చైనీస్ తైపీ; గ్రూప్ ‘బి’లో భారత్, ఒమన్, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా ఉన్నాయి. సర్దార్ సింగ్ నాయకత్వంలోని 18 మంది సభ్యులుగల జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లే ఉన్నారు.